ఎపి కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ శుభవార్త

అర్హతలను బట్టి రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందరిని పర్మినెంట్ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కొద్ది సేపటి కిందటఆంధ్ర ప్రదేశ్ సచివాలయం ,మొదటి భవనం గ్రౌండ్ ఫ్లోర్ లోని గ్రీవెన్స్ హాల్ లో సచివాలయ ఉద్యోగులతో  సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ రేపు జరిగే క్యాబినెట్ మీటింగ్లో 27% ఐ ఆర్, మరియు సిపియస్ రద్దుపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.  ఇలాగే  గవర్నమెంట్ లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులను వారి విద్యా అర్హతను బట్టి పర్మినెట్ చేయడానికి కమిటీ వేస్తామని చెప్పారు. ఇదే విధంగా గతంలో హామి ఇచ్చినట్లు,  ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచుతామని కూడా ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే…

◆ ప్రభుత్వం మంచి పాలన అందించాలంటే మీ అందరి సహకారం అవసరం.

◆ కొన్ని పనులు చేయించుకోవడం కోసం ముఖ్యమంత్రి గారితో సన్నిహితంగా ఉండటం సహజం…

◆ గతంలో చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా ఉన్న ఉద్యోగులను కూడా నేను ఎవరిని తప్పుపట్టాను…

◆ మ్యానిఫెస్టోలోని అన్ని హామీలు నిరవేర్చడానికి మీ అందరి సహకారం అవసరం..

ఈ సమావేశంలో పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు మరియు ఉద్యోగులు సుమారు 300 మంది. పాల్గొన్నారు.