కృష్ణానది గురించి ఈ విషయం తెలుసా?

కృష్ణా నది తీరం వెంబడి సుమారు మూడువందల కిలో మీటర్ల పొడవునా విపరీతంగావజ్రాలు దొరికేవి. కృష్ణా -తుంగభద్రల కలిసే సంగమేశ్వరం దగ్గిర నుంచి విజయవాడ దాకా, ఇంకా స్పష్టంగా చెబితే కొల్లూరు-పరిటాల బెల్టుదాకా ఉండే ప్రాంతంలో విపరీతంగా వజ్రాల మైనింగ్ జరిగేది.
ప్రపంచప్రఖ్యా వజ్రాలయిన కొహినూర్(186 క్యారెట్లు), గ్రేట్ మొఘల్ (878), పిట్ లేద రిజెంట్ (410), ఓర్లాఫ్ (300) నిజాం( 440)హోప్ (67) వజ్రాలు ఇక్కడి దొరికినవే. అపుడు ఈ ప్రాంతమంతా గోల్కొండ ఏలుబడి లో ఉంది. అందువల్ల ఈ వజ్రాల వ్యాపారానికి గొల్కొండ ఇంటర్నేషనల్ హబ్ అయింది.
గొల్కొండ వజ్రాల కోసం యూరోపియన్ వ్యాపారాలు ఎగబడే వారు. వాళ్లంతా భారత ఉత్తర తీరంలోని రేవులనుంచి వచ్చి గొల్కొండ చేరుకునే వారు. ఒకటి రెండేండ్లు ముందుగానే యూరోపియన్ వ్యాపారులు గొల్కొండ (కృష్ణానది) వజ్రాల కోసం రిజర్వు చేసుకోనేవారు. ఈ వ్యాపారంలో ఇటలీకి చెందిన ఐజాక్ ఎర్గాస్ బాగా పేరు మోసిన వ్యక్తి.
ఇటలీ లోని లివొర్నో రేవులో ఆయన కార్యాలయంఉండేంది. అక్కడి వచ్చి వజ్రాలు కోసం అడ్వాన్సు చెల్లించి బుక్ చేసుకునే వారు. లివొర్నో నుంచి ఈ ఆర్డర్లు లిస్బనుకు అక్కడి నుంచి గోవాకు వచ్చేవి. గోవా నుంచి గొల్కొండ రోడ్డు మార్గంలో వచ్చేవి. వీటన్నింటిని ఒక వ్యక్తి తీసకుని వచ్చేవాడు. అన్ని సవ్యంగా జరిగితే, అంటే సముద్రంలో ఉపద్రవాలు ఎదురుకాకుండా ఉంటే, ఒకటి రెండేళ్లలో గొల్కొండ వజ్రాలు బుక్ చేసిన వాళ్లకి అందేవి.
కొంకణ్ తీరంలో ఉండే హిందూ వ్యాపారస్థులు యూరోప్ నుంచి వచ్చే కోరల్స్ తీసుకుని వజ్రాలు అందించే వాళ్లు. ఈ వజ్రాలన్నీ కృష్ణా నది నుంచి వచ్చే , ఈ వ్యాపారంతో గొల్కొండ ఆరోజుల్లోనే గ్లోబల్ వ్యాపారం చేసి సంపన్నమయింది. ఈ కారణాలచేతనే కృష్ణానదికి వజ్రాల నది (River of Diamonds) అని పేరొచ్చింది.
హైదరాబాద్ లో ఉండే కార్వాన్ ప్రాంతం సూదూర ప్రాంతాలను గుర్రాల బండ్ల మీద వచ్చే విడిది చేసే ప్రాంతం. వజ్రాల కోసం గొల్కండ కొసం వచ్చే సవారీ బండ్లన్నీ ఇక్కడ తిష్టవేసేవి. అందుకే ఈ ప్రాంతానికి కర్వాన్ అని పేరొచ్చింది.
Source: 1.Deccan Heritage (2007) (Ed.Harsh K Gupta et al.)
2.  Bound Together, Nayan Chanda (2007),
3.Globalization of Golkonda (2007) Sanjay Baru
(ఇది నచ్చితే, మీ మిత్రులందరికి షేర్ చేయండి, trendingtelugunews.com ను ఫాలో కండి)