చడీ చప్పుడు చేయకుండా అయిదో సారి ముఖ్యమంత్రి ఈయన

ఈ రోజు కొద్ది సేపట్లో ( ఉ.10.30) ఒరిస్సా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ అయిదోసారి ప్రమాణం చేయబోతున్నారు.20 మంది క్యాబినెట్ సభ్యులుంటారు సగం కొత్తవాళ్లు. చడీచప్పు డు చేయని ముఖ్యమంత్రి దేశంలో ఆయనే. కేంద్రంలో చక్రం తిప్పాలనుకోడు. ఆడంబరాలకు పోడు,విదే పెట్టబడుల పేరుతో విమానాలలో చక్కర్లు కొట్టడు. దావోస్ వెళ్లాలనుకోడు.పెద్ద పబ్లిషిటీ చేసుకోడు.ఉన్న అలవాటంతా పుస్తకాలు చదవడమే. వారసుల్ని తయారుచేసుకోలేదు. దాన్ని ప్రజలకు విదేలేశాడు.ఆయన జీవితం కూడాసింపుల్ గానే ఉంటుంది. అందుకే ప్రజలు ఆయన్ని వదులుకోవడం లేదు… ఈ మధ్య మీడియా వాళ్లు ‘వారసుని తయారుచేసుకోవడం లేదా,’అని అడిగితే,  ఆ అవసరం లేదు అన్నారు. వారసుడిని ప్రజలే ఎన్నుకుంటారని చెప్పారు. ఆయన అవివాహితుడు.  అయినా సరే ప్రభుత్వంలో బంధువుల పెత్తనం ఉండదు.

ఇక ఫ్రంటుల కూడగట్టే పని జోలికి వెళ్లడు. తను, తన ఒడిషా తప్ప జాతీయ రాజకీయాల జోలికివెళ్లలేదు. కేంద్రంలో కింగో కింగ్ మేకరో కావాలని ఎపుడూ అనుకోలేదు. అందుకే కెసిఆర్ యాత్రల మీద, మమతాబెనర్జీ ర్యాలీల మీద పెద్ద శ్రద్ధ చూపలేదు. చంద్రబాబు నాయుడు దేశమంతా తిరిగినా ఒరిస్సాకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. అలాగనీ,  నవీన్ పట్నాయక్ బిజెపితో కూడా ఏమంతా చనువుగా లేడు.

ప్రధాని పర్యటించినా ఆయన ఒక ముఖ్యమంత్రిలా హుందాగా ఉన్నాడు తప్ప వంగి వంగి సలాములు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఎవరిదైనా అందరితో ఒక లాగే ఉండటం మాకు అలవాటు అని టైమ్సాఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.కేంద్రంలో ఎవరున్నా వాళ్లతో మాకు నిర్మాణాత్మక సంబంధాలుంటాయని చెప్పారు.

ఎన్నికల క్యాంపెయిన్ లో కూడా ఎవరినీ దూషించడం చేయడు.

రాష్ట్రంలో ఇంత బలంగా ఉన్నారు, ఇక కేంద్రంలోకి వచ్చి చక్రం తిప్పవచ్చుగదా అని అడిగితే, ‘మాదొక ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీలకు ప్రాంతీయ లక్ష్యాలుంటాయి.ఈ ప్రాంతీయ డిమాండ్ ను నెరవేర్చితే ప్రాంతీయ పార్టీలకు చాలా ప్రాముఖ్యం వస్తుంది. ఫెడరల్ నిర్మాణం దేశానికి చాలా ముఖ్యమని చెబుతూ, పరోక్షంగా రాష్ట్రం వదిలిపోయే ప్రసక్తి లేదని చెప్పారు.

ఆయన నాయకత్వంలోని  పార్టీ బిజూ జనతా దళ్ 2000 నుంచి అధికారంలో ఉంది. అయినా ప్రతిపక్షాల నాశనమయ్యాయి, కూలిపోయియి, చినిగిపోయాయనే పెద్ద పెద్ద ప్రకటనలు చేయరు. ఈ సారి 147 సభ్యుల సభలో 112 సీట్లు గెల్చుకున్నాడు. గతంలో అంటే 2000, 20004, 20009, 2014 లలో రాజ్ భవన్ లో ప్రమాణం చేసినా మొదటి సారి, ఈ సారి ఆయన గ్రాండ్ పదవీ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీని కూడా ఆయన కార్యక్రమానికి ఆహ్వానించారు.

ఆయన క్యాబినెట్ ను కూడా పెద్ద ఏర్పాటు చేయరు. సర్కారియా కమిషన్ సిఫార్సుల ప్రకారం, అసెంబ్లీ సభ్యులసంఖ్యలో 15 శాతం దాకా క్యాబినెట్ సభ్యులను తీసుకోవచ్చు. ఆయితే ఆయన దీనికంతా ప్రాముఖ్యమీయడు. చిన్న క్యాబినెట్ తోనే బండి లాగిస్తాడు. ఆయన క్యాబినెట్ లో ఈ సారి 10 కొత్త ముఖాలుంటాయి. ఇందులో ఇద్దరు మహిళలు.

నవీన్ పట్నాయక్ క్యాబినెట్ ఇదే

క్యాబినెట్ మంత్రులు

Ranendra Pratap Swain
Bikram Keshari Arukha
Prafulla Chandra Mallik
Niranjan Pujari
Padmanabha Behera
Pratap Jena
Arun Kumar Sahoo
Sudam Marandi
Susanta Singh
Naba Kishore Das
Tukuni Sahu

సహాయ మంత్రులు

Ashok Chandra Panda
Samir Ranjan Das
Jyoti Prakash Panigrahi
Dibya Shankar Mishra
Premananda Nayak
Raghunandan Das
Padmini Dian
Tusharkanti Behera
Jagannath Saraka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *