తెలుగు మీడియా వర్గాల్లో వైరల్ అయిన పోస్ట్

హోంమంత్రి, డిజిపి, హైద‌రాబాద్‌,రాచ‌కొండ‌,సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ల‌కు బ‌హిరంగ లేఖ‌..

తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఉన్న మీడియా సంస్థ‌ల‌లో అత్య‌ధిక భాగం అంటే 90 శాతం వ‌ర‌కు తెలుగు మీడియా సంస్థ‌లు ఉన్నాయి. ప్ర‌జాస్వామ్యం ప్ర‌కారం అత్య‌ధికంగా ఉన్న తెలుగు మీడియాకు గౌవ‌రం ఇవ్వ‌డం స‌ముచితం. మ‌న అధికార భాష కూడా తెలుగు. అయితే ప్రస్తుతం మీ కార్యాల‌యం నుంచి మీ పిఆర్‌వోలు కేవ‌లం ఇంగ్లీష్‌లోనే ప్రెస్‌నోట్స్ పంపిస్తున్నారు. ద‌య‌చేసి తెలుగు భాష‌కు ప్రాధాన్య‌త ఇచ్చి తెలుగులో ప్రెస్‌నోట్‌లు ఇచ్చే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటార‌ని ఆశిస్తున్నాము.

ఇంగ్లీష్‌, ఊర్దూ, హిందిలో కూడా ప్రెస్‌నోట్‌లు ఇస్తే మాకు అభ్యంత‌రం లేదు. కానీ తెలుగు మాత్రం ద‌య‌చేసి మ‌ర‌వ‌కండి. మీ పిఆర్‌వోల‌కు నెల‌కు రూ.20,000 నుంచి రూ.70,000 వ‌ర‌కు జీతాలు ఉన్నాయ‌న్న విష‌యం మ‌ర‌చిపోవద్దు. రోజుకో, వారానికో, నెల‌కో, ఆరు నెలలకి ఒకసారి మీ కార్యాల‌యం నుంచి వెలువ‌డే ప్రెస్‌నోట్ తెలుగులో లేక‌పోవ‌డం బాధాక‌రం. ఇత‌ర ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు చెందిన పిఆర్‌వోలు తెలుగులో ప్రెస్‌నోట్‌ను విడుద‌ల చేస్తున్న విష‌యం మీకు తెలియ‌నిది కాదు.

మీ పిఆర్‌వోల‌కు తెలుగు చ‌ద‌వడం, రాయ‌డం రాక‌పోతే నేర్చుకోమ‌నండి లేదా వేరే వాళ్ల‌ను నియ‌మించుకోవాల‌ని సూచ‌న‌. కేంద్ర హోం మంత్రి హైద‌రాబాద్‌లో పాల్గొంటే పిఐబి వారు తెలుగులో ప్రెస్‌నోట్ పంపించారు. ఢిల్లీలో ఉండే కేంద్ర మంత్రి పాల్గొనే కార్య‌క్ర‌మాలే తెలుగులో వ‌స్తుంటే… తెలంగాణ‌లో మ‌న పోలీసు కార్య‌క్ర‌మాలు తెలుగులో ప్రెస్‌నోట్ రాక‌పోవ‌డం శోఛ‌నీయం. ఇప్ప‌టికైనా మా బాధ‌ను అర్ధం చేసుకుని తెలుగుకు గౌర‌వం ఇస్తార‌ని ఆశిస్తున్నాము. ఏమైనా త‌ప్పులు ఉంటే పెద్ద మ‌న‌సుతో క్ష‌మించండి..!

తెలుగు ప‌త్రిక‌లు

ఈనాడు- ఆంధ్ర‌భూమి- ఆంధ్ర‌జ్యోతి- ఆంధ్ర‌ప్ర‌భ‌- వార్త‌- సాక్షి- న‌మ‌స్తె తెలంగాణ‌- మ‌న తెలంగాణ‌- న‌వ తెలంగాణ‌- ప్ర‌జాప‌క్షం- సూర్య‌- విశాలాంధ్ర త‌దిత‌ర తెలుగు దిన‌, వార ప‌త్రిక‌లు.

తెలుగు న్యూస్ ఛాన‌ల్స్‌

టివి 9- ఈ టివి- ఎన్ టివి- ఎబిఎన్ ఆంధ్ర‌జ్యోతి- సాక్షీ- టి న్యూస్‌- టివి 5- వి 6- 10 టివి- రాజ్‌న్యూస్‌- హెచ్‌యం టివి- జై తెలంగాణ టివి- ప్ర‌జాన్యూస్‌- స్టూడియో ఎన్‌- మోజో టివి- జై తెలంగాణ – 99 టివి- 6 టివి త‌దిత‌ర తెలుగు ఛాన‌ల్స్‌.

ఇట్లు
తెలుగు భాషాభిమానులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *