పవన్ ఆగ్రహం, ఆవేదన ఇందుకే… (వీడియో)

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వరుస ట్వీట్ల దాడి మొదలుపెట్టారు. తెలుగుదేశం అనుకూల చానెల్స్ పేరున్న టివి9, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, మహాటివిలను టార్గెట్‌ చేస్తూ ఆయన శనివారం ఉదయం ట్వీట్లను మిసైల్స్ గా ప్రయోగించారు. ఈ ట్వీట్ల వైనక ఉన్న తన ఆవేదనను ఆయన మీడియాకు వివరించారు. చూడండి.

టాలీవుడ్‌లో నటి శ్రీరెడ్డి లేవనెత్తిన క్యాస్టింగ్‌ కౌచ్‌ దుమారమే ఇదంతా. ఈగొడవలో శ్రీరెడ్డి పవన్‌ను దూషించడం, ఇలా దూషించమని చెప్పింది తానేనని దర్శకుడు రాంగోపాల్‌ వర్మ వెల్లడించడం, దీనిని టీడీపీ అనుకూల మీడియా అండతో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కుట్ర ఉందనడంతో ఈ వివాదం తీవ్రమయింది.

అశ్లీలాన్ని, నగ్నత్వాన్ని వ్యాపారంగా మార్చుకుంటూ.. మన తల్లులు, కుమార్తెలు, అక్కచెల్లెళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలను ప్రసారం చేస్తున్న టీవీ9, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానెళ్లను బహిష్కరించాలని పవన్‌ అంతకుముందు ట్వీట్‌ చేశారు. సంబంధం లేని విషయాల్లోకి తనను లాగి, తన తల్లిని అసభ్యంగా తిట్టించడం వెనుక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌ హస్తం ఉందని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.

రూ.10 కోట్లు ఖర్చు పెట్టి వారి మీడియా సంస్థలైన టీవీ9, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, మహా న్యూస్‌ మరికొన్ని ఇతర చానళ్ల ద్వారా తనపై, తన కుటుంబంపై నిరవధిక మీడియా ఆత్యాచారం జరిపారని, జరిపిస్తున్నారని పవన్ మండిపడ్డారు. మహా న్యూస్‌ కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి బినామీ పెట్టుబడులతో నడుస్తున్నదని కూడా అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *