ఈ ఏడాది సివిల్స్ 714 ర్యాంకు సాధించిన సతేంద్ర సింగ్ విజయం వెనక చాలా ఇన్ స్పైరింగ్ కథ ఉంది. ఇపుడాయన ఈ ర్యాంకు తో మొదలు పెట్టి ఐఎఎస్ కొట్టేయాలనుకుంటున్నాడు.
అత్యంత క్లిష్టమయిన సివిల్స్ ఛేదించడమెలాగో తెలిసింది కాబట్టి, ఒకటి కాకుంటే రెండు సార్లలో ఐఎఎస్ కొడతానని లక్ష్యంగా పెట్టకున్నాడు. అది ఆయన పట్టుదల.
ఇక అసలు విషయానికి వస్తే… ఆయన అంంధుడు. తనకు కళ్లెలా పోయాయో ఆయనే వివరించారు. చిన్నపుడెపుడో, ఒకటి, ఒకటిన్నర సంవత్సరాల వయసపుడు, ఆయనకు న్యూమోనియా వచ్చింది. పల్లెటూరి తల్లితండ్రులు ఆయన్ని ఒక లోకల్ డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్లారు. ఆ క్లినిక్ లో ఆయనకు ఏదో ఇంజెక్షన్ ఇచ్చి ఇంటికి పొమ్మన్నాడు. అది బెడిసికొట్టింది.. జొరం పొగొడుతుందునుకున్న సూది మందు కంట్లోని నరాలను నాశనం చసింది. చూపు పోయింది. ప్రపంచంలోకింకా రెండడుగులు వేయకుముందే, చుట్టురా జనాన్నింకా గుర్తించక ముందు ఆయన జీవితంలోకి చీకటి ప్రవేశించింది.
ఇలాచూపు పోవడం, చిన్నపుడే ఆయన మానసిక ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చింది. ఇరుగు పొరుగు పిల్లలతో పోట్లాడే వాడు. తల్లితండ్రులు వ్యవసాయ కార్మికులు కాబట్టి, చూపు లేని పిల్లవాడిని ఎలా తీర్చిదిద్దాలనే దానిమీద దృష్టి పెట్టలేకపోయారు.
నిజాయితీకి శిలువ: నిష్కళంక IAS అధికారి టర్మినేషన్ కు యత్నం
గాంధీజీ గురించిన 8 అబ్బురపరిచే వాస్తవాలు
చదువు చెప్పించ లేకపోయారు. అయితే, సతేందర్ అద్బుతమయిన జ్ఞాపకశక్తి అలవర్చుకున్నారు. ఆయనెపుడు చదువుకుంటున్న కొంతమంది పిల్లల మధ్య కూర్చునే వాడు. వాళ్ల వల్లెవేసే ఎక్కాలు, లెక్కలు, ఇంగ్లీష్ పాఠాలు గుర్తు పెట్టుకుని తాను నేర్చుకునే ప్రయత్నం చేశాడు. నేర్చుకున్నాడు, జీవితంలో ఇది తొలి విజయం.
చూపు లేకపోయినా సరే, చుట్టుపక్కల పిల్లకంటే బాగా నేర్చుకుని తన ప్రతిభను చూపించాలని సతేందర్ ఎపుడూ అనుకునే వాడు. ఈ అవకాశం ఆయనకు ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న మేనమామ రూపంలో వచ్చింది.
సతేందర్ ని ఢిల్లీకి తీసుకువచ్చిన కింగ్స్ వే క్యాంప్ లోని ప్రభుత్వం అంధుల ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ లో చేర్పించాడు. చూపు లేని వారికి బ్రెయిలీ లిపి ఉందని ఆయనకు అపుడే తెలిసింది. టేలర్స్ ఫ్రేమ్స్ ద్వారా స్పర్శతో ఆయన లెక్కలు కూడా నేర్చుకున్నాడు.
తానేమో పల్లెటూరి అంధ విద్యార్థి. ఉంటున్నది కొత్త చోట,అందునా మహానగరంలో. అడ్జస్టు కావడం కష్టమయింది. చదువుకోవడం లో ఉన్న యాతన పడలేక చాలా సార్లు, ఈ చదువొద్దు రాబాబు, వూరికిపోతే హాయిగా ఉంటుందిగా అని అనిదిగులువడ్డ సందర్భాలూ ఉన్నాయి. అయితే, ఇలా సతమవుతుంటే కాలం ఆగిపోదుగా..కాలం ముందుకు సాగుతూ వెళ్లింది. తను అంధుడి చదువు మెలకువలన్నీ నేర్చుకున్నాడు, పదేళ్లలో 2009లో సీనియర్ సెకండరీ విద్య పూర్తి చేశాడు. కారుచీకటి జీవితంలోకి కాంతి ప్రసరించడం మొదలయింది.
బోర్డు పరీక్షల్లో మంచి మార్కులు రావడంతో సతేందర్ ప్రతిష్టాకరమయిన సెయింట్ స్టీఫెన్ లో బిఎ సీటు సంపాదించాడు.అయితే, తనకు ఇంగ్లీష్ రాదనే జంకు పీడించింది. ఇంతవరకు తాను చదివింది హిందీ మీడియం.మాట్లాడేవి హిందీ ముక్కలే.
దానికి తోడు కాలేజీ వాతావరణం కూడా ఆయనకు అనుకూలంగా లేని కొత్త ప్రపంచంగా కనిపించింది. బాాగా నాగరిక ప్రపంచం.తనేమో వాయువ్య ఉత్తర ప్రదేశ్ అమ్రోహా మెరటు. చుట్టూర ప్రజలు రకరకాల భాషలలో మాట్లాడుతున్నారు. సతేందర్ కు తెలిసిందొకటే. అయినా, చూపులేని తనాన్ని అధిగమించినపుడు ఇదే మంత పెద్దదా ? అనుకుంటూ కరేజ్ కూడదీసుకునే వాడు.
కాలేజీలో చాలా కష్టపడ్డాడు. దీనికితోడు ఆయనకు కాలేజీ ప్రొఫెసర్ల మద్దతు బాగా లభించింది. అంతా చేయూత నిచ్చారు ఇక దూసుకుపో అన్నారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ వలసన్ థంపు ఉపన్యాసాలు, అకడిమికేతర కార్యకలాపాలలో తాను పాలుపంచుకునేలా చేశాయి. తన అనుభవం స్ఫూర్తికావాలని ఆయన అందరితో షేర్ చేసుకున్నారు.
కాలేజీ ది హిందూ, ఫ్రంట్ లైన్, ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ వంటి పత్రికలకు ఆయన్ని పరిచయం చేసింది. దీనితో ఆయన న్యూనతా భావాన్ని అధిగమించాడు.
విజయవంతగా డిగ్రీ పూర్తి చేసి జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషన్ రిలేషన్స్ లో ఎంఎ సీటు సంపాదించాడు. అది రెండో విజయం.
అక్కడి లిబరల్ వాతావరణం సతేందర్ లో సంపూర్ణమయిన మార్పు తీసుకువచ్చింది.తనకుచూపు లేదనే భావాన్ని పూర్తిగా పొగొట్టింది. అతనిపుడు అందరిలాంటి మనిషయ్యాడు. ఆమాటకొస్తే రెండాకులే ఎక్కువేనేమో…
చిన్నపుడు బ్రెయిలీలో చదువుకునే వాడు, ఇపుడు హరీష్ కుమార్ అనే లోకల్ గార్డియన్ సహాయంతో ఒక కంప్యూటర్ కొన్నాడు. స్క్రీన్ డింగ్ సాఫ్టేవేర్ సంపాదించాడు. అది పుస్తకాలను, ఇ-న్యూస్ పేపర్లను చదివేస్తూఉండటంతో ఆయన ప్రిపరేషన్ తేలికయింది. పాఠాలను, ఉపన్యాసాలను ఆయన పెన్ డ్రైవ్ లో స్టోరీచేసుకుని వింటూ పరీక్షలకు ప్రిపేరయ్యాడు.
జెఎన్ యు ఆయనకు విశాల వైవిధ్యభరితమయిన ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఎమ్మేతర్వాత ఎమ్ ఫిల్ లో చేరాడు.అపుడే ఆయన ఢిల్లీ యూనివర్శిటీ అరబిందో కాలేజీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం కూడా వచ్చింది. సరిగ్గా అలాంటపుడు తొలిసారిగా ఆయనకు సివిల్స్ రాయలన్న ఆలోచన వచ్చింది. ఈ లోపు జెఎన్ యు లో పిహెచ్ డిలో కూడా చేరాడు. సివిల్స్ రాశాడు.పల్లెటూరి పిల్లగాడు పరీక్ష నెగ్గాడు.
ఆయన కృషి ఫలితం 714 ర్యాంకుగా ఆయనకు ఎదురయింది. ఈ ర్యాంకు సాధించినదానికంటే, తన తల్లి ఫోటో పత్రికల్లో అచ్చుకావడం ఆయనకు చాలా సంతోషాన్నిచ్చింది.
వైకల్యం ఏ రూపంలో ఉన్నాజీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు అడ్డంకి కాదన్నదని జీవితంలో ఆయన నేర్చుకున్నపాఠం. ఇపుడాయన ఈ ర్యాంకుతో తృప్తి పడకుండా ఐఎ ఎస్ సాధించేందుకు సిద్ధమవుతున్నాడు.
(ఫోటోలు ఫేస్ బుక్ నుంచి)
(Like this story? Share it with a friend)