నిజాయితీకి శిలువ : సీనియర్ IAS అధికారిని టర్మినేట్ చేసే యత్నం

నిజాయితీ పరుడిగా బాగా పేరున్న కేరళ క్యాడర్ సీనియర్ ఐఎఎస్ అధికారి డాక్టర్ రాజు నారాయణ స్వామిని ఉద్యోగం నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆయన నిజాయితీ గురించి తెలిసిన వాళ్లు, అవినీతి మీద, ల్యాండ్ మాఫియా మీద ఆయన చేసిన పోరాటం గురించి తెలిసిన వాళ్లు, అభిమానులు ఆయన్ను తీసేయవద్దని, అలాంటి వాళ్లు ప్రభుత్వాలలో ఉండాలని ఆన్ లైన్ క్యాపెంయిన్ మొదలు పెట్టారు.
ఈ లోపు ఆయన ఉద్యోగానికి అనర్హుడని చెబుతూ కేరళ ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికార్ల కమిటీ సిఫార్సు చేసింది.అయితే, ఆయన్ని తీసేందుకు కుట్ర జరుగుతూ ఉందని ప్రచారం జరగడంతో కేరళ ప్రజల్లో , సోషల్ మీడియా తీవ్రంగా నిరసన మొదలయింది. దీనిని గ్ర హించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ టర్మినేషన్ సిఫార్సు లేఖను ప్రధాన కార్యదర్శి టామ్ జోసెఫ్ కు వాపసు పంపించారు.
తనని కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుండి కోకనట్ బోర్డు నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ రాజు వేసిన క్యాట్ లో వేసిన పిటిషన్ స్టేటస్ ఏమిటి; ఆయన సిఆర్ లో ఏమయిన నెగెటివ్ గా రాశారా… ఇలా కొన్ని క్లారిఫికేషన్లు కోరుతూ ముఖ్యమంత్రి ఫైల్ ను వెనక్కిపంపారు.
1991వ బ్యాచ్ ఐఎఎస్ కు చెందిన రాజు అడిషనల్ చీప్ సెక్రెటరీ ర్యాంకు అధికారి. 2018 ఆగస్టులో ఆయనని కోకనట్ బోర్డు చెయిర్మన్ గా కేంద్రం నియమించింది.ఈ బోర్డు నుంచి ఆయనను ఈ మార్చిలో తొలగించారు. తనని ఇలా ఉన్నఫలానా తొలగించడాన్ని చాలెంజ్ చేస్తూ ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT)లో పిటిషన్ వేశారు. దీని మీద ఈ జూలైలో తీర్పువెలువడనుంది.
అయినా సరే, అర్జంటుగా ఆయనను ఉద్యోగం నుంచి తొలిగించాలని కేరళ చీఫ్ సెక్రెటరీ అధ్యక్షతన ఉన్న కమిటీ సిఫార్సు చేసింది.
 గాంధీజీ గురించిన 8 అబ్బురపరిచే వాస్తవాలు
కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలో ఉండే కోకనట్ బోర్డుకు బెంగుళూరు, కొలకతాలలో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి.
బోర్డులో పనిచేసే అనేక మంది అవినీతి పరులైన అధికారులను ఆయన సస్పెండ్ చేశారు. ఆయనని కొనసాగిస్తే అవినీతి మీద రాజు మరింతలోతుగా విచారణ చేసి ప్రముఖుల పేర్లను కూడా బయటపెడతాడనే భయం బోర్డులో మొదలయింది.
ఈ సస్పెన్షన్ లను ఉపసంహరించుకోవాలని బిజెపి కేంద్ర మంత్రి సదానంద గౌడ తన మీద వత్తిడి తెచ్చినా రాజు నారాయణ స్వామి వినడం లేదు. బోర్డు లో బాగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఇద్దరు సీనియర్ అధికారుల సస్పెన్షన్ ను ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి గౌడ రాసిన లేఖను ఆయన ఏకంగా కోర్టుకే సమర్పించారు.
ఇలా ఎక్కడ పోస్టింగిచ్చినా రాజూ చేసిన మొట్టమొదటి పని అక్కడ ఉన్న ల్యాండ్ మాఫియాను పట్టుకోవడం, అవినీతి అధికారులను శిక్షించడమే. బోర్డులో ఉన్నపుడు మండ్య కోకనట్ వ్యవసాయక్షేత్రంలో ఉన్నటేకు చెట్లను అక్రమంగా నరికి కోట్ల రుపాయలు కాజేసిన విషయాన్నిరాజు బోర్డు ఛెయిర్మన్ గా వస్తూనే బయటపెట్టాడు.
తన మీద చాలా మంది పగబట్టారని, రాజకీయ గాడ్ ఫాదర్ లేకపోతే పనిచేయలేని పరిస్థితి ప్రభుత్వంలో ఉందని ఆయన విలేకరులకు చెప్పాడు. ‘ నా జీవితం స్తంభించి పోయింది. నేను జీతం మీద అధారపడి జీవిస్తున్నాను. జీతం రాకపోతే తిండి దొరకని పరిస్థితి నాది. మూడు నెలలుగా నాకు జీతం లేదు. కోర్టు కేసులకు నా సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నాను. ఇకనేనే లాయర్ గా వాదించుకోవాలనుకుంటున్నాను. నాకు కంపల్సరీ రిటైర్ మెంట్ నోటీసు ఇస్తే పెన్షన్ ఇవ్వాలనేమీ లేదు,’ అని ఆయన విలేకరులకు చెప్పారు.
2007 లో ఇదుక్కి జిల్లా కలెక్టర్ గా ఉన్నపుడు ల్యాండ్ మాఫియా మీద కఠినంగా వ్యవహరించినప్పటినుంచి తను బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అయన చెప్పారు. అపుడే ఆయన మున్నార్ ఆపరేషన్ ప్రారంభించాడు. మున్నార్ ప్రాంతంలో భూమలును అక్రమంగా కభళించిన వారందరిని ఆయన ఖాళీ చేయించాడు. అపుడది రాష్ట్రం తుఫాన్ సృష్టించింది. ఇందులోచాలా మంది ప్రముఖులుండంతో ఆయన వ్యతిరేకంగా వత్తిడి మొదలయింది. ఈ ఆఫరేషన్ ను నిలిపివేయాలని ఉత్తర్వులొచ్చాయి. కబ్జాదారులను ఖాళీ చేయించడం మధ్యలోనే అపేయాల్సి వచ్చింది.
తన పరిస్థితి, ప్రభుత్వంలోని పెద్దల తో గొడవపడిన అడిషనల్ పోలీస్ డైరెక్టర్ జనరల్ జేకాబ్ ధామస్, నాలుగు రోజుల కిందట యావజ్జీవ శిక్షపడిన గుజరాత్ క్యాడర్ ఐపిఎస్ అధికారి సంజీవ్ భట్ లాగా తయారవుతున్నది ఆయన చెబుతున్నారు.
సంజీవ్ భట్ మీద 1990 నాటి పాత కస్టోడియల్ డెత్ కేసు దుమ్ముదులిపి కేసు పెట్టారు. కారణం ఆయన నిజాయితీగా,రూల్ అఫ్ ది లా కోసం ఏలినివారితో తగవు పెట్టుకోవడమే.
ఇదే దారిలో నడిచిన రాజు నారాయణ స్వామికేమవుతుందో  చూడాలి.
రాజునారాయణ స్వామి గురించి…
రాజు నారాయణ స్వామి కేరళ కు చెందిన వాడు. డబ్బున్నవాళ్లు కాకపోయిన మంచి విద్యావంతుల కుటుంబంలో 1968లో పుట్టారు.
ఆయన తల్లిదండ్రులిరువురు ప్రొఫెసర్లు. అందువల్ల చదువుకు సంబంధించిన ఆయనకు ఎలాంటి అడ్డంకులు లేవు. ఐఐటి ఎంట్రెన్స్ లో టాపర్ గా వచ్చాడు. మద్రాస్ ఐఐటి కంప్యూటర్ సైన్స్ లో టాపర్ గా వచ్చాడు తర్వాత 1991లో సివిల్స్ టాపర్ గా నిలిచాడు.
బిటెక్ తర్వాత ప్రతిష్టాత్మకమయిన అమెరికా మసచూసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫెలోషిప్ వచ్చినా కాదని ఆయన సివిల్స్ వైపు వచ్చాడు. సివిల్స్ కోసం ఎవరూ ఎంచుకునేందుకు సాహసించని మ్యాథ్స్, ఫిజిక్స్ ఆప్షనల్స్ తీసుకుని ప్రిపేర్ అయ్యారు.
1991లో ఆయనకు కేరళ క్యాడర్ లభించింది. గత 27 సంవత్సరాల కాలంలో ఆయన ఎన్నో కీలకమయిన పదవులను నిర్వహించారు. ప్రతిచోట ఆయన ఎంతోనిజయితీగా పనిచేయడమే అవినీతి భరతం పట్టడమే చేశారు.
ఆయన చేసిన సుదీర్ఘమయిన అవినీతి వ్యతిరేక పోరాటానికి దేశమంతా గుర్తింపు వచ్చింది. అయితే, ఏలినవారికికోపం రావడంతో 27 సంవత్సరాల కాలంలో 22 సార్లు ట్రాన్స్ ఫరయ్యారు.
ఐఎఎస్ సర్వీస్ మీ ట్రాన్స్ ఫర్లనుబట్టి మీ నిజాయితీ ని అంచనావేయవచ్చు. ప్రభువుకుల నచ్చనపుడల్లా మీకు బదిలీ తప్పదు. అవినీతి మీద ఎంత కఠినంగా వ్యవహరిస్తారో అన్ని సార్లు బదిలీ అవుతారు.
ఆయన పోరాటానికి గుర్తింపుగా లక్నోలోని ఇన్ స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ డాక్యుమెంటేషన్ ఇన్ సోషల్ సైన్సెస్ (IRDS) ఆయన్ని సన్మానించింది. ఐఐటి కాన్పూర్ ఆయనకు సత్యేంద్ర దూబే మెమోరియల్ అవార్డు నిచ్చి సత్కరించింది. ఆయన మంచి రచయిత కూడా. ఇప్పటిదాకా 26 పుస్తకాలు రాశాడు. ఆయన గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది.
(ఈ స్టోరీ మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, trendingtelugunews.com ను ఫాలో కండి)