‘అశోక్ గజపతిరాజు మీద రాళ్లేస్తే కళ్లు పోతాయ్’

“రాష్ట్రంలో నిజాయితీకి మారుపేరుగా నిలిచి అతితక్కువ మందిలో పూసపాటి వంశీయులు ఒకరు. కేంద్రమంత్రిగా పనిచేసినసమయంలో అశోక్ గజపతి రాజు ప్రధాని మన్ననలు పొందారు. సుపరిపాలన, ప్రజాసేవలో ఆయనెప్పుడూ ముందుంటారు. నిజాయితీకి మారు పేరు. అటువంటి వ్యక్తి గురించి, 33పార్టీలు మారి జగన్ పంచన చేరిన వెల్లంపల్లి మాట్లాడటం సిగ్గుచేటు,” అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

రామతీర్థం సంఘటన తర్వాత ట్రస్టుబోర్డు అధ్యక్ష పదవినుంచి ఆశోక్ గజపతి రాజును తొలగించడం, ఆయన మీద మంత్రులు నిందులమోపడం మీద సత్యనారాయణ స్పందించారు. నిజాయితీకి మారుపేరు, అవినీతి రాజకీయాల మచ్చఅంటని అశోక్ గజపతి రాజును విమర్శించే  ఎవ్వరికీ ముఖ్యంగా వైసిపి నేతలకు లేదని ఆయన అన్నారు.

“అగ్గికైనా చెదపడుతుందేమో గానీ, పూసపాటివంశీయులను చూస్తే అవినీతి కూడా ఆమడదూరం పారిపోతుంది. నిజాయితీకి మారుపేరుగా నిలిచి అతితక్కువ మందిలో పూసపాటి వంశీయులు ఉంటారన్నారు. నేదరుమల్లి జనార్థన్ రెడ్డి, చెన్నారెడ్డి, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఎవరున్నాకూడా ఏనాడూ పూసపాటి వంశీయులగురించి మాట్లాడిన దాఖలాలు లేవు,” అని బండారు సత్యానారాయణ అన్నారు.

ఆదివారం ఆయన తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు :

కేంద్రమంత్రిగా పనిచేసినసమయంలో అశోక్ గజపతి రాజు ప్రధాని మన్ననలు పొందారు. సుపరిపాలన, ప్రజాసేవలో ఆయనెప్పుడూ ముందుంటారు. అటువంటి వ్యక్తి గురించి, 33పార్టీలు మారి జగన్ పంచన చేరిన వెల్లంపల్లి మాట్లాడటం సిగ్గుచేటు. ఒక ఫ్యాక్షనిస్ట్ పాలనలో పనిచేస్తూ, డబ్బులిచ్చి మంత్రి పదవిపొందిన వెల్లంపల్లి శ్రీనివాస్, అశోక్ గజపతి రాజు గురించి మాట్లాడిన మాటలు చూస్తుంటే, శ్రీనివాస్ తాగిమాట్లాడాడని అర్థమవుతోంది.

విజయవాడలో వెల్లంపల్లి బ్రతుకేంటో అందరికీ తెలుసు. మాపార్టీ తలుచుకుంటే వెల్లంపల్లి విజయవాడలోగుమ్మందాటి బయటకు రాలేడు. అసలు వెల్లంపల్లికి ఏం అర్హత ఉందని రాజవంశీకుల గురించి మాట్లాడుతున్నాడు. అశోక్ గజపతిరాజు ఇంటిముందు బంట్రోతుగా పనిచేయడానికికూడా వెల్లంపల్లి పనికిరాడు. దేవాదాయశాఖకు కళంకం తెచ్చేలా వెల్లంపల్లి ప్రవర్తన, మాటతీరు ఉన్నాయి. చదువలేని మూర్ఖుడైన వెల్లంపల్లికి దేవాలయాల గొప్పతనం, దేవుళ్ల మహిమల గురించి ఎలా తెలుస్తుంది?

బండారు సత్యనారాయణ మూర్తి, మాజీ మంత్రి , టిడిపి

జాతీయ రాజకీయాల్లో విశేషపేరుప్రఖ్యాతులుపొంది, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నవ్యక్తి రామతీర్థానికివస్తే తలుపులు మూయి స్తారా? దేవాలయాలు శిథిలమవుతుంటే ఏనాడూ నోరు తెరవని వెల్లంపల్లి, విజయసాయి వస్తే తలుపులు తీయిస్తాడా? రాముడి ఆలయ తలుపులు మూసేయొచ్చు గానీ, చంద్రబాబునాయుడి గుండెల్లో ఉన్న రాములోరి రూపాన్ని మీరు తొలగించలేరు.

వెల్లంపల్లికి ఎక్కడా స్థిరత్వం ఉండదు. ఆయన బతుకేంటో అందరికీ తెలుసు. రాజశేఖర్ రెడ్డి బతికుంటే, అశోక్ గజపతి రాజు ఏంటో జగన్ కు అర్థమయ్యేలా చెప్పేవాడు. వెల్లంపల్లి లాంటి భ్రష్టుడికి జగన్మోహన్ రెడ్డి దేవాదాయశాఖ ఇచ్చినందుకు హిందువలంతా సిగ్గుపడుతున్నారు. ఎన్టీఆర్, ఇందిరాగాంధీ లాంటి వారితో సమకాలీకుడైన వ్యక్తిని గురించి చులకనగా మాట్లాడతారా? తల్లి కడుపులో చేయిపెట్టి కెలికే నీతిమాలిన వ్యక్తులు మీరు. ఎలుకలు విగ్రహాలు తిన్నాయని చెప్పడానికి సిగ్గుందా? పిచ్చివాళ్లు రథాలు తగలబెట్టారని, గుడులను ధ్వంసం చేశారనిచెబితే ప్రజలునమ్ముతారనుకుంటున్నారా? హిందూ దేవాలయాలయాలను మీరు, మీ ప్రభుత్వం రక్షించలేరని అర్థమైంది.

రామతీర్థం రాములోరిని శ్రీరామదాసుడంటి చంద్రబాబే కాపాడుకుంటారు. దేవాదాయ మంత్రిగాఉన్న వారు ఓర్పు, సహనం, శాంతి, నిష్టలతో ఉంటారు. వెల్లంపల్లిలా బరితెగించి నీతి లేకుండా, సిగ్గులేకుండా ప్రవర్తించరు. ద్రోణంరాజు సత్యనారాయణ, మాణిక్యాలరావు వంటివారు ఎలా పనిచేశారో అందరికీ తెలుసు.

బ్రోకర్ పనులుచేసే వేరే శాఖను వెల్లంపల్లికి ఇచ్చిఉండాల్సింది. మూర్ఖుడైన జగన్మోహన్ రెడ్డి మాటలు వినకుండా, వెల్లంపల్లి ఇప్పటికైనా హిందువుగా భావించి పనిచేస్తే మంచిది. వెల్లంపల్లి తక్షణమే అశోక్ గజపతిరాజుకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. కేంద్రమంత్రిగాఉన్న సమయంలో ప్రభుత్వ ధనంతో కప్పుటీకూడా తాగని నిజాయితీపరుడు అశోక్ గజపతిరాజు అని వెల్లంపల్లి తెలుసుకుంటే మంచిది. అశోక్ గజపతి రాజుని ఉద్దేశించి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఆయన తక్షణమే ఉపసంహరిం చుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *