ఆలయ దాడుల కేసుల్లో 236 మంది అరెస్టు: DGP గౌతమ్ సవాంగ్

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు   ఆలయాల్లో చోటుచేసుకున్న విద్రోహ ఘటనలకు సంబంధించి మొత్తం 236 మందిని అరెస్టు చేసినట్లు డిజిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు.  ఇందులో అంతర్వేది ఘటనకు ముందు 49 కేసుల్లో 87 మందిని అరెస్టు చేశారని, ఆ తర్వాత 78 కేసుల్లో 149 మందిని అరెస్టుచేశారని ఆయన వెల్లడించారు.
ఆలయాల పరిరక్షణకు తీసుకుంటున్న గురించి ఆయన ఈ రోజు వివరించారు. గత రెండు రోజులు రాష్ట్రంలో రామతీర్థం వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో రాముడి విగ్రహం శిరచ్ఛేదం చేయడం రాష్ట్రాన్ని కుదిపేసింది. అనంతరం అనేక రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి. అనేక పార్టీలు రామతీర్థానికి యాత్రలు చేస్తున్నాయి. ఇది జాతీయ వార్త అయిపోయింది. ఈ నేపథ్యంలో డిజిపి ఆలయాల భద్రతకు తీసుకుంటున్న చర్యలు గురించి వివరించారు.
11,295 ప్రాంతాల్లో 37,673 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశాం.
 రాష్ట్రంలో 57,493 మతపరమైన సంస్థలు, ఆలయాలను గుర్తించి వాటికి జియో ట్యాగింగ్‌ చేసి మ్యాపింగ్‌ చేశారు.
 దేవాయాల్లో నేరాలు, అలజడులు, విధ్వంసాలు చేసే అలవాటున్న 1,196 మందిని బైండోవర్‌ చేయడంతోపాటు హిస్టరీ షీట్లు తెరిచి వారి కదిలికలపై నిఘా ఉంచారు.
 ఇటీవల దేవాలయలపై జరిగిన తప్పుడు ప్రచారాల వెనుక ఉన్న వాస్తవాలను శనివారం విడుదలను చేసింది. అవి:
కృష్ణా జిల్లా గుడివాడ గంగానమ్మ గుడి హుండీ చోరీకి మత రంగు పులిమి విపక్షాలు ఆందోళనలు చేశాయి. వాస్తవానికి మద్యం సేవించిన ఇద్దరు వ్యక్తులు డబ్బులు కోసం హుండీ పగలగొట్టారని దర్యాప్తులో నిగ్గుతేల్చిన పోలీసులు ఆ తర్వాత వారిని అరెస్టుచేశారు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కాలభైరవ ఆలయంలో విగ్రహాలు చోరీ అవుతున్నాయంటూ జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది. వాస్తవానికి రాజశేఖర్‌ అనే వ్యక్తి సంతానం కోసమే విగ్రహ భాగం చోరీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
అలాగే, శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల సరస్వతీదేవి విగ్రహ విధ్వంసంపై అన్యమతాల వారే చేశారంటూ ఒక వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టాడు. వాస్తవానికి సరస్వతీదేవీ విగ్రహాన్ని ఎవరూ విధ్వంసం చేయలేదని గుర్తించి ఆ పోస్టు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *