Home Uncategorized నిమ్స్ లో 5 శాఖలు బంద్, క్వారంటైన్ లో 400 మంది హైదరాబాద్ డాక్టర్లు

నిమ్స్ లో 5 శాఖలు బంద్, క్వారంటైన్ లో 400 మంది హైదరాబాద్ డాక్టర్లు

226
0
NIMS (credits NIMS,Hyderabad)
కరోనా కారణంగా హైదరాబాద్ నిమ్స్ లేని ఐదు కీలమయిన డిపార్ట్ మెంట్లు మూత పడ్డాయి. మెడికల్ గ్యాస్ట్రో ఎంటెరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటెరాలజీ,యూరాలజీ, కార్డియాలజీ, సర్జికల్ ఒంకాలజీ డిపార్ట్ మెంట్ లలో ఇన్ పేషంట్, ఒవుట్ పేషంట్ సర్వీసులు బంద్ అయ్యాయి. నిజామ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) కు చెందిన ఏడుగురు డాక్టర్లు శనివారం నాాడు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఈ అయిదుడిపార్టుమెంట్ లను మూడు రోజుల పాటు మూసేయాలని నిర్ణయించారు. ఈ డిపార్ట్ మెంట్ లు జూన్, 7, 8,9 తేదీలలో మూసి ఉంచుతారు. రాష్ట్రంలో పేరెన్నిక గన్న ఒక పెదాసుపత్రి కోవిడ్ లో చిక్కుకుని తాత్కలికంగా నైనాసేవలను బంద్ చేయడం  కరోనా సమస్య వచ్చినప్పటినుంచి దేశంలో ఎక్కడా జరుగలేదని ఇక్కడి డాక్టర్లు చెబుతున్నారు.

మిడిల్ క్లాస్ రొమాన్స్ లో మత్తు గమ్మత్తు నింపిన బాలివుడ్ ‘బాసు’

దీనితో జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. డాక్టర్లకు భద్రత లేకపోతే, హైదరాబాాద్ లలోని ప్రభుత్వ ఆసుపత్రులు మూతపడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్ల సేవలు వైద్య శాలలు నడవాలంటేచాాలా ముఖ్యం. మొత్తం డాక్టర్లలో వీళ్ల 70 శాతం దాకా ఉంటారంటే వీరి సేవలు ఎంతో ముఖ్యమో, ఈ  సైనాన్ని కాపాడుకోవడం ఎంత అత్యవసరమోతెలిసిందే. అయితే, వీరంతా ఇపుడు బాగా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే, వీరంతా ఇపుడు మెడికల్ కాలేజీల హాస్టళ్లలోనే ఉంటున్నారు. హాస్టళ్లన్నీ కరోనా హాట్ స్పాట్లయిపోయాయి.  అందుకే  మేం సురక్షితంగా ఉండాలంటే ఈహాస్టళ్లలో ఉండలేం, మాకు హోటళ్లలో రూంలివ్వండని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి తొందరగా స్పందన రావడంల దేని వారు నిరుత్సాహపడుతున్నారు.
జూ.డాలకు రెసిడెంట్ డాక్టర్లకు హోటల్ రూమ్ లు కేటాయించాలని ఉత్తర్వులున్నాయి. వాటిని అమలుచేయడం లేదు. హాస్టళ్లలోకి కరోనా ప్రవేశించినందున, దాని ట్రాన్స్ మిషన్ చెయిన్ బ్రేక్ చేయాలంటే, డాక్టర్లను వెంటనే హోటళ్లకు మార్చాలి. ఎందుకంటే, హాస్టల్లో వసతులన్నీ కామన్ గా ఉంటాయి. మెస్ కామన్, బాత్రూమ్స్  కామన్  , కామన్ నీళ్ల వసతులు. అందువల్ల కరోనో సాకే ప్రమాదం ఎక్కువ. దీనిని దృష్టిలో పెట్టుకుని వెంటనే వాళ్లందరిని హైటళ్లకు మార్చాలని కోరుతున్నామని, రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెశిడెంట్ డాక్టర్ జి.శ్రీనవాస్ డిమాండ్ చేస్తున్నారు.
ఇలా డాక్టర్లంతా కరోనా పాజిటివ్ వాళ్లే క్వారంటైన్ కు వెళ్లిపోత, తగినంతమంది డాక్టర్లు అందుబాటులోలేక ఆసుపత్రల సేవలన్నీ  కుంటువడతాయని డాక్టర్ శ్రీనివాస్ అంటున్నారు.

జూన్ 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, మరి కౌన్సిల్ సంగతేంటి?

‘మేమంతా కరోనాభయంతో గడుపుతున్నాం. ప్రభుత్వం ఒక అత్యవసర నిర్ణయం తీసుకునేందుకు ఇంత తాత్సారం చేయడమేమిటో అర్థంకావడం లేదని, ఇపుడు తక్షణం వీళ్లందరిని హాస్టళ్ల నుంచి మార్చి హాటళ్లకు బదిలీచేయకపోతే, మరింత మందికి కరోనాసోకే ప్రమాదం ఉందని ఒక జూనియర్ డాక్టర్  తెలిపారు.

Like this story? Share it with a friend!

ఇపుడు హైదరాబాద్ లో మొత్తం 71 మంది  వైద్యం చేస్తున్నవారికి కరోనా సోకింది. ఇందులో  57 మంది డాక్టర్లున్నారు. వీళ్లంతా ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్పటల్, నిమ్స్, గాంధీ హాస్పిటల్, మోడరన్ గవర్నమెంట్ మెటర్నిటీ ఆసుపత్రి, నీలోఫర్ హాస్పిటల్, కింగ్ కోటీ హాస్పిటల్ కు చెందిన వారు.వీరితో పాటు, వీరి ప్రైమరీ  కాంటాక్టులు, ఇతరులతో కలిపిమొత్తం 400 మంది డాక్టర్లు క్వారంటైన్ లో ఉన్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.

హెల్త్ వర్కర్ కరోనా పాజిటివ్, రక్షణ కరువయిందని నెల్లూరులో ఆందోళన