గోపూజ చేసి గోవులతో గడిపిన హరీష్ రావు… జిహెచ్ ఎంసి ఎన్నికల ప్రభావమేనా?

హైదరాబాద్ గగన్ పాడ్ లో జరిగిన మహా మృత్యుంజయ యజ్ఞం లో ఈ రోజు  తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అక్కడి పెద్ద గోశాలను సందర్శించారు. ఈ గోశాలను నగరంలోని మార్వాడీలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు గారు మాట్లాడుతూ గోపూజ ప్రాశస్త్యం గురించి చెప్పారు.
ఏ పూజ చేసిన , ఏ శుభ కార్యక్రమం చేసిన మొదట గో పూజ చేస్తాం.అది మన ఆచారం ఆనవాయితీ.  మంచి గోశాలను ఏర్పాటు చేసిన ఈ సంస్థ ను అభినందించారు.

ఈ గోశాలకు తన వేతనం నుండి గోశాలకు ఒక రోజు అయ్యే ఖర్చు ఒక లక్ష యాభై వెయిల రుపాయలు అందిస్తున్నట్లు ప్రకటించారు.
ఆయన ఇంకా ఏమర్నారంటే…
ఇంత పెద్ద గోశాల మన హైదరాబాద్ నగరాన్ని అనుకోని ఉన్నది. దక్షిణ భారత దేశం లో మొట్ట మొదటిది భారత దేశం లో రెండవ అతి పెద్దది. 5500 గోవులను మార్వాడి పెద్దలందరు గోవులను సంరక్షిస్తూన్నారు. కబేళాలకు వెళ్ళవలసిన గోవులను తెచ్చి రక్షించి వాటికి పునర్జన్మ నిస్తున్నారు.  ఈ సమాజం అంత బాగుండాలని చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు..
– గోవు చాలా ముఖ్యమైనది మనిషికి. రైతుకు ఆవు ఉంటే చాలు అనేవారు. పాత రోజులలో గో మూత్రం ,గో మలం,వేపాకు చక్కటి సేంద్రియ ఎరువులతో కూడిన వ్యవసాయం చేసేవారు అదే యురియా,పెస్టిసైడ్స్ ల వాడే వారు.
మంచి వ్యవసాయాన్ని చేసేవారు.మంచి పంటలు పండించారు. ఆరోజులలో క్యాన్సర్ లాంటి పలు విధాలా రోగాలు లేవు..
ఈ రోజుల్లో టెక్నాలజీ ఏవిధంగా పెరిగిందో రసాయనల ఎరువుల వాడకం పెరిగింది. అందుకే ఈ మధ్య కాలం లో హైదరాబాద్ లో ఆర్గానిక్ షాపులు కనిపిస్తున్నాయి.
డబుల్ ధరలు పెట్టికూడా కొనుకుంటున్నాము.. మళ్ళీ ఈ సేంద్రియ వ్యవసాయం గోవు ,గో మూత్రం ,గో మలం ప్రాముఖ్యత ను గుర్తిస్తున్నారు. మంచి తాత్కాలికంగా పోవచ్చు కానీ చివరకు అదే నిలబడుతుంది.
నా సిద్దిపేట నియోజకవర్గం లో సేంద్రియ వ్యవసాయం చేసెరైతులను గుర్తించి 150 మందికి గోవులను దానం ఇవ్వడం జరిగింది …
– ఆర్గానిక్ ఫామ్ సేంద్రియ వ్యవసాయం చేయండని కోరాము. ఇక్కడకు వచ్చి చూశాక ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఇంతమంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు అందరికి పెరు పేరున ధన్యవాదాలు.
ఇదంతా మొన్నటి జిహెచ్ ఎంసి ఎన్నికల ప్రభావం కాదు కదా? ఎందుకంటే, హైదరాబాద్ పక్కనే ఉన్నా, ఈగోశాల గురించి ఆయనకు తెలియకపోవడం ఆశ్చర్యం. ఇపుడు హఠాత్తుగా గోశాలకు వచ్చారు.అక్కడి యజ్ఞంలో పాల్గొన్నారు.  ఇలా గోశాలకు  ఆయన రావడం, గోపూజ చేయడం ఇదే మొదటి సారి.
నగరంలో మార్వాడీలు భారతీయ జనతా పార్టీకి పెద్ద  బలగం. మొన్నటి ఎన్నికల్లో  నార్త్ నుంచి, వెస్టు నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడిన మార్వాడీలు పెద్ద పాత్ర పోషించారని చెబుతారు. ఇందులో భాగంగా గానే ఈ వర్గానికి దగ్గరయ్యేందుకు, బిజెపికి ఒకసందేశం పంపేందుకు టిఆర్ ఎస్ తీసుకుంటున్న చర్యల్లో ఇదొకటని కొంతమంది అనుమానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *