దానం బిసి రాగం : గోడ దూకేందుకు మాంచి సాకు…

మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తొలిసారిగా స్పందించారు. ఆయన మాటల్లో ఆద్యంతం ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేశారు. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. బీసీ రాగమెత్తి దానం మాట్లాడటం ఆయన రాజకీయ అవకాశ వాదాన్ని తెలియజేసింది. దానం బీసీల రాగంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ ఎస్ లోకి వెళ్లబోతున్నారు. టీఆర్ ఎస్ పార్టీ పంచాయతీ రిజర్వేషన్లలో బీసీలకు కోత పెట్టాలని చూస్తున్న సమయంలో దానం బీసీల రాగమెత్తి టీఆర్‌ఎస్‌లో చేరడం హాట్ టాపిక్‌గా మారింది. బీసీల రాగంతో దానం పక్కా ప్రణాళికతోనే టీఆర్ ఎస్ లో జాయిన్ అవుతున్నారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. తాను పదవుల్లో ఉన్నప్పుడు బీసీలకు చేసిందేమిటని, ఇప్పుడు తన రాజకీయ భవిష్కత్ కోసం బీసీల నినాదం ఎత్తుకోవడమేమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి.

ఈ రోజు ప్రెస్ మీట్ లో జర్నలిస్టుల నుంచి దానం కు  ఎదురయిన ప్రశ్న ఏమిటంటే … టిఆర్ ఎస్ అధినేత కెసిఆర్  దళితున్ని సియం చేస్తా అన్నారు..ఎన్నికల్లో గెలిచాక అలాంటి ఉసే ఎత్తడం లేదు. అలాంటి పార్టీ బిసి లకు న్యాయం చేస్తదని ఎలా నమ్మి పార్టీ మారుతున్నారు…..ఈ ప్రశ్న కు సరైన సమాధానం చెప్పాలేక పోయిండు దానం.

ఈ సంధర్బంగా దానం చేసిన కొన్ని కామెంట్లు ఆసక్తిగా ఉన్నాయి. నేనంటే నేనే సీఎం అనే నాయకులు పార్టీని ఏ విధంగా నడుపుతారని దానం కాంగ్రెస్ నాయకులను విమర్శించారు. పార్టీ బాధ్యతలు తీసుకొని, నేనే సీఎంగా చేస్తా అనే దమ్మున్న నాయకుడు ఒక్కరైనా ఉన్నారా అని దానం కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. ఇలానే ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కలే అన్నారు. ఢిల్లీ చుట్టూ తిరిగే నాయకులకే పదవులు దక్కుతున్నాయని, నేను ఢిల్లీ చుట్టూ తిరిగితే అంత కంటే మంచి పదవులు తెచ్చుకునేవాడినని కానీ నా విధానం అది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో బడుగు, బలహీన వర్గాలకు గుర్తింపు లేదని అందుకే కాంగ్రెస్ ‌కు రాజీనామా చేశానన్నారు. తాను హైకమాండ్ దృష్టికి అనేక విషయాలు తీసుకెళ్లినా ఎటువంటి మార్పు లేదన్నారు. ఒక వర్గానికి చెందిన వారి నాయకత్వం నడవటం వల్లే కాంగ్రెస్ లో పొసగలేక బయటికి వస్తునానన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తముడే అయినప్పటికీ ఆయన హవా ఏమీ సాగటం లేదన్నారు. రాష్ట్రంలో 1.60 లక్షల మంది జనాభా బీసీలున్నారని వారికి ఇచ్చిన పదవులెన్ని, వారికి ఇస్తున్న ప్రాధాన్యతేమిటన్నారు. మొత్తానికి దానం బీసీల రాగంతో టీఆర్ ఎస్ లోకి అడుగు పెట్టనున్నారు. దానం టీఆర్ ఎస్ లో చేరిన తర్వాత ఏ పదవి లేక మరో ఎర్రబెల్లిలా తయారవుతారేమో అని కొందరంటున్నారు.బిసిలకు అన్యాయం అనేది ఎవర్ గ్రీన్ వెపన్.

రేపు బిసిలకు టిఆర్ ఎస్ న్యాయం చేయడం లేదని ఇంకొకపార్టీలోకి కూడా జంప్ చేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *