ఈ మొక్కను ఎక్కడైనా చూశారా…. దీని గొప్పదనం చూడండి

(JNR)
ఏదో పనిమీద వచ్చి కర్నూలు జిల్లాలోని ఒక పల్లెటూర్లో లాక్ డౌన్ లో చిక్కుకున్నాను. పనేమీ లేదు గాని, కొండ ప్రాంతంలోకి మార్కింగ్ వాక్ చాలా దూరం వెళ్లాను అంతానిర్మానుష్యం. రాతి నేల.ఎక్కడా చెట్టు లేవు. చాలా దూరం పోయాక రోడ్డు పక్కన ఈ చిన్న మొక్క ఒక్కటే కనిపించింది. చుట్టు పక్కల ఎక్కడా ఇలాంటి మెుక్కలు కనిపించలేదు. ఎపుడో చిన్నపుడు  చూశాను. ఇపుడు అర్బనైజేషన్ బాగా పెరిగిపోయి, రియల్ ఎస్టేట్ బూమ్ ఉదృతంగా సాగుతున్నందున కొండలు గుట్టలు కరిగిపోతున్నాయి. అందువల్ల ఈ మొక్క కనిపించడం మానేసింది. బహుశా పల్లెటూర్లలో  ఇంకా కనిపిస్తూ ఉండవచ్చు. నాచిన్నపుడు ఈ మొక్కడ ఎక్కడ బడితే అక్కడ కనిపించేది. అయితే, ఎపుడూ దీని పేరు వినలేదు. కాకపోతే, దట్టంగా ముళ్లుంటాయి. మంచి ఉదారంగులో పూలుంటాయి. జాగ్రత్తగా చూస్తే పూలు చాలా అందమయినవని తెలుస్తుంది. మంచి రంగులున్నాయి. దీని కాయలు చిన్న చిన్న టమోట పండు పరిమాణంలో ఉంటాయి.
 ఈ రోజు ఈ మొక్క కనిపించగానే ఫోటో తీసి దీని సమాచారం గూగుల్ లో వెదికాను. ఆశ్చర్యకరమయిన విషయాలు తెలిశాయి. ఇది మాంచి వైద్యగుణాలున్న మొక్క. ఆయుర్వేదం లో ఈ మొక్కని  ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ మొక్కను Indian Night Shade అంటారు. బొటానికల్ నేమ్ Solanum Virginianum. గోరు చుట్టు లేచినపుడు ఏలును కాయకు రంధ్రం వేసి అందులో వుంచితే తగ్గిపోతుందని (Ethnomedicine) చాలా ప్రాంతాల్లోని గిరిజనులు నమ్ముతారు.
ఆయుర్వేదంలో ని దశమూల వైద్య విధానంలో  ఈ మొక్క ఒకటి. దశ మూల విధానం అంటే అయిదు చెట్ల (బృహత్ పంచమూల), అయిదు చిన్న మొక్కల (లఘు పంచమూల) వేర్లతో ఔషధం లేదా రసాయనం. దశమూల రసాయనం గురించి Botanical Indentity of Plant Sources of Dashamula Drugs… అని ఒక పరిశోధనా పత్రంలో విపులంగా రాశారు.   ఆసక్తి ఉన్నవారు  పై లింక్ ను క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
ఈ మొక్క వంకాయ కుటుంబానికి (Solanaceae) చెందింది. సోలనేషికి సంబంధించి 33 రకాల మొక్కలను ఆయుర్వేదం గుర్తించింది. ఇందులో రెండు రకాల మొక్కల (Solanum Anguivi Lam <బృహతి>, Solanum Virignianum<కంటకారి>)వేర్లను దశమూలలో వాడతారు. అంటే  మొక్క ఔషధ గుణం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్ర లో ఆయుర్వేద వైద్యంలో కనీసం 8వేల మెట్రిక్ టన్నుల దశమూల వేర్లను వాడుతున్నారట.
 ఈ మొక్కనుంచి డయాస్జెనిన్, బీటా సైటో స్టెరాల్ అనే రసాయనాలను  వేరుచేశారు. వీటికి అనేక వైద్య గుణాలు(anti-inflammatory and anti-pathogenic) ఉ న్నాయని చాలా మంది శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొంతమంది భారతీయ పరిశోధకులు ఈ మొక్క బ్రాంఖియల్ ఆస్తమా కు విరుగుడుగా పనిచేస్తుందని కనుగొన్నారు. ఈ మొక్కల, కాయల కషాయాన్ని మధుమేహం చికిత్సలో కూడా పనికొస్తుందని మరొక శాస్త్రవేత్త చెప్పారు.ఛాతీ నొప్పి, వాంతులు, జుట్టు రాలడం, దురద, లెప్రసీలో కూడా ఈ మొక్కను వాడవచ్చని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు.

Taxonomic Tree

Domain: Eukaryota

Kingdom: Plantae

Phylum: Spermatophyta

Subphylum: Angiospermae

Class: Dicotyledonae

Order: Solanales

Family: Solanaceae

Genus: Solanum

Species: Solanum virginianum

 

(మీకు ఏదైనా విచిత్రం తారసపడితే ఫోటోతో పాటు మెయిల్ చేయండి trendingtelugunews@gmail.com)