Home Features కక్ష సాధింపు రాజకీయాలు ఎపుడో మొదలయ్యాయి? గాంధీ మీద కూడా మచ్చ…

కక్ష సాధింపు రాజకీయాలు ఎపుడో మొదలయ్యాయి? గాంధీ మీద కూడా మచ్చ…

569
0
ఈ మధ్య కాలంలో కక్ష సాధింపు రాజకీయం(politics of Vendetta) అనే మాట రాజకీయాల్లో బాగా వినబడుతూ ఉంది. ఇపుడు ఆంధ్రలో తెలుగుదేశం మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఇఎస్ ఐ స్కామ్ లో, తుక్కు లారీలను బస్సులుగా నడిపిన ఆరోపణలలో అనంతపురానికి చెందిన జెసి ప్రభాకర్ రెడ్డిని ఆయన కుమారుడిని వైసిపి ప్రభుత్వం అరెస్టు చేస్తూనే వినిపించిన తొలిమాట ‘ఇది కక్ష సాధింపు చర్య’ తెలుగుదేశం ఖండించింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి దగ్గిర నుంచి కింది స్జాయి అంతా కక్ష సాధింపు అన్నారు. ఇక కేంద్రంలో కరోనా లాక్ డౌన్ విధించే వారు వినిపించిన మాట కక్షసాధింపు అనేమాటయే. 2014 ఎన్నికల ముందు, బిజెపి ప్రధాని అభ్యర్థిగా ఉన్నపుడు నరేంద్ర మోదీ చేసిన బాస నేను కక్షసాధింపు ధోరణి చూపను అనే.  2014-19 మధ్య వైసిపి నేతలు తెలుగు దేశం ప్రభుత్వానిది కక్ష సాధింపుధోరిణి అని విమర్శించారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాడినప్పటి నుంచి  ఇప్పటి దాకా కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న తీవ్రమయిన విమర్శ కక్షసాధింపు రాజకీయాలనే. మోదీ, అమిత్ షాకు కక్షసాధింపు రాజకీయలతో కళ్లు కనిపించడంలేదని కాంగ్రెస్ ఈ మధ్య తీవ్రమయిన విమర్శ చేసింది.
మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరాన్ని అరెస్టు చేసినపుడు కూడా కాంగ్రెస్ చేసిన విమర్శ ఇది కక్ష సాధింపు చర్య అనే. డిఎంకె నేత స్టాలిన్  చిదంబర అరెస్టు కక్ష సాధింపు అన్నారు.
మహారాష్ట్రలో  కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ మద్ధతులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరుసటి రోజున ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ప్రధాని మోదీకి చేసిన సలహా కక్షసాధింపు మానుకో, అది నిన్నే దెబ్బతీస్తుందని. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా మోదీ ప్రభుత్వం కక్ష సాధిస్తున్నదనే విమర్శిస్తుంటారు.
మహాత్మగాంధీవి కక్షసాధింపు రాజకీయాలు నడిపారా?
కక్షసాధింపురాజకీయాలనేవి ఇప్పడే కాదు, స్వాతంత్య్ర పోరాటకాలంలో కాంగ్రెస్ పార్టీ కక్షసాధింపు రాజకీయాలతో కుతకుతలాడింది. చివరకు మహాత్మాగాంధీ కూడా కక్ష సాధింపురాజకీయాలకు పాల్పడినారనే విమర్శ ఉంది. కాంగ్రెస్ పార్టీలో మహాత్మాగాంధీ కక్ష సాధింపు రాజకీయాలవల్లే నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైడ్ లైన్ అయిపోయారని చెప్పారు. గాంధీలో కక్షసాధింపు ధోరణికి బోస్ తో ఉన్న గొడవను చరిత్రకారులు ఉాదహరిస్తూ ఉంటారు.

వల్లభ్ భాయ్ పటేల్ తో కలసి గాంధీజీ  బోస్ ను సైడ్ లైన్ చేయాలనుకుంన్నారు. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు కాబట్టి మొదట కాంగ్రెస్ అధ్యక్ష అధికాారాల మీద కోత విధించి, ఆ పదవి నుంచి తప్పకునేలా చేశారుని, అంతేకాదు, చివరకుకాంగ్రె స్ నుంచి బోస్  బయటకు పోయేలా చేశారని చరిత్రకారుడు రామచంద్ర గుహ Forgotten Rivalry Between Patel and Bose అనే అర్టికిల్ లో రాశారు.
గాంధీజీ క్యాంపుకు చెందిన పటేల్ మీద నేతాజీ సోదరుడు శరత్ చంద్రబోస్ తనకోపాన్ని వెల్లగక్కిన విషయాన్ని గుహ రాశారు. Bose’s brother Sarat  charged Vallabhbhai with facilitating a ‘mean, malicious and vindictive’ propaganda war against Subhas అని గుహ రాశారు.
స్వాతంత్య్రానంతరం కక్షసాధింపు రాజకీయాలు
కక్ష కార్పణ్యాలు లేకుండా రాజకీయాలుంటం కష్టం. రాజకీయ ప్రయోజనాలు అలాంటి. హోదాకు, సంపద కూడ బెట్టుకోవడానికి రాజకీయాలు రాచమార్గం కాబట్టి ప్రత్యర్థులను రాజకీయంగా, భౌతికంగా మట్టపెట్టడం అనేది రాజకీయాల్లో ఎపుడూ ఉన్నదే.
అయితే, స్వాతంత్య్రానంతర రాజకీయాలలో కక్షసాధింపు అనేది బాహాటంగా మొదలయింది ఇందిరా గాంధీ ప్రధాన మంత్రి అయిన తొలినాళ్లలో అని చెబుతారు.
ఇది కూడా చదవండి

తెలంగాణలో అడుగడుగానా జైన గుడులే… ఇదిగో మరొక ఆధారం

దీనికి రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికార అభ్యర్థి అయిన నీలం సంజీవరెడ్డిని వోడిచేందుకు  ఇందిరా గాంధీ ఒక ఇండిపెండెంటు అభ్యర్థికి మద్ధతు ఇచ్చి కక్ష తీర్చుకున్నారని చెబుతారు. ఆ ఇండిపెండెంటు అభ్యర్థి ఎవరోకాదు వరాహగిరి వెంకటగిరి (వివి గిరి).
ఇది ఆధునిక కక్ష సాధింపురాజకీయాల్లో నల్లటి అక్షరాల్లో ముద్రించాల్సిన ఘట్టంగామిగిలిపోయింది. ఇదెలా జరిగిందో చూద్దాం.
దేశంలో కక్ష సాధింపు రాజకీయాల యుగం
1969లో రాష్ట్రపతి జకీర్ హుసేన్ హఠాత్తుగా చనిపోయారు. ప్రధాని ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్ ఉప ప్రధానిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సిండికేట్ అని పేరున్న సీనియర్లకు, యువ ప్రధాని అయిన ఇందిరాగాంధీకి తీవ్ర విబేధాలు నడుస్తున్నాయి.  పార్టీ మీద, ప్రభుత్వం మీద పట్టుకోసం ఇరువురు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి జకీర్ హుసేన్ మరణించారు.దానితో రాష్ట్రపతి ఎన్నిక వచ్చింది.
ఒక రోజు ప్రధాని ఇందిగా గాంధీతో మొరార్జీ మాట్లాడుతున్నారు.  అపుడు ఆమె మనసులో ఉపరాష్ట్రపతి వివిగిరిని రాష్ట్రపతిచేయాలన్న ఆలోచన ఉన్నట్లు మొరార్జీ కనిపెట్టారు. గిరిని రాష్ట్రపతిని చేయడం మొరార్జీకి ఇష్టం లేదు. ఎందుకంటే, గిరికి విదేశీ పర్యటనలంటే చాలా ఇష్టమనే విమర్శ ఉంది.దానికి తోడు ఆయన ప్రతిపర్యనటకు సకుటుంబ సపరివారంగా వెళ్లుతుంటారు. అందువల్ల ఆయన  పేరు కాకుండా మరొక నికార్సయిన పేరు వెదకాలన్ని సూచనలొచ్చాయి.
అపుడు వ్యవసాయ మంత్రిగా ఉన్న జగజ్జీవన్ రామ్ పేరు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేర్లు చర్చకు చ్చాయి. గాంధీ శతజయంతి సందర్భంగా వెనకబడిన వర్గానికిచెందిన వాళ్లని రాష్ట్రపతి చేస్తే బాగుంటుందనే వాదన కూడా వినపడింది. అయితే, జగజ్జీవన్ రామ్ మీద ఇన్ టాక్స్స సంబంధించిన ఆరోపణలేవో ఉన్నాయని ఆయన దేశ ప్రథమపౌరుడి అభ్యర్థిగా వద్దని మొరార్జీ వాదించారు.
పదేళ్ల పాటు ఆయన ఇన్ కమ్ టాక్స్ కట్ట లేదనే విషయం పార్లమెంటులో చర్చకువచ్చింది. తాను మర్చిపోయానని జగజ్జీవన్ రామ్ చెప్పారు. సంజీవయ్య మరీ చిన్నవాడని వద్దనుకున్నారు. అందువల్ల లోక్ సభ స్పీకర్ గా ఉన్న నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతిని ఎన్నుకుంటే ఎలా ఉంటుందనేపప్రతిపాదన వచ్చింది. నిజానికి చాలా పేర్లు వచ్చాయి. ఇందులో ప్రముఖమయిన పేరు సంజీవరెడ్డిది. దీని వెనక కూడా ప్రతీకార రాజకీయాలున్నాయి.
1969 జూలై 12న రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశమయింది. అక్కడ సంజీవరెడ్డి, జగజ్జీవన్ రామ్ పేర్లు చర్చకు వచ్చాయి. మెజారిటీ సభ్యులు నీలంసంజీవరెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపర్చారు. ఇందిరాగాంధీకి సన్నిహితుడయిన వైబి చవాన్ కూడా కాంగ్రెస్ ‘సిండికేట్ ’ అభ్యర్థినే బలపర్చిషాకిచ్చారు. అపుడుకాంగ్రెస్ పార్టీకి నిజలింగప్ప అధ్యక్షుడు. జూలై 13న నిజలింగప్ప అనుమతి తీసుకుని ఉపప్రధాని మొరార్జీ దేశాయ్ కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థి నీలం సంజీవరెడ్డి అని ప్రకటించారు.
అప్పటికింకా ‘యువకుడి’గానే ఉన్న నీలం రాష్ట్రపతి అయితే, ప్రధాని పవర్స్ కు కళ్లెం వేస్తాడని సిండికేట్ భావించింది. ఇది ప్రధానికి అర్థమయింది.

అయితే, జూలై 16న ఇందిరాగాంధీ  కోపంగా మొరార్జీ దగ్గిర ఉన్న ఆర్థిక శాఖని లాగేసుకున్నారు. ఈ మేరకు  ఆయనకు ఒక లేఖ రాస్తూ  ఉపప్రధానిగా మాత్రం కొన సాగండి అని లేఖ రాశారు. అపుడే ఆమె మొట్టమొదటి మహిళా ఆర్థిక మంత్రి అయ్యారు.
ఉప ప్రధాని బాధ్యతలేమిటో తర్వాత నిర్ణయిస్తామని కూడా మొరార్జీతో చెప్పారు.  నీలం సంజీవరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ప్రతీకారంగా తనను ఆర్థిక శాఖనుంచి తప్పించారని, క్యాబినెట్ లో నెంబర్ 2 అయిన తనతో సంప్రదించకుండా ఇలా చేయడం ఏమిటని మొరార్జీ  బాధపడ్డారు. అవమానంగా భావించారు. ఇది ప్రతీకార చర్య అన్నారు. ఇక ఉప ప్రధాని పదవిలో ఉండలేక ఆయన ఉప ప్రధాని పదవికి క్షణాల్లో రాజీనామా చేశారు.
1969,జూలై 17 మధ్యాహ్నం నాలుగు గంటలకు ఆయన రాజీనామాను ఇందిరా గాంధీ ఆమోదించారు.

 బ్యాంకుల జాతీయీకరణ ప్రకటన వచ్చింది కూడా ఆ సాయంకాలమే
ఇక రాష్ట్రపతి ఎన్నికలొచ్చాయి. కాంగ్రెస్ అధికార అభ్యర్థి నీలంసంజీవరెడ్డికి వ్యతిరేకంగా ఉప రాష్ట్రపతి వివి గిరి, ఆపదవికి రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు.కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి పార్టీ మీద తనపట్టు పెంచుకోవాలని  ప్రధాని అయిన ఇందిరాగాంధీ నిర్ణయించారు.
సంజీవరెడ్డికి వోటేయవద్దని చెప్పకుండా ఆత్మప్రబోధానుసారం (Conscience Vote) వోటే యండని ఆమె కాంగ్రెస్ ఎంపిలకు, శాసన సభ్యలకు తెలివిగా పిలుపు నిచ్చారు. చివరకు నీలంసంజీవరెడ్డి ఓడిపోయారు. ఆగస్టు 20 ఫలితాలు ప్రకటించారు. 1969 ఆగస్టులో వివి గిరి నాలుగో   రాష్ట్రపతిగా రాష్టప్రతి భవన్ లో ప్రవేశించారు.
దీనికి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ మీద ఆగ్రహించింది. ప్రతీకారచర్య తీసుకోవాలనుకుంది. 1969లో నవంబర్ 12న ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనితో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది.  ఆ రోజు రెండు పార్టీలు వేర్వేరు గా సమావేశమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిండికేట్ పార్టీ సమావేశమయింది. ఈ పార్టీ కాంగ్రెస్ అర్గనైజేషన్ (Congress-O)గా పేరు మార్చుకుంది. ఇక ఇందిరాగాంధీ నాయకత్వంలోని మరొక సమావేశం ప్రధాని కార్యాలయంలో జరిగింది.అది కాంగ్రెస్ రిక్విజిషన్ ( Congress-R)గా బయటకొచ్చింది. ఈ పర్యవసానాలు కాంగ్రెస్ చరిత్రలో కక్ష సాధింపు రాజకీయాల పరాకాష్టగా చెబుతారు.
అప్పటి నుంచి ఇప్పటిదాకా కక్షసాధింపు రాజకీయాలు (vindictive politics) లేని రోజుంటూ లేకుండాపోయింది. ఇది దేశ రాజకీయాల్లోన కాదు, రాష్ట్ర రాజకీయాల్లో చివరకు  పార్టీల రాజకీయాల్లో కూడా వేళ్లూని కొనిపోయిన సంప్రదాయమయింది.