రూ.2.5 లక్షల కోట్లతో ఆంధ్రా బడ్జెట్‌, అసెంబ్లీ చిత్రాలు (గ్యాలరీ)

అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను (2020–21) ప్రవేశపెడుతోంది. రూ.2.25 లక్షల కోట్లతో సంక్షేమ బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా బడ్జెట్‌ను రూపొందించారు.
ఏపీ బడ్జెట్‌(2020-21) ప్రధాన అంశాలు :
‘అన్నిరకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించినవాడే నిజమైన నాయకుడు’ అంటూ తెలుగు కవితతో అసెంబ్లీలో‌ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రారంభించారు.
రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌
రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లు
మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లు