Home Features వైసిపి-టిడిపిల కొట్లాటలో బయటపడుతున్న చేదు నిజాలెన్నో…

వైసిపి-టిడిపిల కొట్లాటలో బయటపడుతున్న చేదు నిజాలెన్నో…

369
0
నిజము నిప్పులాంటిదెపుడూ అనేది పాటగా పాడుకునేందుకు కవిత్వంలో చదువుకునేందుకు పనికొచ్చే అందమయిన మాట.నిజం బలహీనమయింది. దాన్ని ఈజీ గా పాతిపెట్టవచ్చు. ఒక జీవితకాలంలో మళ్లీబయటకు రాకుండా తొక్కేయవచ్చు. ప్రపంచచరిత్రలో జాగ్రత్తగా చదవండి ఎక్కువ ప్రచారమయిందంతా నిజాన్ని అణచిపెట్టిన విధానాలే. నిజాలకు తనంతకు నిప్పులా దహించే శక్తి లేదు. Truth Trimphs అనే మాట పాఠ్యపుస్తకాలకు  మాత్రమే పనికొచ్చే మాట. నిజానికి నిప్పులా దహించే శక్తి ఉండే నిజనిర్ధారకు ఇన్ని సిబిఐ ఎంక్వయిరీలు, సిఐడి ఎంక్వయిరీలు,జ్యుడిషియల్ కమిషన్లు, పార్లమెంటరీ జాయింట్ కమిటీలు, క్యాబినెట్ సబ్ కమిటీలు, టాస్క్ ఫోర్సలు ఎందుకు? ఇవన్నీవిచారణ చేసిన ఇంకా నిజం అనుమానాస్పదంగా ఉంటుంది.
నిజం ఎంత బలహీనమయిందైనా ఒకే సందర్బంలో అతి బయటకు వస్తుంది. పూర్తిగా కొండంతగా కాకపోయినా, గోరంతయిన బయటకు తొంగిచూసే సందర్బమది. దమ్ముంటే అక్కడ విచారణజరిపిన అసలు నిజాన్ని బయటకు తీయగలగాలి. లేక పోతే, అది మళ్లీ పూడిపోతుంది.దాన్ని చూపించన వాళ్లూ పూడ్చేస్తారు.
ఈ సందర్భం ఏంటంటే, రూలింగ్ పార్టీ వాళ్లు, అపోజిషన్ పార్టీవాళ్లు కొట్లాడుకునే సందర్భం.ఈ అపోజిషన్ పార్టీ  అంతకు ముందెపుడైనా అధికారంలో ఉండి ఉంటే, వాళ్లకు నిజం తెలుసుకాబట్టి పూర్తిగా కాకపోయినా కొంతయినా బయటపెడతారు.రూలింగ్ పార్టీ ఎపుడూ పవర్ ఫుల్లే కాబట్టి మాజీ ప్రభువుల ‘నిజస్వరూపాలు’ ఈజీగా బయటపెడతారు. అందుకే రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ వాళ్లు ఎంత సీరియస్ కొట్లాడుకుంటే అంత బాగా నిజాలు బయటకు వస్తాయి. బోఫోర్స్, 2జి, వ్యాపం వంటి భారీ స్కామ్ లన్నీ తమంతకు  తాము బయటపడలే. రూలింగ్ పార్టీ వాళ్లు, అపోజిషన్ పార్టీవాళ్ల తెగకొట్టుకున్నందునే. అందుకే రూలింగ్ పార్టీ బలంగా ఉండాలి, అపోజిషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. అపుడే కొట్లాట బలంగా ఉంటుంది, నిజాలూ బయటకొస్తాయి. ఇపుడు ఆంధ్రలో జరుగుతున్నదదే. రూలింగ్ వైఎస్ ఆర్ సి బాగా కొట్లాడుకుంటున్నాయి. ఒకరిమీద ఒకరు బాగా దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఒకరి  స్కామ్ లు ఒకరు బయటపెట్టుకుంటున్నాయి. నిన్న తెలుగుదేశం పార్టీ 108 స్కామ్ 300 కోట్ల స్కాం అని తెలుగుదేశం పార్టీ వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి  మీదతీవ్రమయిన ఆరోపణలు చేసింది. ఇపుడు తెలుగుదేశం హయాంలో జరిగిన పైబర్ నెట్ ఎంతకుంభకోణమో వైసిపి వాయిదాల పద్ధతి మీద చాలా ఆసక్తికరమయిన విషయాలను వెల్లడిస్తూ ఉంది.
ఫైబర్ నెట్ లో ‘డూప్లికేట్’ వీరుడు : వైసిపి తవ్వితీసిన ‘నిజాలు’

 

నిన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (APSFL) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. గౌరి శంకర్ ను జగన్  ప్రభుత్వం తొలిగించింది.కారణం ఆయన దొంగ సర్టిపికేట్ల తో ఉద్యోగం సంపాయించడనేది. ఇప్పటికే ఈ సంస్థ మీద సిబిఐ ఎంక్వయిరీ సిఫార్సు చేశారు.  ఫైబర్ నెట్ అనేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు 145 రుపాయలకు టివి, టెలిఫోన్, ఇంటర్ నెట్ కనెక్షన్లు ఇప్పించేందుకు ఏర్పాయిన సంస్థ.దీనికి సంబంధించిన రు. 329 కోట్ల కాంట్రాక్టు ను టెరా సాఫ్ట్ వేర్ అనే కంపెనీకి దక్కింది. ఈ కంపెనీ ఈ రంగంలో తనకు మాంచి అనుభవం ఉన్నట్లు ఒక సర్టిఫికేట్ పుట్టింది.  ఆసర్టిఫికేట్ ఇచ్చిన సంస్థ సిగ్నమ్ డిజిటల్ నెట్ వర్క్స్. ఈ గౌరిశంకర్ అంతకు ముందు ఈ సిగ్నమ్ లో డైరెక్టర్ గా పనిచేశాడు. కాంట్రాక్టు దక్కాక ఇతన్ని ఎపిఫైబర్ నెట్ లోకి తీసుకోవాలనుకున్నారు. దానికి ఆయన ఫేక్ సర్టిఫికేట్ లు జత చేసి ఎంపికయ్యాడు. వైసిపి ప్రభుత్వం వచ్చాక ఈ ఫైబర్ నెట్ మీద కన్నేసింది. చాలా ఆధారాలు దొరికినందున సిబిఐ విచారణకు అదేశించారు. ఇది దొంగసర్టిఫికేట్లు కావని నిరూపించుకునేంందుకు గౌరిశంకర్ టైం ఇచ్చామని, తాను నిర్దోషినని నిరూపించుకోలేకపోయాడని,అందుకే ఆయన్ని టర్మినేట్ చేశామని ఐటి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి టైమ్సాఫ్ ఇండియాకు చెప్పారు.
అల్లుడికి వైసిపి మామ ఇచ్చిన అపూరూపకానుక: టిడిపిబయపెట్టిన స్కాం 

ఆంధ్రప్రదేశ్ లో 108 అంబులెన్సుల కొనుగోళ్లు, నిర్వహణలో  రూ.307 కోట్ల కుంభకోణానికి వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.
విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ కు చెందిన అరబిందో ఫౌండేషన్ కు ఉన్నఫలంగా కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా 108 స్కాం జరిగిందని టిడిపిఅధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అనేక ఆసక్తి కరయిన విషయాలు వెల్లడించారు. ఈ కుంభకోణమేమిటో పట్టాభిరామ్ ఇలా వివరించారు.
2016 వరకు జీవీకే-ఈఎంఆర్ (GVK-EMR) సంస్థ అంబులెన్సుల్ని నిర్వహించేది. దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో 2011 అక్టోబర్ 1 నుండి 2016, 30 సెప్టెంబర్ వరకు ఒప్పందం జరిగింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ ఒప్పందం విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకోకుండా జీవీకే నిర్వహణను కొనసాగించింది. 2016లో ఓపెన్ టెండర్లొ  లండన్ కు చెందిన యుకే ఎస్ఏఎస్ (UK-SAS) భాగస్వామ్యం కలిగిన బీవీజీ కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంది. 2017, డిసెంబర్ 13న ఐదేళ్ల కాలపరిమితితో ఈకంపెనీకి కాంట్రాక్టు ఇవ్వడం జరిగింది. ఈ కాంట్రాక్టు 2020, డిసెంబర్ 12 వరకు ఉంటుంది.
ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడంతోనే 2019, సెప్టెంబర్ 5న ఉన్న అంబులెన్సులకు అదనంగా మొత్తంగా 439 అంబులెన్సులు కొనుగోలు చేసేందుకు 105 జీవో ఇచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వంపై భారం లేకుండా ఉండేందుకు ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. 2019, సెప్టెంబర్ 20న పాత, కొత్త అంబులెన్సుల నిర్వహణకు సంబంధించి కొత్త ఏజెన్సీని గుర్తించాలని 111 జీవో విడుదల చేశారు. బీవీజీ సంస్థ కాంట్రాక్టు పరిమితి ముగియక ముందే రద్దు చేసి కొత్త సంస్థను (అరబిందో ఫౌండేషన్ ) గుర్తించారు. ఈ  అవసరం ఎందుకొచ్చింది.
మళ్లీ,  2019, అక్టోబర్ 18న అంబులెన్సులను పైనాన్స్ విధానంలో కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, నేరుగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేసేలా జీవో నెం.117 విడుదల చేశారు.
అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంపై భారం ఉండకూడదని ఫైనాన్స్ అన్న ప్రభుత్వ పెద్దలు డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాలని నిర్ణయించడానికి కారణమేంటి.?
మొదటి నుండి ఆరోగ్యశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో నడుస్తున్న అంబులెన్స్ సర్వీసులను ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కింద నిర్వహించే విధంగా 2019, అక్టోబర్ 30న జీవో (నెం.566) ఇచ్చారు. ఆరోగ్యశ్రీ ట్రస్టుకు డిప్యూటీ సీఈవో గా రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని ఆఘమేఘాలపై  నియమించారు. ఈ మార్పు ఎందుకు చేశారో ముఖ్యమంత్ర సమాధానం చెప్పాలి.
ఈ అంబులెన్సులను కొనుగోలు చేయడం కోసం రూ.71.48 కోట్లను విడుదల చేస్తున్నట్లు 2019, డిసెంబర్ 30న 679 జీవో ఇచ్చారు.
ఆరోగ్యశ్రీ ట్రస్టుకు డిప్యూటీ సీఈవోగా నియమించిన రాజశేఖర రెడ్డికి నెల రోజులకే  అడిషనల్ సీఈవోగా పదోన్నతి కల్పిస్తూ  ఆరోగ్యశ్రీ నిర్వహణ మొత్తం అతని చేతుల్లో పెడుతూ జీవో నెం.72 ఇచ్చారు.
ఒక ఏజెన్సీతో కుదుర్చుకున్న ఒప్పందం అమల్లో ఉండగానే  దాన్ని రద్దు చేయడం ఏమిటి? ఈ కొత్త ఏజన్సీకి భారీగా కొత్తగా కొన్న అంబులెన్సుల నిర్వహణకు నెలకు రూ.1.78లక్షలు, పాత అంబులెన్సుల నిర్వహణకు  రూ.2.21లక్షలు చొప్పున  చెల్లించేలా 2020, ఫిబ్రవరి 13న జీవో నెం116 విడుదల చేశారు. ఇదేమిటి?
గతంలోని బీవీజీ సంస్థ ఒక్కో అంబులెన్సుకు రూ.1.31 లక్షలకే నిర్వహిస్తుంటే  ఆ సంస్థను కాదని అరబిందో ఫౌండేషన్ కు బాధ్యతలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?
ఇది కేవలం 108లో మాత్రమే. 104లో మరింత కుట్ర జరిగిందో.? ఒక సంస్థతో కుదుర్చుకున్న కాంట్రాక్టును అర్ధాంతరంగా రద్దు చేసి సొంత కంపెనీకి కట్టబెట్టడంలో విజయసాయి రెడ్డి పాత్ర లేదంటారా? : ఇది తెలుగుదేశం ప్రశ్న.  వైసిపి, తెలుగుదేశం పార్టీలు కొట్లాడక పోతే, ఇంత రీసెర్చు చేసి ప్రజలు జరిగిందేమిటో ఎవరు చెబుతారు?