Home Features కామ్రేడ్ నాయని : మచ్చలేని తెలంగాణ నాయకుడు

కామ్రేడ్ నాయని : మచ్చలేని తెలంగాణ నాయకుడు

99
0
* పాత నల్గొండ జిల్లా, దేవరకొండలోని నేరెడుగొమ్ము గ్రామములో నాయిని దేవయ్య రెడ్డి,సుభద్రమ్మ దంపతులకు 1944 మే12 నాయని నర్సింహారెడ్డి జన్మించారు.
* చదువుకున్నది కేవలం హెచ్.ఎస్.సి.బతుకుబడిలో ఆయన నేర్చుకున్నది అపారం. ఎక్కడ ఉన్నా ఆయన కంచుకంఠ వినబడుతూ ఉంటుంది.ఎపుడూ జుట్టుకు నల్లటి రంగేసుకుని కుర్రవాడిలో  కనిపించడమేకాదు, చలాకిగా ఉండేవాడు.
* ఆ రోజు ల్లో నల్లగొండ జిల్లా విప్లవాల ఖిల్లా. అందువల్ల గ్రామములో నెలకొన్న అశాంతి కారణాల వలన వారికుటుంబం హైదరాబాద్ కు వలస పోయింది. ఆయన తండ్రి దేవయ్య 1948 పోలీస్ యాక్షన్ సమయంలో చనిపోయాడు.
* యుక్తవయసులో సోషలిస్ట్ పార్టీ ఆఫీస్ సెక్రటరీగా రాజకీయాలకు దగ్గరయ్యారు. అయితే, ఆయన రెగ్యులర్ రాజకీయాల వైపు కాకుండా ఆరోజు దేశంలో బలంగా సాగుతున్న ట్రేడ్ యూనియన్ రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. హింద్ మజ్దూర్ సభ/ హెచ్.ఎం.ఎస్ అనుబంధ కార్మిక సంఘాలలో కూడా పని చేశాడు.1970 లో ” వజీర్ సుల్తాన్ టొబాకో/ వి.ఎస్.టి కార్మక సంఘం నాయకుడిగా ఎన్నికైనాడు.హైదరాబాద్ లోని వి.ఎస్.టి, ఐ. డి.పి.ఎల్, హెచ్.ఎం.టి,ఆశోకా లీలైండ్,మహేంద్ర మహీంద్రా,కిర్భీ,జి.వి.కే, నోవాపన్,ఆంప్రో,తోపాజ్,యితర అనేక పరిశ్రమల కార్మిక సంఘాలు నాయకత్వం వహించారు. ట్రేడ్ యూనియన్లను ఆయన ఎపుడూ వదల్లేదు. రాష్ట్ర హోం మంత్రిగా ఉంటూనే హెచ్.ఎం.ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా,జాతీయ ఉపాధ్యక్షుడిగా కొనసాగారు.
* సింగరేణితో  ఆయనకు చాలా అనుబంధం ఉంది. కార్మిక ఉద్యమాలతో దాదాపు 30 యేండ్ల అనుబందం ఉన్నది.ట్రేడ్స్ మెన్ ల సమ్మె కాలములో 1984 లో జి. డి.కే 9 ఇంక్లైన్ దగ్గర నాయిని నర్సింహారెడ్డి మరో 8 మంది నాయకులపై” ఎస్మా ” కేసు నమోదు చేసి మంథని కోర్టులో హాజరుపరిచారు.
* ఆయన మంచి వక్త. కంచుకంఠంతో ఆయన ఉపన్యాసం సాగేది. హెచ్.ఎం.ఎస్ నాయకులుగా నాయిని నర్సింహారెడ్డి వినడానికి  వేల  సంఖ్యలో కార్మికులు హాజరయ్యే వారు.  నాయిని నర్సింహారెడ్డి ఉపన్యాసం వినడానికి కార్మికులు ఇష్టపడే వారు.అధికారులు భయపడే వారు. ఆయన చాలా నిర్భయంగా నిరంకుశంగా ఉండే సింగరేణి అధికారులపేరు పెట్టి హెచ్చరించేవారు.
* ఒక సారి జి డి కె 2 ఎ ఇంక్లైన్ లో ఆక్సిడెంట్ కు గురైన గంప కనుకయ్యను ఆరోగ్యం కోలుకోకుండానే విధులకు పిట్ చేసినప్పుడు అప్పటి ముఖ్య మంత్రి ఎన్.టి రామారావుకు పిర్యాదు చేశారు.సింగరేణి కార్మికుల సమస్యలపై చాల సార్లు అసెంబ్లీలో లేవనెత్తారు. కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ ( బసంత్ నగర్) కార్మిక సంఘ ఎన్నికల్లో కూడా ప్రెసిడెంట్ గా ఎన్నికైనారు.
* నాయిని నర్సింహారెడ్డి ముక్కు సూటిగా మాట్లాడటం ఆయన స్వభావం. ప్ర   జా రాజకీయాల్లో గాని, ట్రేడియన్ యూనియన్ రాజకీయాల్లో గాని ఆయన  ప్రవర్తన వెేలెత్తిన చూపలేనిది. ఒక విధంగా ఆయన మచ్చలేని నాయకుడిగా జీవించాడు.
* ఆయన తొలి నుంచి ప్రత్యేక తెలంగాణ వాదియే. 1969-71 నాటి తెలంగాణ తొలి దశ ఉద్యమములో పాల్గొన్నాడు. జైలుకు కూడా వెళ్లాడు.
* 1975లో ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జీన్సీ విధించనిపుడు హైదరాబాద్ నుంచి అరెస్టయిన వారిలో నాయిని కూడా ఉన్నారు. ఎమర్జన్సీ కాలమంతా అంటే 18 నెలలు జైలులోనే ఉన్నారు.
* 1977 ఎమర్జెన్సీ ఎత్తి వేసిన ఆనంతరం  జైలు నుంచి విడుదలయ్యాక “” లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వములో ఏర్పాటైన ” జనతా పార్టీలో చేరారు.
* 1978లో  జరిగిన ఎన్నికల్లో  ముషీరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేసి గెల్చారు.  ఈ నియోజకవర్గం నుంచి ఆయన  మూడు పర్యాయాలు శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు.
* తెలంగాణ రాష్ట్రసమితి (టిఆర్ ఎస్) ఆవిర్భావం  ఆ పార్టీలో చేరి తెలంగాణ మలి దశ ఉద్యమములో నేటి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  నాయకత్వంలో పని చేశారు. ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఆయన ఉద్యమానికి చాలా బలాన్ని చ్చారు.
* 2004 ఎన్నికల తర్వాత     వై  ఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన అవిభక్త ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ -టిఆర్ ఎస్ ప్రభుత్వములో  2008 డిసెంబర్ 11 వరకు “” సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా కొనసాగారు.
* తెలంగాణ రాష్ట్ర అవతరణ 2014 జూన్ 2న ఏర్పడిన తొలి ప్రభుత్వంలో  ఆయన తొలి హోం మంత్రి.  హోం,జైళ్లు, అగ్నిమాపక సేవలు,సైనిక్ సంక్షేమం,కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి ఉన్నారు.
* తర్వాత లెజిస్లేటివ్  కౌన్సిల్ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. అక్టోబర్ 21 తేదీ అర్ధ రాత్రి కన్ను మూశారు.