‘తాడిపత్రిలో పొలిటికల్ టెర్రరిజం’

ప్రభుత్వం పొలిటికల్ టెర్రరిజం అనే అజెండాతో ముందుకు సాగుతూ, ప్రతిపక్ష తెలుగుదేశాన్ని దెబ్బతీయాలి, రాష్ట్రాన్ని పాలెగాళ్ల రాజ్యంగామార్చాలనే ఏకైకలక్ష్యంతోనే పాలకులు పనిచేస్తున్నారన్నారని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి దీపక్ రెడ్డి విమర్శించారు.
ఈ రోజు ఆయన జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.తాడిపత్రిలో మాజీ మంత్రి జెసిదివాకర్ రెడ్డి ఇంటి మీద ఎమ్మెల్యే కెతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. దాడికి సంబంధించిన వీడియో క్లిప్పింగులను ఆయన విలేకరులకు చూపించారు. తాడిపత్రిలో మొదలయిన పొలిటికల్ టెర్రరిజాన్ని అడ్డుకొనక పోతే, రాష్టమంతా ఇది విస్తరిస్తుందని ఆయన హెచ్చరించారు.
ఆయన విలేకరుల సమావేశం విశేషాలు:
టీడీపీ అడ్డులేకుంటే విచ్చలవిడిగా దోపీడీ చేయొచ్చనే ఆలోచనలో పాలకులు ఉన్నారు. జరుగుతున్న దారుణాలపై ప్రజలు మౌనంగా ఉంటే, భవిష్యత్ లో అందరూ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు
వైసీపీ వారికి భజనచేయకపోయినా, ఎదురుతిరిగినా, ఎటువంటి గతి పడుతుందో రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలే ప్రత్యక్ష నిదర్శనం.
తాడిపత్రిలో 40ఏళ్లనుంచి రాజకీయాల్లో ఉన్న జే.సీ. కుటుంబం హాయాంలో అక్కడిప్రజలు ప్రశాంతంగా బతికారు. కానీ నేడు అక్కడ జరుగుతున్న సంఘటనలు స్థానికులను భయభ్రాం తులకు గురిచేస్తున్నాయి.
 స్థానిక ఎమ్మెల్యేకేతిరెడ్డి భార్య  ఎద్దులబండి ఇసుకకు రూ.10 వేలు వసూలు చేస్తున్నది.  ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న మాటల్లో  ఇది బయట పడింది. ఆ సంభాషణలు సోషల్ మీడియాలో ప్రచారమయ్యాయి. అధికారపార్టీ  ఇసుక వసూళ్లపై వివరణ ఇచ్చుకోకుండా ఎమ్మెల్యే వీరంగం చేశాడు.
 ఎమ్మెల్యేకు ఎస్కార్ట్ వాహనం, పోలీసుల భద్రత ఉంటుంది, వారందరికీ తెలిసే, వారి సహకారంతోనే  వైసీపీఎమ్మెల్యే తన అనుచరుల వెంటనేసుకుని  జే.సీ.ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి వచ్చాడు.
వాహనాల్లో కర్రలు, కత్తులు, గొడ్డళ్లతో వచ్చిన వ్యక్తులు శాంతికోసం, చర్చలకోసం వచ్చారని చెప్పడం విడ్డూరం.
 జే.సీ.ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడిచేసిన విషయం తెలుసుకున్న ప్రభాకర్ రెడ్డి తనఇంటికి వచ్చాడు. అపుడు ఎమ్మెల్యే కారు విపరీతమైన వేగంతో జే.సీ ఇంటి ముందు నుంచి ఆయన అనుచరులపైకి దూసుకొచ్చిం ది.
పోలీసుల సాయంతో ఎమ్మెల్యే, అతని అనుచరులు జే.సీ ప్రభాకర్ రెడ్డిపైకి రాళ్లురువ్వారు.
అక్కడి పోలీసులు నిజంగా 144 సెక్షన్ అమలుచేస్తే, ఎమ్మెల్యే, అతని కొడుకు, వారి అనుచరులు జే.సీ. ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి ఎలావచ్చారో  సమాధానం చెప్పాలి.
ఎమ్మెల్యే, అతని అనుచరులు రాళ్లు వేస్తున్నప్పుడు చూస్తూకూర్చున్న పోలీసులు, తమను తాము రక్షించుకోవడంకోసం జే.సీ.మనుషులు రాళ్లువేయగానే ఖాకీలు వారిపైపడి వారిని కొట్టుకుంటూ తీసుకెళ్లారు.
పోలీసుల అండ దండలతోనే ఎమ్మెల్యే, అతనికొడుకు, వారి అనుచరులు జే.సీ.ప్రభా కర్ రెడ్డి ఇంటిపైకి దాడికి వచ్చారు.
జే.సీ.ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యేయే తన   అనుచరులపై, ప్రభాకర్ రెడ్డి మనుషులు దాడిచేశారంటూ వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు, 307కేసు పెట్టడం జరిగింది.
 గతంలో స్థానికఎన్నికల నోటిఫికేషన్ వెలుబడిన సమయంలో భాస్కర్ రెడ్డి అనే టీడీపీ కార్యకర్తను వీరాపురంలో హత్యచేశారు. భాస్కర్ రెడ్డి భార్యపై, అతని కుటుంబంపై తప్పుడుకేసులుపెట్టి, ఊరువదిలిపోయేవరకు పోలీసులు వేధించారు.
ఆనాడు జరిగిన దారుణంపై టీడీపీఅధినేత చంద్రబాబు స్పందించినా, పోలీసులు తప్పుడుకేసులను వెనక్కు తీసుకోలేదు.
మరోఘటనలో టీడీపీకిచెందిన సర్పంచ్ అభ్యర్థిని వైసీపీలో చేరాలనిబెదిరించారని, ఆయన అందుకు నిరాకరించాడన్న అక్కసుతో బట్టలూడదీసి పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టడం జరిగింది.
పోలీసులే దగ్గరుండి గూండా ల్లా ప్రవర్తిస్తున్న దాఖలాలు అనేకం ఉన్నాయన్నాయి.
తాడిపత్రిలో జరిగిన ఘటన భవిష్యత్ లో, రాష్ట్రంలో ప్రతిచోటా జరుగుతుందనే వాస్తవా న్ని ప్రజలు గమనించాలి. ఈ పొలిటికల్ టెర్రర్  విధానలకు వ్యతిరేకంగా ప్రజలు బయటకు రాకుంటే, రాచరికవ్యవస్థలోకి వెళ్లిపోయి, బానిసలుగా బతకడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *