జ‌న‌వ‌రి 13,14,15 ల్లో వరంగల్ ఐన‌వోలు జాతర

వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా ఐన‌వోలు శ్రీ మ‌ల్లికార్జున స్వామి జాత‌ర జ‌న‌వ‌రి 13,14,15 తేదీల్లో మూడు రోజుల‌పాటు జ‌రుగుతుంది.
జాత‌ర‌లో భ‌క్తుల‌కుఎలాంటి ఇబ్బందులుఎదురుకాకుండా, ఆక్కడ ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా అవ‌స‌ర‌మైన భ‌ద్ర‌త‌ తీసుకుంటున్నారు.  లావెట్రీలు, చ‌లువ పందిళ్ళు, మంచినీటి వ‌స‌త‌లి, స్నానాల గ‌దులు, బ‌ట్ట‌లు మార్చుకునే గ‌దులు, మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక వ‌స‌తులు, క్యూ లైన్లు, విద్యుత్, సిసి కెమెరాలు, భ‌క్తుల‌కు అన్న‌దానం వంటి అనేక వ‌స‌తుల క‌ల్ప‌ిస్తున్నారు.
ఈ ఏర్పాట్లు మీద   ఉన్న‌తాధికారుల‌తో రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స‌మీక్షించారు.
ఐనవోలు వరంగల్ పట్టణానికి 17 కిమీ దూరాన ఉంటుంది. చారిత్రకాధారాల ప్రకారం ఐనవోలు ఆలయం దాదాపు 1100 సంవత్సరాల చరిత్రకల క్షేత్రం. సాధారణంగా సంక్రాంతి నుంచి ఉగాది దాకా ఈ ఆలయాన్ని ప్రజలు సందర్శిస్తారు. ఈ కాలంలో సుమారు 25 లక్షల మంది దాకా భక్తులు సందర్శిస్తారు. ఈ జాతర మూడురోజుల పాటే జరిగినా ఈ కాలమంతా జాతర కాలమే. విపరీతంగా ఉన్న చలిని లెక్క చేయకుండా లక్షలాది ప్రజలు వచ్చి  ఇక్కడి గుడారాల్లో బస చేస్తుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *