తన పుస్తకం ‘నాలో…నాతో.. వైఎస్ ఆర్ ’ గురించి విజయమ్మ ఏమన్నారంటే…

వై ఎస్  రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారు మ‌న ‌మ‌ధ్య నుంచి వెళ్లిపోయాక ఆయ‌న జ్ఞాప‌కాల‌ను గుర్తుచేసుకుంటూ రాసిన పుస్తక‌మే నాలో.. నాతో.. వైయ‌స్ఆర్
 వైయస్ఆర్ గారి మాట‌, ఆయ‌న సంత‌కం, ఆయ‌న జీవితం ఎన్నో జీవితాల‌ను నిల‌బెట్టాయి.
 నా జీవితం తెరిచి‌న పుస్తకం అని ఆయ‌న ఎప్పుడు చెప్తూ ఉండేవారు. జ‌న జీవ‌నంతో నా ప్రతి ప్రస్థానం ముడిపడి ఉంద‌ని వైయ‌స్ఆర్ గారు ఎప్పుడూ చెప్పేవారు.
 ఈ పుస్తకంలో నాకు తెలిసిన వైయ‌స్ఆర్, నేను ప్రేమించిన వైయ‌స్ఆర్, నేను, నా కుటుంబం, ప్రజ‌ల‌తో ఆయ‌న‌కున్న అనుబంధం తదితర అంశాలు ముడిప‌డి ఉన్నాయి.
వైయ‌స్ఆర్ గారి జీవితం ఒక సందేశం.. ఎందుకంటే ఆయ‌న‌ ప్రతి అడుగు ఒక ఆలోచ‌న, ఆయ‌న‌తో ప్రతి అనుభ‌వం ఒక చెర‌గ‌ని బంధం నాకే కాదు, అంద‌రికీ.
 ఆయ‌న స‌హ‌చ‌ర్యం ఒక మార్గద‌ర్శకం, ఆయ‌న పిలుపు ఒక భ‌రోసా, ఆయ‌న మాట విశ్వస‌నీయ‌త‌కు మారుపేరు.
 వైయ‌స్ఆర్ గారి చెర‌గ‌ని చిరున‌వ్వు స్వచ్ఛత‌కు ఒక చిరునామా.
 వైయ‌స్ఆర్ గారి నాయ‌క‌త్వం, దార్శనిక‌త‌, విలువులు మ‌న జీవితాన్ని నడిపిస్తాయి.
 వైయ‌స్ఆర్ గారి స్థైర్యం, ద‌క్షత ఎన‌లేనివి, ‌సాటిలేనివి. అందుకే ఆయ‌న అంద‌రిలో యుగ‌యుగాలుగా నిలిచి ఉంటారు.
నేను, నా పిల్లలు రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారి ద‌గ్గర నుంచి చాలా చాలా నేర్చుకున్నాం.

https://trendingtelugunews.com/top-stories/breaking/jagan-releases-mothers-book-on-ysr/

 ఈ రోజు కూడా నా పిల్లలు.. కొడుకు, కోడ‌లు, కూతురు, అల్లుడు ప్రతి స‌మ‌యంలో, ప్రతి ప‌రిస్థితుల్లో మా నాన్న ఏం చేసేవారు, మామ‌య్య ఏం చేసేవారు అని ఆలోచించి ముందుకెళ్తా ఉంటారు.
 మీకు ఏదైనా సందేహం వ‌చ్చినా, సంశ‌యం వ‌చ్చినా, క‌ష్టం వ‌చ్చినా, మిమ్మల్ని ఏదైనా బాధ తొలిచివేస్తున్నపుడు ఈ పుస్తకం చ‌ద‌వ‌మ‌ని మిమ్మల్ని కోరుతున్నాను. త‌ప్పకుండా మీ స‌మ‌స్యకు ప‌రిష్కారం దొరుకుతుంది ఈ పుస్తకంలో.. అలాంటి జీవితం వైయస్ఆర్ గారి జీవితం..
 ఈరోజు ఈ పుస్తకం నా పిల్లల‌కే కాదు, అంద‌రికి నేను ఇవ్వాల‌నుకుంటున్నా.
 47 సంవ‌త్సరాలుగా వైయ‌స్ఆర్ తోటి, వైయ‌స్ఆర్ కుటుంబంతోటి పెన‌వే‌సుకున్న అనుబంధం ఉన్న మీకు, రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారిని అమితంగా ప్రేమించే ఈ జ‌గ‌మంత కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ పుస్తకం నేను అందిస్తున్నాను, స‌హృద‌యంతో మీ అంద‌రూ చ‌ద‌వాల‌ని నేను కోరుకుంటున్నాను.
రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారు(వైయ‌స్ఆర్) నాకు ఒక స్పూర్తి, ఆయ‌న మాట‌లు ఒక స్ఫూర్తి, ఆయ‌న మాట‌లు మీ అంద‌రికి కూడా స్ఫూర్తి నింపుతాయ‌ని న‌మ్ముతున్నాను.
రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారు నా వాడే కాదు.. అంద‌రివాడు.. అని సగ‌ర్వంగా చెప్తున్నా, ఈ అనుబంధం క‌ల‌కాలం నిలవాల‌ని కోరుకుంటూ.. మీ అంద‌రి ప్రార్థన‌లు, ప్రేమ‌లు, ఆశీర్వాదాలు నా బిడ్డల‌కు స‌దా ఉండాల‌ని కోరుకుంటూ ‌సెల‌వుతీ‌సుకుంటున్నాను.

One thought on “తన పుస్తకం ‘నాలో…నాతో.. వైఎస్ ఆర్ ’ గురించి విజయమ్మ ఏమన్నారంటే…

Comments are closed.