అమ్మ రాసిన ”నాలో.. నాతో.. వైయ‌స్ఆర్” ఆవిష్కరించిన జగన్

శ్రీమతి విజయమ్మ రాసిన  పుస్తకం  ముఖ్యమంత్రి  వైయస్ జగన్ ఈ రోజు ఆవిష్కరించారు.
 డాక్టర్‌ వైయస్సార్‌  సహధర్మచారిణిగా శ్రీమతి విజయమ్మ 37 ఏళ్ళ జీవితసారం ఈ పుస్తకం.
ఇడుపుల‌పాయ‌లోని వైయ‌స్ఆర్ ఘాట్ వ‌ద్ద మ‌హానేత డాక్టర్ వైయ‌స్ఆర్‌కు ముఖ్యమంత్రి ఘ‌న‌ంగా నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా.. తల్లి విజయమ్మ రచించిన ”నాలో.. నాతో.. వైయ‌స్ఆర్” పుస్తకాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ నాన్న జ‌యంతిని పుర‌స్కరించుకుని అమ్మ ఈ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం అమ్మ.. నాన్నను చూసిన విధంగా.. ”నాలో.. నాతో.. వైయ‌స్ఆర్” ర‌చ‌న చేశారని సీఎం అన్నారు.
నాన్న బయట ప్రపంచానికి ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా, ఒక గొప్ప నాయకుడిగా మనందరికీ బాగా పరిచయమైన వ్యక్తి అని తెలిపారు.

https://trendingtelugunews.com/top-stories/breaking/ys-vijayamma-talks-about-her-book-on-ysr/

వైయ‌స్ఆర్‌ గారిలో ఉన్న గొప్పత‌నాన్ని, ఒక భ‌ర్తను, తండ్రిని, మంచి వ్యక్తిని అమ్మ పుస్తక రూపంలో ఆవిష్కరించారని సీఎం వైయస్ జగన్ కొనియాడారు. నాన్నతో అమ్మ చేసిన ‌సుదీర్ఘ ప్రయాణంలో తాను తెలు‌సుకున్న, చూసిన నాన్నను ఈ పుస్తకంలో ఆవిష్కరించారని సీఎం జగన్ అన్నారు.