రఘురామ మీద అనర్హత వేటు ఎపుడు? : వైసిపి

న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌ కృష్ణరాజుపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్ల‌మెంట‌రీ మరొక సారి లోక్ సభ స్పీకర్  ఓం బిర్లాకు విజ్జప్తి చేసింది.

వైసిపి పార్లమెంటరీపార్టీ  నేత విజ‌య‌ సాయిరెడ్డి, లోక్‌స‌భ నాయ‌కుడు మిథున్‌రెడ్డి, చీఫ్ విప్ మార్గాని భ‌ర‌త్  ఈరోజు స్పీకర్ ను కలసి  విన‌తిప‌త్రం అంద‌జేశారు.

త‌మ పార్టీ టికెట్‌పై గెలిచి, ఆ త‌ర్వాత పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న‌ ర‌ఘు రామ‌ కృష్ణంరాజు పార్ల‌మెంట్ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని ఇప్ప‌టికే అనేక‌ మార్లు స్పీక‌ర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేస్తూనే ఉంది.  దీని మీద స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని వైసిపి అసహనంతో ఉంది.  అయితే, నిర్ణయం తీసుకోవాలని ఎవరూ స్పీకర్ మీద వత్తిడి తీసుకురాలేదు. ఎంత కాలమయినా సరే ఆగాల్సిందే.

పార్టీ కోరినంత మాత్రాన  లోక సభ సభ్యుడి మీద అనర్హత వేటు వేయాలనేం లేదు. చాలా సందర్భాలో పార్టీల నుంచి బహిష్కృతులయినా కూడా స్పీకర్ లు అనర్హత వేటు వేయలేదు. అలాంటపుడు ఏ పార్టీకి చెందని సభ్యుడి గా సభలో కొనసాగుతారు.

జూన్ లో అసహనంతో లేఖ

రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై అనర్హత వేటు వేయడం మీద లోక్ సభ స్పీకర్ చేస్తున్న జాప్యం పట్ల వైసిసి అసహనం వ్యక్తం చేసింది. పార్టీ నర్సాపురం  ఎంపి రెబెల్ గా మారాక, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్టీ  ఎంపిల 11 నెల కిందట స్పీకర్ ఓమ్ బిర్లాకు లేఖ ఇచ్చారు. ఇంతవరకు  రఘురామ మీద చర్య తీసుకోలేదు. దీనిని బట్టి రెబెల్ ఎంపిని లోక్ సభలో లేకుండా చేయాలన్న జగన్ కోరిక నెరవేరవడం లేదు. ఈ రోజు ఎంపిగా ఉన్న ప్రివిలేజెస్ ను ఉపయోగించుకుని రఘురామ జగన్ మీద ప్రత్యక్ష యుద్ధం ప్రకటించారు. జగన్ జైలుకు పంపుతానని   చెబుతున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశారు. పార్లమెంటు ప్రివిలేజెస్ కమిటీ కి పోలీసుల మీద ఫిర్యాదు చేశారు. ఢిల్లీ లో బిజెపి నేతల రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో ఎప్పటికపుడు వివరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన తొందరగా పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం అనర్హత వేటు  వేయాలని  వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయి రెడ్డి లోకసభ స్పీకర్ ఓం బిర్లా కు  లేఖ రాశారు.

 

https://trendingtelugunews.com/top-stories/breaking/ycp-vijayasai-unhappy-over-speaker-on-raghuram-disqualification-issue/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *