వైసిపి ఎంపీ రఘురామ కృష్ణంరాజును కోర్టు కాపాడగలదా?

తనపై అనర్హత, సస్పెన్షన్ చర్యలు అడ్డుకోవాలని హైకోర్ట్ లో పిటిషన్ వేసిన వైసిపి నర్సాపురం  ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ వేశారు.
పార్టీ నాయకత్వం మీద పార్టీ ప్రభుత్వ విధానాలమీద తిరుగుబాటు జెండా ఎగరవేసిన రఘరామ కృష్ణం రాజును పార్టీ నుంచి బహిష్కరించి, ఆపైన లోక్ సభ నుంచి డిస్ క్వాలిఫై చేసే అవకాశం ఉంది.  దీనికోసమే పార్టీ ఎంపిలంతా ఈరోజు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసే అవకాశం ఉంది.
అయితే,  రఘురామ కృష్ణం రాజు వ్యవూహాత్మకంగా ఈ మధ్య బిజెపితో సన్నిహితంగా ఉంటూ బిజెపిలో చేరతాడనే వార్తలు వచ్చాయి. బహుశా పార్టీ నుంచి బహిష్కరించబోతో బిజెపి తో స్నేహం తనకు రక్షణ కవచంగా ఉంటుందని ఆయన ఆశించి వుండవచ్చు. ఎందుకంటే డిస్ క్వాలిఫికేషన్ నిర్ణయం పూర్తిగా స్పీకర్ మీద ఉంటుంది. స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా ఎంతకాలమయిన వాయిదా వచ్చు. ఇలా ఆయన ఏ పార్టీ కి చెందని సభ్యుడిగా లోక్ సభలో కొనసాగవచ్చు. అయితే,  మోదీ ప్రభుత్వానికి రఘరామకృష్ణంరాజుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ ఆర్ సిపిలో స్నేహమే ముఖ్యం. రఘురామకృష్ణం రాజు బిజెపి తీసుకువచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. బహుశా విరాళాలిచ్చి ఆదుకోవచ్చు. అందువల్ల వైఎస్ ఆర్ సిపి వత్తిడి తీసుకువస్తే, బిజెపి ఆయన మీద అనర్హత వేయడాన్ని అడ్డుకోవడం కష్టమే. అందుకే కావచ్చు ఆయన లీగల్ రూట్లోకి వచ్చారు. ఒక టెక్నికల్ పాయింట్ పట్టుుకుని కేసును గెలవాలనుకుంటున్నారు. అదేంటంటే ఆయన షో కాజ్ నోటీసు జారీ చేసిన పార్టీ వేరు, తాను పోటీ చేసి ఎన్నికల్లో గెలిచిన పార్టీ వేరు.
తాను  ఎటువంటి పార్టీ వ్యతిరేఖ చర్యలకు పాల్పడలేదని తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ పై షోకాజ్ నోటీసులు వచ్చాయని, ఇది చెల్లదని ఆయన పిటిషన్ లో  పేర్కొన్నారు.  తాను గత ఎన్నికల్లో యువజన రైతు శ్రామిక పార్టీ తరుఫున ఎన్నికైనందున ఆ పార్టీ పేరు  మీద షో కాజు  నోటీస్ ఇవ్వలేదని ఆయన అన్నారు.
ఈ పిటిషన్ సోమవారం హైకోర్టుకు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది.