Home Breaking కొండా విశ్వేశ్వర రెడ్డి విసిరిన రెండు తెలంగాణ ట్వీట్ల కథ

కొండా విశ్వేశ్వర రెడ్డి విసిరిన రెండు తెలంగాణ ట్వీట్ల కథ

397
0

మాజీ చెేవెళ్ల కాంగ్రెస్ ఎంపి కొండా విశ్వేశ్వర రెడ్డి ఈ రోజు రెండు ట్వీట్లు టిఆర్ ఎస్ మీదకు వదిలారు. ఈ రెండు ట్వీట్లను చూస్తే  అవి ఎంత ఎత్తిపొడుపుతో, కయ్యానికి కవ్వించేలా ఉన్నాయో సులభంగా అర్థం చేసుకోవచ్చు.

ఇంతగా  గుచ్చుకునే (Biting Sarcasm) విమర్శను సాధారణంగా రాజకీయ నాయకులను నుంచి ఆశించలేం. ఎందుకంటే వాళ్లంతా బిగ్గరగా వినిపించే  దంచుడుకే ప్రాముఖ్యం ఇస్తారు.నిశబ్దంగా ములు గర్రతో గుచ్చినట్లుండే విమర్శను  వాళ్లు గుర్తించరు.

ఈ రెండు ట్వీట్లతో విశ్వేశ్వరరెడ్డి టిఆర్ ఎస్ పార్టీని ఎక్కడ గుచ్చాలో అక్కడ గుచ్చారు. ఈ రెండు చిన్న ట్వీట్లలో విశ్వేశ్వరరెడ్డి తెలంగాణలో జరుగుతున్న పెద్ద రాజకీయ చర్చను సూక్ష్మీకరించి చెప్పారు.

తెలంగాణ లో నడుస్తున్నముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం ప్రాధాన్యతలేమిటో కూడా చెప్పారు. వ్యంగ్యాస్త్రం ప్రయోగించారు.

తెలంగాణ ప్రభుత్వానికి సెక్రెటేరియట్ నిర్మాణమే ఎందుకంత  టాప్ ప్రయారిటి ఐటెమో చెప్పారు.  వాస్తు బాగా లేదని సెక్రెటిరియట్ కూల్చారు. వాస్తు దోషం ఉన్న సెక్రెటేరియట్ వారసత్వం నిలవదని ఎవరో చెప్పారని అందుకే ఆయన కూల్చి కొత్తది కట్టాలనుకుంటున్నారని తెగు విమర్శలొచ్చాయి ప్రతిపక్షంనుంచి.

దీనిని తొందరగా నిర్మింంచడం వెనక ఉన్న మర్మం కూడా ఆయన చెప్పారు. కెటిఆర్ ను ముఖ్యమంత్రి చేసేందుకు కెసిఆర్ తాపత్రయపడుతున్నారని, అందుకే సెక్రెటేరియట్ నిర్మాణానికి, పునాది రాయివేసేందుకు ముహుర్తాలు పెట్టుకున్నారని  కొండా చెబుతారు.

అవి పూర్తయిన వెంటనే తొలి ముఖ్యమంత్రిగా కెటిఆర్ పట్టాభిషేకం జరుగుతుందని ఆయన చెప్పకనే చెప్పారు. బయట వినపడుతున్నది కూడా ఇదే టాక్. కొత్త సెక్రెటేరియట్ పూర్తికావడం కోసమే కెటిఆర్ పట్టాభిషేకం వాయిదాపడుతూ వస్తున్నదని జనం, జర్నలిస్టులు అంటండగా విన్నాం. ఇపుడు విశ్వేశ్వర రెడ్డి కూాడా ఇదే చెప్పారు.

 ఈ విషయాన్ని ఆయన ఉస్మానియా ఆసుపత్రి పునర్నిర్మాణంతో ముడేసి చెప్పారు. సెక్రెటేరియట్ నిర్మించేందుకు ఉన్న ఆత్రుత, సెక్రెటేరియట్ శంకుస్థాపనం కు, పూర్తిచేసేందుకు పెట్టిన ముహూర్తాలు, తెలంగాణ పేదలకు గుండెకాయ వంటి దైన ఉస్మానియా జనరల్ ఆసుప్రతికి నిర్మాణానికి లేవే అనేది ఆయన ప్రశ్న.

ఆయన సంక్రాంతి సందర్బంగా గాలిపటం ఎగరేసేందుకు వెళ్లినపుడు శిధిలావస్థలో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి భవనం కనిపించింది. అక్కడి పరిస్థితి చూసి చలించి ఆయన ట్వీట్ చేసినట్లు చెప్పారు. ఇదికెసిఆర్ సిగ్గు పడాల్సిన విషయం అని వ్యాఖ్యానించారు.

I went to Osmania Hospital side to fly kites. It is shocking !!! This is a RUNNING Hospital !!! Not ruins. Used to be one of the MOST beautiful buildings in Hyderabad. A Heritage Building. See patients cloths drying in Sun. This is the shocking state of Telangana Govt. Shame KCR.

కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లున్న ఆసుపత్రి భవనం ఫోటోని ఆయన ట్వీట్ చేశారు.  ఈ భవనాన్ని చూస్తే, దాని స్థానంలో మరొక భవనం కట్టడమనేది  ఏ ప్రభుత్వానికైనా ప్రథమ ప్రాధాన్యం కావాలి. అయితే, అలా కాలేదు, సెక్రెటేరియట్ కు ఆ హోదా దక్కింది.

Secretariat OR Hospital? Vaastu is Very Important. Without Vaastu compliant secretariat, Pattabhishekam is inauspicious. Time running out & there are family pressures for early Pattabhishekam. The BIG DILEMMA is which should he build first- Secretariat OR Hospital? You tell.

ఇదీ టిఆర్ ఎస్ రాజకీయం అనేది ఆయన  చెప్పని వ్యాఖ్య.

దీనికి ఆసక్తికరమయిన స్పందన వచ్చింది.

దీనితో ఆయన తెలంగాాణ ప్రభుత్వానికి

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here