కెసిఆర్ ఢిల్లీ విజిట్ శాంతియాత్రయా?

కెసిఆర్ ఢిల్లీ వెళ్లింది  నీళ్ల కోసం, నిధుల కోసం కాదు, ఆగ్రహంతో ఉన్న  బిజెపిని మచ్చిక చేసుకునేందుకు మాత్రమే నని, ఇది శాంతి యాత్ర అని అంటున్నారు.
ఎందుకంటే, సాధారణంగా కెసిఆర్ తనని  తాను దేశంలోనే విశిష్టమయిన నాయకుడిగా భావిస్తారు. అందుకే ఆయన మర్యాదపూర్వకంగా కేంద్ర నాయకులను కలవడం, నిధులకు దేబరించిడం చేయరు.
ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించాక  ఆలస్యంగా, తీరుబడిగా డిల్లీ వెళ్లి అభినందించారు.  చాలా మంది ముఖ్యమంత్రులు బాధ్యతలు స్వీకరించగానే రెండు మూడు రోజుల్లోనే ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలసి పూలగుచ్ఛం ఇచ్చి, శాలువ కప్పి వస్తుంటారు. కెసిఆర్ తీరే వేరుగా. ఆయన తీరుబడిగా వెళ్లారు.  దేశంలో అతి తక్కువ సార్లు ఢిల్లీ యాత్ర చేసిన ముఖ్యమంత్రులలో ఆయన ఒకరై ఉంటారు.
ఇలాంటి కెసిఆర్ మునిసిపల్ ఎన్నికల్లో టిఆర్ ఎస్ కు అంతగాయమయినా లెక్క చేయకుండా నిధులకోసమని ఢిల్లీ వెళ్లడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది.
కారణం, నీళ్లు నిధుల సమస్యలు ఒకతాయానా తెగవు. దానికి  ఇంత అర్జంటుగా వెళ్లాల్సిన పనిలేదు. వెళ్లే ముందు ఆయన ఢిల్లీకి ఒక శాంతి సందేశం కూడా పంపించారు. అది ఢిల్లీలో ప్రధాని డ్రీమ్ ప్రాజక్టుగా తయారవుతున్న కొత్త పార్లమెంటు భవననిర్మాణాన్ని ఆయన స్వాగతించారు.
ఇది ఇందులో రెండు సందేశాలున్నాయి.
ఒకటి: ఎన్నికలపుడు చిమ్ము కున్న బురదను తుడిచేసుకుందాం. కలసి పనిచేద్దాం. ఓట్లపుడు ఎన్నో అనుకుంటాం. వాటిని పట్లించుకోవద్దు.
రెండు:ఇది తెలంగాణ బిజెపి నాయకులకు.తెలంగాణ బిజెపి కెసిఆర్ కొత్త సెక్రెటేరియట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఉంది.  కొత్త సెక్రటేరియట్ నమూనాలను బిజెపి తిరస్కరించింది. ఇపుడు ప్రధాని కొత్త పార్లమెంటుభవన నిర్మాణాన్ని సమర్థించినందు వల్ల తెలంగాణ బిజెపి నోరు మూయించవచ్చు.
అందుకే సంగారెడ్డి ఎమ్యెల్యే తూర్పు జయప్రకావ్ రెడ్డి(జగ్గారెడ్డి) కెసిఆర్ మూడు రోజుల ఢిల్లీ పర్యటనను  రహస్య ఎజండా ఉన్న యాత్రగా వర్ణించారు.
“హైదరాబాద్ లో కొత్త సెక్రటేరియట్ కడుతున్నాడు కాబట్టే మోడీ కడుతున్న కొత్త పార్లమెంట్ భవనానికి సమర్దిస్తున్నాడు. హైదరాబాద్ లో బీజేపీ తిడుతడు..రాత్రి కి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ ,అమిత్ షా తో మంతనాలు జరుపుతడు.టిఆర్ఎస్ తో బీజేపీ కి రాజకీయ చీకటి ఓప్పందం ఉంది” అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.పొలిటికల్ సర్కిల్స్ వినబడుతున్న వాదన
మొన్న జిహెచ్ ఎంసి ఎన్నికల్లో ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన కుమారుడు కెటిఆర్ పలుమార్లు బిజెపిని ఐడియాలాజికల్ గా చావమోదారు.  బిజెపి హైదరాబాద్ లో హిందూ ముస్లిం పోలరైజేషన్ సృష్టిస్తూ ఉందని, బిజెపి గెలిస్తే మళ్లీ కర్ఫ్యూల హైదరాబాద్ వస్తుందని, బిజెపి దేశానికి ప్రమాదకరం అని,  హైదరాాబాద్ పాకిస్తాన్ కాదు అని, హైదరాాబాద్ గుజరాత్ కాదు అని…ఇలా  విమర్శించారు.  అంతేకాదు, హైదరాబాద్ లో ఉన్న కవులు, కళాకారులు కూడా బిజెపికి ఓటేయవద్దని ప్రకనట చేసేలా కూడా టిఆర్ ఎస్ ప్రేరేిపించిందని బిజెపినేతలు భావిస్తున్నారు. ఇవన్నీ ఢిల్లీకి ఎపుడో చేరాయి.
ఇలా జరిగినపుడు టిఆర్ ఎస్ కు అఖండ విజయం వచ్చి ఉంటే ఈ విమర్శలు  లెక్కలోకి వచ్చేవి కాదు. అయితే టిఆర్ ఎస్ కు కౌన్సిల్ ఏర్పాటు చేసేంత మెజారిటీ కూడా రాలేదు.
అందువల్ల   ఇంత పెద్ద మాటలు అన్నందుకు బిజెపికి కోపం రాకుండా ఉండాలని ఏదో సర్ది చెప్పేందుకు  ఢిల్లీ యాత్ర చేస్తన్నారని కెసిఆర్ విమర్శకులు చెబుతున్నారు. లేకపోతే, బిజకపి ఆయనను యాంటి నేషనల్ గా ముద్ర వేసే ప్రమాదం ఉంది.  బిజెపి ఈ యాంగిల్ ఒక చిటికె వేస్తే సోషల్ మీడియా లో కేసిఆర్ మీద యుద్దం మొదలవుతుంది. అది మందిది కాదు. అందువల్ల జిహెచ్ ఎంసి చిచ్చును ఆర్పేయాల్సిందేనని  కెసిఆర్ భావించి ఉంటారని, అందుకే ఎకాఎకి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు.
నిధులు నీళ్లొస్తాయో లేదో గాని, ఈ యాత్ర వల్ల కెసిఆర్ ఇమేజ్ కొద్దిగా వన్నె తగ్గింది. దీనికేదయిన విరుగుడు ను ముఖ్యమంత్రి కనిపెడతారేమో చూడాలి.  ఆయన ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులను కలుసుకుంటాడని, అక్కడ ఏదో ఒక ప్రకటన చేసి ప్రధానిమోదీ, హోం మంత్రి అమిత్ షాలతో తన సమావేశం చర్చనీయాంశం కాకుండా చేస్తారేమో చూద్దాం. ఇలా చూస్తే ఆయన  రైతుమిత్రుడిగా హైదరాబాద్ తిరిగి రావచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *