Home Breaking రాజధాని మీద దాగుడు మూతలొద్దు : జనసేన పవణ్

రాజధాని మీద దాగుడు మూతలొద్దు : జనసేన పవణ్

78
0
జన సేన నేత  పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇలా ఒక ప్రకట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ పెడుతున్నారో స్పష్టమైన అధికారిక ప్రకటన చేయాలి
రాజధాని విషయంలో వై.ఎస్.ఆర్.సి.పి.నాయకులు చేస్తున్న ప్రకటనలు ప్రజలను మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయి.
మీడియా సమావేశంలో‌ వైసిపి చెప్పిన అంశాలు గందరగోళాన్ని మరికొంత కాలం పొడిగించేలా ఉన్నాయి
తమకు అనుకూలంగా పరిస్థితులను మార్చుకోవాలన్న దిశగా వారి ఆలోచనలు సాగాయి.
రాజధాని అమరావతిలోనే ఉంటుందని ఒకసారి, మూడుచోట్ల రాజధాని ఉంటుందని మరోసారి చెప్పి గందరగోళాన్ని ఇంకాస్త పొడిగించారు.
అమరావతి భూ సేకరణలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఇప్పటికే పలుసార్లు చెప్పారు.
ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిపిన వారి వివరాలు గతంలోనే ప్రకటించారు.
అధికారం మీ చేతుల్లోనే ఉంది. వారిపై కేసులు నమోదు చేయవచ్చుగా..?
ఎందుకు ప్రకటనలతో కాలం వెళ్లదీస్తున్నారు. చెప్పిన విషయాన్నే పదే పదే చెబుతున్నారు.
అప్పుడు రాజధాని కోసం భూములు తీసుకోవద్దని పవన్ అన్నాడని
ఇప్పుడు రాజధాని ఇక్కడే ఉంచాలని అమరావతి రోడ్లపై ఎందుకు తిరుగుతున్నారో తెలియడం లేదని అంటున్నారు
అలా అంటున్న పెద్దలకు ఒక్కటే చెబుతున్నా..
భూములు ఇవ్వబోమని చెప్పిన రైతులపై భూ సేకరణ చట్టం ప్రయోగించవద్దన్నా
బలవంతంగా భూములు సేకరిస్తే ఉద్యమిస్తామని నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల పక్షాన పోరాడా..
నేడు రాజధాని కోసం తమ భూములను త్యాగం చేసి రోడ్డున పడిన రైతులకు అండగా నిలుస్తున్నా
నాడు రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు.
33000 ఎకరాలు అవసరమా? అని ప్రశ్నించా..
ఒక వేళ ప్రభుత్వం మారితే భూములు ఇచ్చిన రైతుల భవిష్యత్తు ఏమిటని భయపడ్డా..
అదే ఇప్పుడు నిజమవుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
అధర్మం ఎక్కడో అక్కడే జనసేన పోరాటం ఉంటుందన్న విషయం మీకూ తెలియంది కాదు.
జనసేన కోరుకుంటున్నది చాలా విస్పష్టం.. పాలన కేంద్రీకృతం కావాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.
అటువంటి రాజధానిని జనసేన కోరుకుంటోంది. అటువంటి రాజధానిని మీరు రాయలసీమలో పెడతారో, ఉత్తరాంధ్రలో పెడతారో స్పష్టంగా ప్రకటించండి.
అయితే ఆనాడు అమరావతి ఏర్పాటుకు అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్ రెడ్డి గారితో సహా సర్వజనులు ఆమోదం తెలిపారు.
ఇప్పుడు మీరు ఏర్పాటు చేయబోయే రాజధాని సర్వజనులకు ఆమోదయోగ్యంగా ఉండాలి.
ప్రతిపక్షంతో సహా అందరూ ఆమోదించాలి.
అయితే దీనిపై కాలయాపన లేకుండా అధికారికంగా స్పష్టమైన ప్రకటనను జనసేన కోరుతోంది.
ప్రజాశ్రేయస్సు దృష్ట్యా కాలయాపన వాంఛనీయం కాదు.
పాలకుల నిర్ణయాల కారణంగా ఇప్పటి రాజధాని త్రిశంకు స్వర్గంగా మారిపోయింది.
అన్నిటికీ మించి అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారో ముందుగా చెప్పాలి.
కమిటీల పేరుతో ప్రజలతో దాగుడుమూతలను ఇకనైనా ప్రభుత్వ పెద్దలు ఆపాలి.
ప్రాంతీయ భేదాలు తలెత్తకుండా చూడాలి.