గాంధీ విగ్రహానికి అవమానం సిగ్గుచేటు: ట్రంప్

అమెరికాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అవమాన పర్చడం ‘సిగ్గు చేటు’ అని ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు వ్యాఖ్యానించారు.
అయిదు రోజుల వాషింగ్టల్ డిసిలోని భారత రాయబార కార్యాలయానికి ఎదురుగా రొడ్డుకవతల ఉన్న గాంధీ విగ్రహాన్ని కొంత వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహానికి నల్ల రంగు పూశారు. దేశమంతా జార్జ్ ఫ్లాయిడ్ హత్య కు నిరసనలు చెలరేగుతున్న తరుణంలో జూన్ రెండు-మూడు తేదీల రాత్రి శాంతిదూతగా పేరు వడిన మహాత్ముడి విగ్రహాన్ని ఇలా అవమానపర్చడం దేశాన్ని కుదిపేసింది.
ఈరోజు విలేకరుల సమావేశంలో విగ్రహ విధ్వంసం గురించి ప్రస్తావించినపుడు ట్రంప్ ‘అది సిగ్గు చేటు’ ( it was a disgrace)అన్నారు.
ఈ విగ్రహ ధ్వంసం గురించి భారత రాయబార కార్యాలయం అమెరికా స్టేట్ డిపార్ట్ మెంటుతో, మెట్రోపాలిటన్ పోలీస్, నేషనల్ పార్క్ సర్వీస్ ల దృష్టికి తీసుకువచ్చారు.
గాంధీ విగ్రహానికి అవమానం జరిగిన సంఘటన దురదృష్టకరమమని ట్రంప్ సలహాదారు కింబర్లే వ్యాఖ్యానించారు.