ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్ కరోనా నెగటివ్

ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాజ్ కరోనా నెగటివ్ అని తేలింది. ఆదివారంనాడు కోవిడ్ -19 లక్షణాలు కనిపించడం ఆయన శాంపిల్స్ ను మంగళవారం ఉదయం సేకరించి కరోనా పరీక్ష పంపించారు. అయితే, ఇపుడాయన నెగటివ్ అని తేలింది.
 ఆదివారం నాడు ఆయన కోవిడ్ లక్షణాలు కన్పించగానే ఆయన స్వీయ క్వారంటైన్ లోకి వెళ్లారు.  కొద్ది జ్వరం, గొంతురాపిడి ఉండటంతో ఆయనే   ముందుజాగ్రత్తగా  సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు.  ఇప్పటికే ఆయనకు షుగర్ వ్యాధి ఉంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఆదివారం నాడు ఆయన క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ మధ్య సాధ్యమయినంతవరకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారానే సంప్రదింపులు జరుపుతున్నారు. ఆదివారం నాడు క్యాబినెట్ సమావేశం తర్వాత ఆయనక కొద్దిగా జర్వం వచ్చింది. దీనితో తన కార్యక్రమాలన్నింటిని రద్దు చేసుకున్నారు. ఢి్ల్లీ ఆసుపత్రులలో ఢిల్లీ వాసులకే చికిత్ప చేయాలని ఈ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కొట్టి వేశారు.
అనంతరం ఆయన డాక్టర్ల సూచన మేరకు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటున్నారు. మంగళవారం నాడు పరీక్ష చేయించుకుంటారని ఆయన సన్నిహితులు తెలిపారు.