ఇక ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు, ఇ-వాచ్ యాప్ ఆవిష్కరించిన నిమ్మగడ్డ

పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ కోసం రూపొందించిన ఇ- యాప్ (eWatch) ని ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్  నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆవిష్కరించారు. ఎన్నికలకు సంబందించిన ఫిర్యాదులను ఈ యాప్ తో నేరుగా,ఎవరికీ భయపడకుండా, ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఎస్ఈసికి చేరవేసే అవకాశం లభిస్తుంది.

ఎన్నికల్లో అక్రమాల పాల్పడే వారి మీద, ప్రలోభాలు పెట్టే వారి మీద  ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసే ప్రజలందరికి వీలవుతుంది.ఫిర్యాదు స్వీకరణకు కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.

గతంలోనూ టెక్నాలజీని ఎన్నికల కోసం వాడామని రేపటి నుంచి గూగుల్  ప్లేస్టోర్  నుంచి యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని, పారదర్శకంగా యాప్  రూపొందించామని ఈ సందర్భంగా నిమ్మగడ్డ తెలిపారు.

ఫిర్యాదు పరిష్కారం అయ్యిందా లేదా అనేది కాల్ సెంటర్ ద్వారా తెలుసుకోచ్చని, యాప్ లో ట్రాక్ చేయవచ్చని కూడా ఆయన చెప్పారు.

ఎమర్జన్సీ ఫిర్యాదులు తక్షణం పరిష్కరిస్తామని,  మిగతా ఫిర్యాదులు పరిష్కరించేందుకు మూడు రోజులు పడుతుంది. సమస్యను పరిష్కరించిన తర్వాత వదిలేయడం జరగదు. ఫిర్యాదును పరిష్కరించాక, ఫిర్యాదు దారుడు సంతృప్తిగా ఉన్నాడా లేడా అనేదాన్ని ఫోన్ చేసి కాల్ సెంటర్ వారు అభిప్రాయం తెలుసుకుంటారు, ఫిర్యాదు దారు సంతృప్తిగా లేకపోతే, మళ్లీ ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుల పరిష్కారం మొక్కబడిగా కాకుండా క్వాలిటీతో పరిష్కరించాలనేది ఈ యాప్ ఉద్దేశమని అధికారులు చెప్పారు.

రిలయన్స్ పార్ట్ నర్ ద్వారా ఈ యాప్ ను రూపొందించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *