ఢిల్లీ రైతులకు పాప్ సెలెబ్రిటి రిహాన్నా మద్దతు ఎందుకొచ్చింది?

రైతు ఉద్యమాలకు పాప్ స్టార్లకు ఉన్నసంబంధం ఏమిటి? ఏమీ లేదు. రెండు విభిన్న ధృవాలు. ఎక్కడా కలుసుకునే వీలే లేదు. అందుకే ఢిల్లీ రైతులకు పాప్ స్టార్ రిహాన్నా మద్దతు నీయడాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం.

ఢిల్లీ హర్యానా సరిహద్దులలో దాదాపు రెన్నెళ్లుగా కేంద్ర రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చెేస్తున్న వాళ్లకి  ఇలా అనుకోని  మూలలనుంచి మద్దతు వస్తున్నది.

అందునా ఇంటర్నేషనల్ ఫిమేల్ స్టార్స్ నుంచి వస్తున్నది. అంతర్జాతీయ మీడిమా ఈ ఉద్యమాన్ని బాగా ప్రచారం చేస్తూ ఉండటంతో   రైతులకు అనుకోని శక్తుల నుంచి మద్దతు వస్తూ ఉంది.

దానికి తోడు   జనవరి 26 రిపబ్లిక్ డే నాడు ఢిల్లీ జరిగిన హింసాకాండ  రైతులు ఉద్యమం ఇమేజ్ ని దెబ్బతీసినా ఉద్యమాన్ని మాత్రం అంతర్జాతీయ వార్త చేసింది.

ఈ సంఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం రైతులు గూమి కూడిన ప్రదేశాలలో ఇంటర్నెట్ బంద్ చేయడంతో ఈ వార్త అంతర్జాతీయ మయిపోయింది. ప్రపంచవ్యాపితంగా ఇంటర్నెట్ బంద్ చేయడాన్ని ఒక పెద్ద మానవ హక్కుల ఉల్లంఘనగా చూస్తారు. భారత సుప్రీం కోర్టు కూడా ఇంటర్నెట్ అనేది నిత్యావసరంగా గుర్తించింది. ప్రపంచంలో  ఇంటర్నెట్ మీద ఆంక్షలను విధించడాన్ని పర్యవేక్షించే మానవ హక్కుల సంస్థలు వచ్చాయి. అయితే,   రైతుల ఉద్యమ వార్తలు నలుమూలలకు ప్రాక రాదని ఇంటర్నెట్ బంద్ చేస్తే, ఇంటర్నెట్ బంద్ అనే వార్త ప్రపంచమంతా పాకింది. దీనిని మానవ హక్కుల ఉల్లంఘనగా చూస్తున్నారు.

పాప్ సంగీతాన్ని కొట్టిపడేయనవసం లేదు. పాప్ సంగీతం సోషల్ జస్టిస్ అంతర్జాతీయ ఉద్యమంలో భాగంమయింది.  జాతి వివక్ష (racism) ను వ్యతిరేకించడం పాప్ కల్చర్ లో ప్రధానాంశమయింది. జాతి వివక్ష వ్యతిరేక పోరాటాలకు పాప్ మ్యూజిక్ నేపథ్యం సంగీతమయింది. బాబా డిలాన్ (Blowin’ in the Wind 1963) , శామ్ కూక్ (A Change is Gonna Come 1964) గానం చేసింది వివక్ష గురించే. 2014 ఆగస్టులో 18 సంవత్సరాల మైఖేల్ బ్రౌన్ శ్వేత దురహంకార పోలీసు అధికారి హత్య చేసిన తర్వాత నిరసనోద్యమం లో భాగంగానే Kendrick Lamar   “Alright” రాసింది. బతుకు దెరువుకు జరిగే ప్రతిపోరాటం వివక్ష వ్యతిరేక పోరాటమే.

ఇంటర్నెట్ బంద్ మీద సిఎన్ ఎన్ (CNN) రాసిన వార్తను ఉదహరిస్తూనే పాప్ స్టార్ రిహాన్నా రైతులకు మద్దుతు తెలిపింది. తర్వాత స్వీడెన్ కు చేందిన పర్యావరణ కార్యకర్త గ్రేటా తున్ బెర్గ్ కూడా ఇంటర్నెట్ బంద్ ను ఖండించింది.

భారతదేశంలో ఆందోళన చేస్తున్న రైతుల పక్షాన నిలబడతామని గ్రేటా ప్రకటించింది. గ్రేటా చిచ్చరపిడగు.  18 సంవత్సారాల ఈ పిల్ల చేపడుతున్న పర్యావరణ కార్యక్రమాలకు అంతర్జాతీయ అవార్డులెన్ని వచ్చాయో. 2019, 2020లలో రండు సార్లు నోబెల్ శాంతి బహమతికి నామినేట్ అయింది.

రిహాన్నా , గ్రేటా ట్వీట్లను భారత ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా  పేర్కొంది. విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ, రైతుల పోరాటాలు, భాతరదేశ ప్రజాస్వామిక విలువలకు ప్రతీక అని సమస్య పరిష్కరించేందుకు, భారత ప్రభుత్వం రైతులు చేస్తున్న ప్రయత్నాలను గుర్తించాలని పేర్కొంది.

“Before rushing to comment on such matter, we would urge that the facts be ascertained, and a proper understanding of the issues at hand be undertaken. The temptation of sensational social media hashtags and comments, especially when resorted to by celebrities and others, is neither accurate nor responsible,” అని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటనలో పేర్కొంది.

ఇపుడు రైతులకు తాజాగా మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా కూడా రైతులకు మద్దతు ప్రకటించింది. దీనిని బిజెపి మద్దుతుదారులు సోషల్  మీడియాలో ఎలా స్వీకరిస్తారో చూడాలి. రైతులకు మద్దతు తెలిపిన ముగ్గురు ఒక విధంగా రెబెల్సే.   ఇవిగో ఈ వారి మద్దతు ట్వీట్లు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *