భారతదేశం మీద కరోనా వైరస్ బరువు ఎంతో తెలుసా?

కరోనా కేసులకు సంబంధించి ప్రపంచదేశాలతో పోలిస్తే   భారతదేశం చాలా ముందుంది.ప్రపంచదేశాలన్నీ కరోనాభారంతో క్రుంగిపోతున్నాయి. భారత్ మాత్రం కఠిన ఆంక్షలు విధించి మంచిఫలితాలుసాధించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం ప్రతి లక్ష జనాభాకు ఉన్న కరోనా కేసుల   భారతదేశం ఆగ్రరాజ్యాలను అధిగమించింది.  భారీగా జనాభా ఉన్నదేశాలలో భారత్ పరిస్థితి భిన్నంగా, చాలా చాాలా మెరుగ్గా ఉండటం ప్రపంచాన్ని అశ్చర్యపరుస్తున్నది.
వివిధ దేశాల కరోనా భారం ఇలా ఉంది
భారతేదేశంలో ప్రతిలక్ష జనాాభాకు 7.1 కరోనా కేసులున్నాయి. ఇది   అగ్రరాజ్యాలు వూహించలేనంత తక్కువ.  అంతర్జాతీయంగా ఇదే  ప్రతిలక్ష జనాభాకు  60కేసులున్నాయి. అమెరికాలో ప్రతిలక్ష జనాభాకు 431 కేసులున్నాయి. దేశాధ్యక్షుడు ట్రంప్ కు ఇందుకే  కంపరం పుడుతూ ఉన్నట్లుంది. ఇక  రష్యాలో 195 కేసులున్నాయి.
అదే ఇంగ్లండులో ప్రతిలక్ష జనాభాకు 316 కేసులున్నాయి. స్పెయిన్ లో 494 కేసులున్నాయి. ఇటలీలో 372 కేసులుంటే, బ్రెజిల్ లో 104 కేసులున్నాయి. జర్మనీలో 210 కేసులున్నాయి. ఇక టర్కీ విషయానికొస్తే ప్రతిలక్షజనాభాకు అక్కడ 180 కేసులున్నాయ్. ఫ్రాన్స్ లో 209 కేసులు, ఇరాన్ 145 కేసులున్నాయి.
ఇక రోజు కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి విడుదలయిన సమాచారం ప్రకారం, దేశంలో కరోన బాధితుల సంఖ్య 1,01, 139 చేరినట్లు
 ఇందులో 58, 802 మందికి కొనసాగుతున్న చికిత్స కొనసాగుతున్నది
కరోన నుండి ఇప్పటి వరకు  39,173మంది బాధితులు కోలుకున్నారు.
కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 3,163 మంది మృతి చెందారు.
గడచిన 24 గంటల్లో 4, 970పాజిటివ్ కేసులు నమోదు కాగా 134మంది మృతిచెందారు.
నిన్న ఒక్కరోజే కోలుకున్న 2, 350మంది బాధితులున్నారు.
భారతదేశంలో రికవరీ (కోలుకుంటున్నవారి సంఖ్య) రేటు కూడా చాలా ఎక్కువగా  38.39 శాతం దాకా ఉంది.
మహారాష్ట్ర నెంబర్ 1
 35,058 కేసులతో  1,249 మరణాలతో దేశంలో తీవ్రంగా కరోనా బారిన పడి రాష్ట్రం మహారాష్ట్ర కాగా
 11,760 కేసులతో తమిళనాడు రెండో   స్థానంలో ఉంది. పోతే, గుజరాత్ మూడో స్థానంలో ఉంది.  అక్కడ ఈ రోజు వరకు నమోదయిన కేసులు 11,745.