తెలంగాణకు 210 టోసిలిజుమాబ్ ఇంజక్షన్లు కేటాయించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మొదటి విడతగా 210 టోసిలిజుమాబ్ (Tocilizumab) ఇంజెక్షన్లను కేటాయించింది. వాటిలో 80 ఇంజెక్షన్ల వరకు రాబోయే 10 రోజుల్లో రాష్ట్రానికి  చెందిన పేషంట్లకు అందుబాటులోకి రానున్నాయి.

ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రకటించింది.

ఈ ప్రకటన వివరాలు:

*రోష్ (Roche) కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ఈ ఇంజెక్షన్లను మనం దిగుమతి చేసుకుంటున్నాము ప్రత్యేక పరిస్థితుల్లో వున్న కోవిడ్ -19 పేషంట్లకు ఈ ఇంజెక్షన్ ను వైద్యులు సిఫారసు చేస్తారు. మన దేశంలో ఈ డ్రగ్ నిల్వలు కొన్ని వారాల క్రితమే అయి పోయినాయి. మన దేశంలో సిప్లా కంపెనీ ఈ డ్రగ్ ను కొంత పరిమాణంలో దిగుమతి చేసుకొని మార్కెటింగ్ , పంపిణీ చేస్తున్నది.

*పరిమితంగా అందుబాటులోకి రానున్న టోసిలిజుమాబ్ (Tocilizumab) ఇంజెక్షన్లను Judicious గా వినియోగించుటకు ప్రభుత్వ , ప్రైవేట్ హాస్పిటల్స్ కు సిపారసు చేయుటకై రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారులు 1) డైరెక్టర్, నిమ్స్, 2) డైరెక్టర్, వైద్య విద్య మరియు 3) డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ లు సభ్యులుగా ఒక కమిటీ ని ఏర్పాటు చేసింది.

*టోసిలిజుమాబ్ (Tocilizumab) ఇంజెక్షన్ల కై తమ హాస్పిటల్ లో వున్న Specific Patients ఆరోగ్యస్థితి ని పేర్కొంటు ముగ్గురు Specialists ల Team ఇచ్చిన రికమండేషన్స్ జతపరిచి, నిర్ణిత ప్రొఫార్మాలో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలి. ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ ఈ క్రింద పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని, సంతృప్తి చెందినట్లయితే టోసిలిజుమాబ్ (Tocilizumab) ఇంజెక్షన్లు కేటాయిస్తుంది.

• యాక్టివ్ బ్యాక్టీరియా / ఫంగల్ / ట్యూబర్ క్యూలర్ ఇన్ ఫెక్షన్ వుండని పేషంట్లు.

• స్టెరాయిడ్స్ ఉపయోగించినప్పటికి ఆరోగ్యం మెరుగుపడని పేషంట్లు.

• గణనీయంగా పెరిగిన తాపజనక గుర్తులు వున్న పేషంట్లు

• వ్యాధి తీవ్రత ఎక్కువగా వుండి 24-48 గంటలలో ఐ.సి.యు లో అడ్మిట్ అవదగిన పేషంట్లు.

*ముగ్గురు సభ్యుల కమిటీ రికమండేషన్స్ మేరకు సిప్లా కంపెనీ టోసిలిజుమాబ్ (Tocilizumab) ఇంజెక్షన్ ను అందజేస్తుంది.
*టోసిలిజుమాబ్ (Tocilizumab) ఇంజెక్షన్లకై email address : dme@telangana.gov.in కు దరఖాస్తులు పంపాలి.

*టోసిలిజుమాబ్ (Tocilizumab) ఇంజెక్షన్ దరఖాస్తులో పేషంట్ / హాస్పిటల్ వివరాలు, సంబంధిత హాస్పటల్ కు చెందిన ముగ్గురు స్పెషలిస్టుల రికమెండేషన్ తదితర అంశాలతో కూడిన నిర్ణీత ప్రొఫార్మాను నింపి, ఆన్ లైన్ లో పంపాలి.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/top-stories/breaking/telangana-appoints-committee-to-supply-tocilizimag-drug/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *