మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు,సెక్షన్ లు ఇవే…

ఇటీవల సర్వీస్ కు రాజీనామా చేసిన   మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై  కరీంనగర్ పోలీసులు కేసునమోదు చేశారు.

హిందువుల మనోభావాలు గాయపడేలా ఆయన ప్రవర్తించారని చేసిన ఫిర్యాదుపై   కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేశారు

హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఒక న్యాయవాది ఆ మధ్య  కోర్టులో పిటిషన్ వేశారు. ఈపిటిషన్ ను విచారించిన తర్వాత  ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ కోర్టు పోలీసులను ఆదేశించింది.

క్రైమ్ నెం: 144/2021, సెక్షన్లు153-A, 295-A, 298 r/w 34 IPC క్రింద  కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రవీణ్ కుమార్ మీద ఆరోపణ

మార్చ్ 2021 లో పెద్దపల్లి జిల్లా జులపెల్లి మండలం వడుకపూర్ (ధూళికట్ట) గ్రామంలో స్వేరోస్ భీమ్ దీక్ష కార్యక్రమంలో జరిగింది. అందులో ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ  సందర్భంగా స్వేరో సభ్యులతో కలిసి స్వేరోస్ సభ్యుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు న్యాతరి శంకర్ బాబు చేయించిన ప్రతిజ్ఞలో హిందు దేవుళ్లయిన రాముని మీద, కృష్ణుని మీద నమ్మకం లేదని, వాళ్ళను పూజించనని, అలాగే గౌరీ మీద, గణపతి మీద ఇతర హిందు దేవతల ఎవరి మీద నమ్మకం లేదని, వాళ్ళను పూజించనని, అలాగే శ్రాద్ధా కర్మలు పాటించనని, పిండదానాలు చేయబోమని, హిందు విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసి స్వేరోస్ సభ్యులందరు ఎడమ చేతిని చాచి ప్రతిజ్ఞ చేస్తుంటే వారితో పాటు ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ కూడా ఎడమ చేతి చాచి ప్రతిజ్ఞ చేయించారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని పిటిషనర్ న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. తాను చేసి ఫిర్యాదుల మీద పోలీసులుచర్య తీసుకోనందునే తాను కోర్టును ఆశ్రయించానని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి

*హాట్సాఫ్ ప్రవీణ్ కుమార్, టి-రెసిడెన్షియల్ స్కూళ్ల మీద హార్వర్డ్ యూనివర్శిటీ రీసెర్చ్….

*ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ IPS ఉద్యోగ జీవితం ఒక ప్రయోగశాల…

*ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై ‘హిందూత్వ’ కేసు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *