సీడ్ క్యాపిటల్ అమరావతిలోనే ఉండితీరాలి : బిజెపి తీర్మానం

ఆంధ్రప్రదేశ్  రాజధాని సీడ్ క్యాపిటల్ అమరావతి లోనే వుండాలని విజయవాడలో జరిగిన భారతీయ జనతా పార్టీ కోర్ కమిటి సమావేశం తీర్మానించింది.
రాజధానిని తరలించాలన్న రాష్ట్రముఖ్యమంత్రి నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ఈ నెల 15తేది నుండి బిజెపి పోరాట కార్యాచరణ ఉంటుందని అనంతరం విలేకరులతో మాట్లాడుతూ  రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.
రాజధాని అమరావతి అని రాష్ట్ర అసెంబ్లీ లో నిర్ణయం జరిగిందని అప్పడు వైకాపా అంగీకరించిందని చెబుతూ ముఖ్య మంత్రి మారాడు కాబట్టి క్యాపెటల్ మారుస్తానంటే చూస్తూ ఊరుకోమని కన్నా హెచ్చరించారు.
జగన్ రాజకీయ లబ్ది కోసం మూడు రాజధానుల అంశం తెరమీదకు తెచ్చాడని ఆయన ఆరోపించారు.
ఆ రోజు శివరామకృష్ణ న్ కమిటి నివేదికను టిడిపి బుట్టదాఖలు చేసింది, లక్షకోట్లతో రాజధాని అసాధ్యం అని శివరామకృష్ణ కమిటి చెప్పినా ఖాతరు చేయలేదని చెబుతూ టిడిపి,వైసిపి రాజకీయ భూ వ్యాపారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
భారతీయ పరిపాలన వికేంద్రీకరణ కాకుండా, అభివృద్ది వికేంద్రీకరణ కు బిజెపి కట్టుబడి వుందని ఆయన అన్నారు.
’కొత్త రాజధాని నిర్మాణం జరగాలంటే నిధులు కేంద్రమే ఇవ్వాలని జగన్ ఇష్టమొచ్చినట్లు చెయ్యడానికి వీలులేదని కూడా ఆయన చెప్పారు.హైకోర్టు రాయలసీమలో ఉండాలని బిజెపి  ఎపుడో చెప్పిందని, దానిని మ్యానిఫెస్టోలో పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సమావేశంలో బిజెపి ఆంధ్రప్రదేశ్ సహా ఇంచార్జి, సునీల్ దియోదర్ పురందేశ్వరి, సోము వీర్రాజు, తురగా నాగభూషణం,అడపా శివనాగేద్రరావు తదితరులు పాల్గొన్నారు.