అస్సాంలో లాక్ డౌన్ , కామరూప్ లో పూర్తిగా, రాష్ట్రమంతా రాత్రి కర్ఫ్యూ

అస్సాం  లాక్ డౌన్ మళ్లీ బిగుసుకుంటున్నది.   రాష్ట్రం రాత్రి పన్నెండు గంటల కర్ఫ్యూ విధించారు. సాయంత్రం ఏడు నుంచి కర్ఫ్యూ అమలులోకి వస్తుంది. ఒక కామరూప్ జిల్లాలో 14 రోజలు సంపూర్ణ లాక్ డౌన్ అమలుచేస్తారు.
గౌహతి కామరూప్ జిల్లాలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా సంపూర్ణలాక్ డౌన్ అమలులో ఉంటుంది. అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి హేమంత్ బిశ్వ శర్మ ప్రకటించారు. రాష్ట్రంలో కరోనాకేసులు పెరుగుతూండటంతో ఈ చర్యలు తీసుకోక తప్పడం లేదని ఆయన ప్రకటించారు.
గౌహతిలో కమ్యూనిటీ కరోనా ట్రాన్స్ ఫర్ మొదలయింది. అస్సాంకు గేట్ వే లాంటి గౌహతిలో గురువారం నాడు 133 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా అక్కడ జూన్ 15నుంచి 762 కేసులు నమోదయ్యాయి. ఇందులో 677 మంది ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవడం అందోళన కలిగిస్తూ ఉంది.  ఇలాంటి పరిస్థితుల్లోజూన్ 28 నుంచి    పద్నాలుగు రోజుల పూర్తి లాక్ డౌన్ ప్రకటించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మొత్తంగా 6646 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 2601 యాక్టివ్ కేసులున్నాయి.