అనపర్తిలో మైనింగ్ స్కామ్ పై టిడిపి నిజనిర్ధారణ కమిటీ

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన, నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు.
 ఈవిషయాన్ని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు ప్రకటించారు.
మిటీలో సభ్యులు :1. నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే
2. మంతెన రామరాజు, ఎమ్మెల్యే , 3. అంగర రామ్మోహనరావు, ఎమ్మెల్సీ
4. జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే, 5. కె.ఎస్.జవహర్, రాజమండ్రి పార్లమెంటు అధ్యక్షులు.
ఈ కమిటీ బుధవారం (14.10.2020) నాడు ఉదయం 9.00 గంటలకు అనపర్తి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి, క్షేత్రస్థాయిలో గల వాస్తవాలను తెలుసుకుని పార్టీకి నివేదిక ఇస్తుందని కళా వెంకట్రావ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రకటనలోని విశేషాలు:
1. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక, గ్రానైట్, మట్టి, గ్రావెల్ అక్రమ మైనింగ్, అమ్మకాలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఈ దందా మొత్తం అధికార పార్టీలోని కొందరు పెద్దలు దగ్గరుండి మరీ ఈ అక్రమ వ్యాపారాలను చేయిస్తున్నారు.
2.  అధికారంలోకి వచ్చీరాగానే ఉచితంగా అందుతున్న ఇసుకను రద్దు చేసి ఆన్ లైన్ బుకింగ్ అంటూ లోపభూయిస్టమైన వ్యవస్థను తెచ్చారు. దీన్నే అవకాశంగా మలుచుకుని చిత్తూరు నుండి ఇచ్చాపురం వరకు నదులు, చెరువులు, గెడ్డల్లో అనధికారికంగా ఇసుక తవ్వి కోట్లు వెనకేసుకుంటున్నారు.
3. పేదలకు తట్టెడు ఇసుక కావాలన్నా వేలల్లో చెల్లిస్తే గానీ అందే పరిస్థితి లేకుండా చేశారు. ఒకప్పుడు ఉచితంగా అందే ఇసుక నేడు రూ.వేలు చెల్లించినా సరైన ఇసుక అందుతుందన్న గ్యారంటీ లేకుండా పోయింది.
4. సాక్ష్యాత్తు అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు ఇసుక రీచుల కేటాయింపులో గొడవకు దిగారు. మరో అధికార పార్టీ ఎమ్మెల్యే తాను ఇసుక బుక్ చేస్తే మట్టి వచ్చిందని మీడియా సాక్షిగా ఆక్రోసం వెళ్లగక్కారు.
5. మరోవైపు గ్రానైట్ వ్యాపారాలున్న ప్రతిపక్ష పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. రూ.కోట్లలో జరిమానాలు విధించి ఆ వ్యాపారాలన్నింటినీ వైసీపీ నేతలు హస్తగతం చేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో పార్టీ మారితే వెంటనే కేసులు ఎత్తేస్తామని కూడా చెప్పిన ఘటనలు చూశాం.
6. మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా రాష్ట్రం మొత్తాన్ని సమూలంగా దోచేస్తోంది. ఈ విషయాలపై క్షేత్రస్థాయిలో నిజాలను గుర్తించడం, వాటిని ప్రజలకు తెలియజేయడమే ధ్యేయంగా నిజనిర్ధారణ కమిటీ పని చేయనుంది.