అక్టోబర్ 1 నుంచి అలిపిరి మెట్ల మార్గం పునః ప్రారంభం

అక్టోబర్ 1 నుంచి అలిపిరి నడక మార్గంలో భక్తులు అనుమతిస్తూన్నట్లు టీటీడీ ప్రకటించింది. మరమ్మతులు, ఆధునీకరణల కోసం తిరుమలకు వెళ్ళే అలిపిరి మెట్ల దారికి విరామం ప్రకటించారు. జూన్ ఒకటవ తేదీ మంగళవారం నుంచి రెండు నెలల పాటు ఈ దారిని మూసేశారు.

మెట్ల దారిలో రేకులతో కప్పు వేయడానికి, చిన్న చిన్న మరమ్మతులు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణ రోజులలో రోజుకు లక్ష మంది భక్తులు తిరుమలకు వెళుతుంటే, వారిలో ఇరవై వేల మంది ఈ అలిపిరి మెట్ల దారిలోనే నడుచుకుంటూ తిరుమల వెళుతుంటారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు పెద్ద సంఖ్యలో అలిపిరి మెట్ల మార్గంలో  నడుచుకుంటూ కొండ పైకి  వేలాది మెట్లు ఎక్కి తమ మొక్కులు తీర్చుకుంటారు. నిజానికి అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్లడం అనేది గొప్ప అనుభవం. అడవి గుండా వెళ్తున్న అనుభవమేకాదు, తిరుమల చరిత్ర కు సంబంధించిన అనేక చారిత్రక అనవాళ్లు మనకు కనిపిస్తాయి. మార్గమధ్యంలో అక్కడ డక్కడా విశ్రాంతి తీసుకుంటూ, చెంగున దూకే పిల్లలతో వెళ్తున్నప్పటి సరదా మరొక మార్గంలో రాదు. దారిపొడుగున ఎదురయ్యే అనుభవాలను కింది వ్యాసంలో చదవవచ్చు.

భక్తులు కొండపైకి వెళ్ళడానికి చాలా మెట్లు మార్గాలు ఉన్నాయి. ఒకటి అలిపిరి మెట్లు మార్గం. ఇదే భక్తులు బాగా ఇష్ట పడే మార్గం. మరొకటి శ్రీవారి మెట్టు మార్గం అయితే ఎక్కువమంది అలిపిరి మార్గం ద్వారానే కొండ ఎక్కుతుంటారు. కనీసం ఒకసారైనా మెట్లమార్గం పట్టడం చాలా మందికి మొక్కుబడి.

అలిపిరి మార్గం మరమ్మతుల కారణంగా ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గం ద్వారానే భక్తులు కొండపైకి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు మర్సమ్మతులు పూర్తయ్యాయి.

అందువల్ల   అక్టోబర్ 1 నుంచి అలిపిరి నడక మార్గంలో భక్తులు అనుమతిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరొక  మరొక విషయం ప్రకటించింది.

నెల 13 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అగరబత్తీలు భక్తులకు అందు బాటులోకి వస్తాయని చెప్పింది. సప్తగిరి గుర్తుగా ఏడు రకాల అగరబత్తీలు తీసుకొస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

బ్రహ్మోత్సవాల నుంచి శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉంటాయి.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/top-stories/features/tirumala-alipiri-footpath-wonders/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *