టీడీపీ మ‌హానాడులో ఈ మూడు అంశాలే ప్ర‌ధాన ఎజెండా

కార్య‌క‌ర్త‌ల కోలాహ‌లం, నోరు ఊరించే వ‌సందైన‌ వంట‌కాలు, ప‌సుపు తొర‌ణాలతో ఆహ్ల‌ద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగ మ‌హానాడు విజ‌య‌వాడలోని కానురు వీఆర్ సిద్ధార్థ ఇంజ‌నీరింగ్ కాలేజీ మైదానంలో కార్య‌క‌ర్త‌లు,నాయ‌కుల ఆనందం మ‌ధ్య ఘ‌నంగా ప్రారంభ‌మైంది.తెలంగాణ పార్టీ 34వ మ‌హానాడు ఇది. మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ మ‌హానాడులో భ‌విష్క‌త్ పై చ‌ర్చించి కార్య‌క‌ర్త‌ల్లో కొత్తఉత్సాహం నింప‌నుంది తెలుగుద‌శం పార్టీ అధినాయ‌క‌త్వం. ఎన్నిక‌ల‌కు ముందు జ‌రుగుతున్న చివ‌రి మ‌హానాడు కావ‌డం, ఎన్టీయే నుంచి విడిపోయిన త‌ర్వాత జ‌రుగుతున్న తొలి మ‌హానాడు ఇదే కావ‌డంతో దీనికి మ‌రింత ప్రాధాన్య‌త‌ సంత‌రించుకుంది. ఈ మ‌హానాడులో మొత్తం 36 తీర్మానాలు ప్ర‌వేశ‌పెడుతుండ‌గా..వీటిల్లో ఏపీకి సంబంధించిన‌వి 20, తెలంగాణ‌కు స‌బంధించిన‌వి 8 ఉన్నాయి. ఇక ఉమ్మ‌డి తీర్మానాలు కొన్ని ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.

కాగా, ఎన్నిక‌ల‌కు ముందు జ‌రుగుతున్న ఈ మ‌హానాడుపై రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌,బీజేపీ మ‌ద్ద‌తులో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీకి,ఇప్పుడుఆ రెండు పార్టీలు దూర‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో రాబోయే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలోకి దిగుతుండ‌టం టీడీపీకి పెద్ద స‌వాల్ అని చెప్ప‌వ‌చ్చు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో విజ‌యం సాధించ‌డం, తెలంగాణ‌లో కింగ్ మేక‌ర్ గా తయార‌వ్వ‌డం,కేంద్రంలో క్రీయాశీల పాత్ర పోషించ‌డం అనేమూడు అంశాలే ప్ర‌ధాన ఎంజెడాగా ఈ మ‌హానాడులో చ‌ర్చించనున్నారు. ఈ మూడు అంశాలే ప్ర‌ధాన ఎంజెడాగా మ‌హానాడు వేదిక పైనుంచి వ‌చ్చే ఎన్నిక‌ల‌కు స‌మ‌ర‌శంఖం పూరించ‌నుంది టీడీపీ. ఈ మేర‌కు కార్య‌క‌ర్త‌ల‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు దిశానిర్దేశం చేయ‌నున్నారు

టీడీపీ గెలుపు చారిత్ర‌క అస‌స‌రం అనే నినాదాన్ని ఏపీ ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లాల‌ని టీడీపీ నాయ‌క‌త్వం భావించింది. అలాగే గ‌త ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో 15 సీట్ల‌ను కైవ‌సం చేసుకున్న టీడీపీ, క‌ర్ణాట‌క‌లో జేడీఎస్ లాగా ఇక్క‌డ కూడా కింగ్ మేక‌ర్ గా త‌యార‌య్యే దిశ‌గా వ్యూహాల‌ను సిద్దం చేసుకుంటుంది. తెలంగాణ‌లో 119 సీట్లు మాత్ర‌మే ఉండ‌టంతో కింగ్ మేక‌ర్ గా ఎలాగైనా కావాల‌నే దిశ‌గా ప్ర‌య‌త్నాలు ప్రారంభించ‌నుంది తెలుగుదేశం పార్టీ.అలాగే ఏపీలోనే అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా పేరు, యునైటెడ్‌,నేష‌న‌ల్ ఫ్రంట్‌లో చ‌క్రం తిప్పిన అనుభ‌వం గ‌ల టీడీపీ, రానున్న ఎన్నిక‌ల్లో దేశ రాజ‌కీయాల్లో క్రియాశీలంగా వ్య‌వ‌హారించాల‌నే ఆలోచ‌న‌లో ఉంది. అందుకు ఈ మ‌హానాడు వేదిక కానుంద‌ని చెప్పుకోవ‌చ్చు. దేశ రాజ‌కీయాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ పాత్ర‌పై ఈ మ‌హానాడులో చ‌ర్చించి అందుకు అనుగుణంగా తీర్మానాలు చేయ‌నున్నారు.

ఏపీకి బీజేపీ చేసిన అన్యాయం, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై కేంద్రం చూపుతున్న‌ వివ‌క్ష‌తో పాటు టీడీపీ చేప‌ట్టిన అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను మ‌హానాడు వేదిక‌గా ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్నారు. మొత్తానికి ఎన్నిక‌ల‌కు ముందు జ‌రుగుతున్న మ‌హానాడు కావ‌డంతో దీనికి ప్ర‌త్యేక‌త‌ నెల‌కొంది. మ‌రి ఈ మ‌హానాడు వేదిక‌గా తెలుగు ప్ర‌జ‌ల‌కు,రాజ‌కీయ వ‌ర్గాల‌కు టీడీపీ ఎటువంటి సంకేతాలు ఇస్తుంద‌నేది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *