ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ చాలా ఫాస్టుగా ఉంటారని పేరు. ఆయన ఏ విషయం మీద నైనా క్షణాల్లో స్పందిస్తుంటారు. ఒక సారి ఆయనను ట్విట్టర్ ఫాలోఅయ్యే వాళ్లు దీన్ని బాగా గమనిస్తుంటారు. ఆయన మహాబలిపురం బీచ్ లో చెత్త ఎత్తిన వీడియో , ఆయన చెత్త ఎత్తిన తర్వాత ఎన్ని నిమిషాల్లో వైరలయ్యిందో తెలిస్తే… ఆయన ట్విట్టర్ స్పందనలు సూపర్ ఫాస్టుగా వెలువడుతుంటాయో అర్థమవుతుంది.
అయితే, ఒక భారతీయుడికి, ఇపుడాయన అమెరికా పౌరుడే కావచ్చు గాక, ప్రతష్టాత్మకమయిన నోబెల్ బహుమతి వచ్చినపు స్పందించేందుకు ప్రధానికి నాలుగు గంటల సమయం పట్టింది. ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశమయింది.ప్రధాని ఎందుకు ఇంత జాప్యం చేశారు?
సాధారణంగా రాజకీయనాయకులు ఇలాంటి శుభ సందర్భాలలో స్పందించేందుకు పోటీ పడుతుంటారు. దీనికి ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లు అతీతులు కాదు.
ఇలాంటపుడు నోబెల్ కమిటీ ఆర్థిక శాస్త్ర కమిటీ అభిజిత్ పేరు ప్రకటించిన నాలుగు గంటల తర్వాత అంటే నిన్నరాత్రి ఏడుదాటిన తర్వాత ప్రధాని ట్వీట్వ్ వెలువడింది. ఎందుకింత జాప్యం అనేదే అందరి ప్రశ్న.
Congratulations to Abhijit Banerjee on being conferred the 2019 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel. He has made notable contributions in the field of poverty alleviation.
— Narendra Modi (@narendramodi) October 14, 2019
ప్రధాని ట్వీట్ తర్వాతే, ఆయన క్లియరెన్స్ ఇచ్చారా అన్నట్లుగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్లు వెలువడ్డాయి. అంతవరకు అభిజిత్ ను అభినందించేందుకు కేంద్ర ప్రభుత్వంలో ఎవరూ సాహసించలేదు.
Congratulations to Abhijit Banerjee, Esther Duflo and Michael Kremer on winning “the Nobel prize” in economic Science “for their experimental approach to alleviating global poverty”. Their research has helped economists better understand how to fight poverty in India & the world
— President of India (@rashtrapatibhvn) October 14, 2019
Congratulations #AbhijitBanerjee on being awarded the 2019 Nobel Prize for your contribution for easing poverty. #JNU Also wishing Esther Duflo and Michael Kremer. #NobelPrize2019
— Nirmala Sitharaman (@nsitharaman) October 14, 2019
అప్పటికే ప్రధాని మోదీచేస్తున్న జాప్యం సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశమయింది.
కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వ ధోరణులతో బెనర్జీ ఏకీభవించకపోవడమే దీనికి కారణమని చాలా మంది అంటున్నారు.
ఎందుకంటే, 2016లో కన్నయ్య కుమార్ వంటి జెఎన్ యు నేతల మీద రాజద్రోహ నేరం మోపినపుడు అభిజిత్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీని మీద అప్పటి హిందూస్తాన్ టైమ్స్ లో ఒక వ్యాసం కూడా రాశారు.
అందులో ఆయన చాలా స్పష్టంగా విశ్వవిద్యాలయాలు ఎలా ఉండాలో, క్యాంపస్ విషయంలో ప్రభుత్వాల జోక్యం తగదని చాలా స్పష్టంగా రాశారు. తనను వ్యతిరేకించే వారందరని సతాయించే దోరణినికూడా అభిజిత్ వ్యతిరేకించారు.
Universities provide a space to question whatever we are doing in the name of things we say we believe in or might believe in అని అభిజిత్ రాశారు. అందుకే నోబెల్ బహుమతి వచ్చిన భారతీయుడిని ప్రధాని అభినందించేందుకు సంశయించారని అనుకుంటున్నారు.