హైదరాబాద్ ప్రగతి భవన్ కు కుంచించుకుపోయింది…. రావుల

ఒకపుడు అంతర్జాతీయ నగరంగా ఒక వెలుగు వెలిగిన హైదరాబాద్ ఇపుడు ఒక చిన్న ప్రగతి భవన్ స్థాయికి కుంచించుకుపోయిందని రావుల చంద్రశేఖర్ రెడ్డి టిటిడిపి పాలిటి బ్యూరో సభ్యులు వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ స్థాయిలో ఉన్న హైదరాబాద్ నగరం ఇప్పుడు వెల వెల పోతున్సినదని ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
 ప్రతిపక్షాలఎమ్మెల్యేలను, లీడర్లను  అధికార  పార్టీలో కలువుకునే ఈవెంట్స్ తప్ప వేరే  సాంస్కృతిక , స్పోర్ట్స్  ఈవెంట్స్ లేకుండా పోయాయని ఆయన అన్నారు.
‘ ప్రపంచ స్థాయి క్రీడా ప్రాంతంగా చంద్రబాబు హయాంలో ఉండేది.* ఇండియాకు అంతర్జాతీయ స్థాయి ఏ ఈవెంట్ వచ్చినా హైదరాబాద్ కు మొదటి ప్రాధాన్యత ఇచ్చే వారు. కానీ ఇవ్వాళ ప్రపంచం ప్రగతి భవన్ కి మాత్రమే పరిమితం అయింది. ఎవరూ ఇటు వైపు చూడటం లేదు,’ అని ఆయన అన్నారు.
అంతర్జాతీయ చాలనచిత్రోత్సవం ఈ ఏడాది జరపకపోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ చిత్రోత్సవం వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం తొక్కేసిందని చెబుతూ  ప్రపంచ వ్యాప్తంగా 14 వందల ఎంట్రీలు…170 ఎంట్రీలు కేవలం పిల్లలు డైరెక్ట్ చేసినవి వచ్చేవి.  చంద్రబాబు జయబచ్చన్ ని హైదరాబాద్ కు రప్పించారు. ఈ వైభవాన్ని టిఆర్ ఎస్ ప్రభుత్వం ధ్వంసం చేసిందని ఆయన అన్నారు.
‘టీఆరెస్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్ లో అంతర్జాతీయ ఈవెంట్ ఒక్కటి జరగలేదు. రేపటి భవిభారత్ పౌరులకు టీఆరెస్ ప్రభుత్వం ఇచ్చే మెసేజ్ ఏంటి?  నవంబర్ 14న బాలల దినోత్సవం రోజున పిల్లలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? అంతర్జాతీయ ప్రతినిధులు లేక హైదరాబాద్ హోటల్స్ అన్ని వెలవెల బోతున్నాయి.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
* హైకోర్టు చెప్పినా ప్రభుత్వం నుంచి ఆర్టీసీ పై ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరం.
* ప్రభుత్వం ఇప్పటికైనా స్పంధించాలి….కమిటీకి ఒకే చెప్పాలి.
*జేఏసీ చేసే సమ్మె చరిత్రలో నిలిచిపోతుంది.
* ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యవస్థల పై నమ్మకం లేకపోవడం దురదృష్టకరం.
* ఆర్టీసీ సమ్మెకు తెలంగాణ సమాజం అండగా ఉంది.