మే31న సిద్దేశ్వరం అలుగు శంఖుస్థాపన నాలుగో వార్షికోత్సవం

(రాయలసీమ సాగునీటి సాధన సమితి కరపత్రం)
రాయలసీమ నీటి హక్కుల పోరాటానికి స్పూర్తినిచ్చిన సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన నాలుగవ వార్షికోత్సవం మే 31, 2020 న గ్రామ గ్రామన జరుపుకుందాం. రాయలసీమ తాగు, సాగునీటి హక్కుల సాధన కోసం పాలకులపై ఒత్తిడి పెంచుదాం, ప్రతి పక్ష రాజకీయ పార్టీల నిర్మాణాత్మక కార్యాచరణకై ఒత్తిడితెద్దాం.
మే 31, 2020 న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నాలుగవ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుందాం‌. ఈ వేడుకల్లో రాయలసీమ నీటి అవసరాలు, వాటి పరిష్కారానికి కావలసిన విధానాలు, నిర్మాణాలు, సాగునీటి నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించి , తీర్మానాలను ప్రభుత్వానికి, ప్రతి పక్ష పార్టీ మరియు ఇతర రాజకీయ పార్టీలకు పంపవలసిందిగా విజ్ఞప్తి.
ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చాల్సిన భాద్యత రాజకీయ పార్టీలది. ఆ బాధ్యతను గుర్తు చేస్తూ, రాయలసీమకు నీటి బిక్ష కాదు, చట్టబద్ధ నీటి హక్కులకై పోరాట స్పూర్తినిచ్చిన సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన నాలుగవ వార్షికోత్సవం ఊరు ఊరున ఘనంగా జరుపుకుందాం.
గమనిక : కరోనా మహమ్మారి నేపథ్యంలో మన వేడుక మాస్క్ లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించుకుందాం.
రాయలసీమ సాగునీటి సాధన సమితి
రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక సభ్య సంస్థలు