ఆశ్చర్యం, వియత్నాం తవ్వకాల్లో బయటపడ్డ శివలింగం

వియత్నాంలో జరుగుతున్న పురాతత్వ తవ్వకాల్లో తొమ్మిదో శతాబ్దం నాటి శివ లింగ బయటపడింది. ఆదేశంలోని చామ్ ఆలయ సముదాయాన్నిపునరుద్ధరించే పనిలో ఉన్నభారతపురాతత్వ విభాగం (ASI:Archaeological Survey of India) ఈ తవ్వకాలు చేపట్టారు. హిందూ విశ్వాసాలకు చెందిన ఈ శివలింగ్ కనిపించడంతో వియత్నాంతో భారత్ కు సాంస్కృతి అనుబంధం వెల్లడయిందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జైశంకర్ ట్వీట్ చేశారు. ఒకేరాతిలో చెక్కిన శివలింగం ఇది. వియత్నాం క్వాంగ్ నామ్ ప్రాంతంలోని మై సన్ (My Son) లోని చామ్ టెంపుల్ కాంప్లక్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ నిర్మాణం. ఈ ఆలయాన్ని నాటి రాజు ఇందవర్మన్ 2 నిర్మించారు.ఇదే ప్రాంతంలో కనిపించే డాంగ్ డువాంగ్ బౌద్దారామాన్ని ఏర్పాటుచేసింది కూడా ఆయనే.మై సన్ వద్ద నలుగురు ఎఎస్ ఐ నిపుణులు తవ్వకాలు జరుపుతున్నారు. ఇంతకు ముందు ఇక్కడే మరొక ఆరు శివలింగాలు కూడా దొరికాయి. అయితే, ఇపుడు తాజాగా దొరికిన శివలింగం చాలా గొప్పగా చెక్కనదని అధికారులు చెబుతున్నారు.