కర్నూలులో కరోనాను జయించిన 80 సం.వృద్ధుడు : కలెక్టర్ వీరపాండియన్

కర్నూలు జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టిందని, ఇప్పటివరకు జిల్లాలో 218 మంది చికిత్స తీసుకుని కరోనా నుంచి బయటపడ్డారని  జిల్లా కలెక్టర్ వీరపాండియన్  ప్రకటించారు. జిల్లాలో కరోనాను జయంచిన వారిలో ఏడాదిన్నర బాలిక, 80 సం.ల  వృద్ధుడు ఉన్నారని ఆయన తెలిపారు.
కలెక్టర్ వీరపాండ్యన్  ప్రకటన విశేషాలు: 
కర్నూలు జిల్లాలో కరోనాను జయించిన 27 మందిని ఈ సాయంత్రం డిశ్చార్జ్ చేశాము. వీరిలో నంద్యాల సమీపంలో ఉన్న శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆస్పత్రి నుండి 8 సంవత్సరాల బాలిక (నంద్యాల వాసి), కర్నూలు సమీపంలో ఉన్న విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రి నుండి 12 మందిని, కర్నూలు చైతన్య ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్ నుండి 14 మందిని ఈ సాయంత్రం డిశ్చార్చ్ చేసాము.
ఈ సాయంత్రం డిశ్చార్చ్ అయిన 27 మందిలో విశ్వభారతి జిల్లా కోవిడ్ ఆస్పత్రి నుండి అతి చిన్న వయసు ఉన్న ఏడాదిన్నర బాలిక, 80 సం.ల వయసుతో పాటు బిపి, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వృద్ధుడు ఉన్నారు ..శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆస్పత్రి నుండి 8 ఏళ్ల బాలిక కూడా కరోనాను జయించి ఆరోగ్యంగా కోలుకుని డిశ్చార్జ్ యఅయింది. ఇది  కరోనా మహమ్మారిని జయించవచ్చనే మనోధైర్యాన్ని, స్ఫూర్తిని జిల్లా వాసులందరికీ కలిగిస్తుంది.
ఈ రోజు డిశ్చార్జ్ ల మరో విశేషం- జిల్లాలో మొట్ట మొదటిసారిగా కర్నూలు చైతన్య ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్ నుండి 14 మంది కరోనా విజేతలు (Asymptomatic Patients) ఆరోగ్యంగా డిశ్చార్చ్ కావడం.
ఈ రోజు డిశ్చార్చ్ అయిన 27 మంది లో 13 మంది పురుషులు, 12 మంది మహిళలు, ఇద్దరు బాలికలు. వీరిలో ఒకటిన్నర ఏడాది నుండి 10 ఏళ్ల లోపు చిన్న వయసు ఉన్న ఇద్దరు చిన్నారి బాలికలు, 18 నుండి 50 ఏళ్ల మధ్య వయసుగల వారు 20 మంది, 50 నుండి 79 ఏళ్ల మధ్య వయసులోపు వారు 4 గురు, 80 ఏళ్ల వృద్ధులు ఒకరు కరోనాను జయించడం జిల్లా వాసులకు పెద్ద రిలీఫ్.
ఈ సాయంత్రం డిశ్చార్చ్ అయిన 27 మంది కరోనా విజేతల్లో కర్నూలు నగర వాసులు 25 మంది, పాణ్యం – ఒక్కరు, నంద్యాల-ఒక్కరు ఉన్నారు.
ఈ సాయంత్రం కర్నూలు విశ్వభారతి, శాంతిరామ్ కోవిడ్ ఆస్పత్రుల నుండి, కర్నూలు చైతన్య ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్ నుండి డిశ్చార్చ్ ఆయిన 27 మందికి ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల నగదును అందించాం.వారిని ప్రత్యేక అంబులెన్స్ వాహనాల్లో వారి వారి ఇళ్లకు పంపేందుకు స్పెషల్ ఆఫీసర్స్, అధికారులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది వీడ్కోలు చెప్పారు.