వైసిపిఎమ్మెల్యే మీద కేసుపెట్టారా, జనసేన ఎమ్మెల్యే అంటే చులకనా?

పోలీస్ స్టేషన్ మీద ‘దాడి’ చేయడానికి సంబంధించిన ఒక కేసులో  జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజోలు పోలీసుస్టేషన్ లో లొంగిపోాయారు.
తనను అరెస్టు చేస్తారనే వార్త బయటికి పొక్కడంతో ఆయనే స్వచ్చందంగా పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఈ గొడవకంతటికి కారణం పేకాట పంచాయతీ. పేకాడుతున్న కొంతమందిని మలికిపురం పోలీసులు అరెస్టు చేశారు.వాారిని విడిపించుకునేందుకు ఎమ్మెల్యే స్టేషన్ కు వెళ్లారు.అక్కడ గొడవ జరగింది. ఉద్రికత్త ఏర్పడింది. ఈలోపు ఎమ్మెల్యే నాయకత్వంలో పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగిందంటూ పోలీసులు కేసుపెట్టారు. ఇదీ బ్యాక్ గ్రౌండ్.
అయితే దీని మీ జనసేన అధ్యక్షుడుపవన్ కల్యాణ్ మండిపడుతున్నారు.  ఒక సీనియర్ జర్నలిస్టును వైసిపి ఎమ్మెల్యే కొట్టి చంపుతానని బెదిరిస్తే కేసులేదు, జనసేన ఎమ్మెల్య సాయం చేసేందుకు స్టేషన్ వెళితే కేసులా అని ఆయన ప్రశ్నించారు.
 రాపాక విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే నేనే వస్తానని హెచ్చరించారు.  రాపాకపై కేసులు పెట్టడం సరికాదని, ప్రజలు కోరిన మీదటే రాపాక స్టేషన్ కు వెళ్లారంటూ ఆయన చెప్పారు.
ఇది కూడా చదవండి
ఆగస్టు 15, 1947 అర్థరాత్రి స్వాతంత్య్రం ఎందుకు? పగలు ముహూర్తం బాలేదా?
జనసేన కార్యకర్తలు, నేతలు సంయమనం పాటించాలంటూ సూచించారు. ప్రజలు కోరిన మీదటే వారికి మద్దతుగా రాపాక స్టేషన్ కు వెళ్లారని, అంతమాత్రానికే కేసులు పెట్టడం అన్యాయని అన్నారు.
నెల్లూరులో ఓ జర్నలిస్టుపై వైసీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఇప్పుడు మలికిపురం ఘటనలో గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చారని విమర్శించారు.
ఈ ఘటన శాంతిభద్రతల సమస్యగా మారకుండా అధికారులు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జనసేన కార్యకర్తలు, నేతలు సంయమనంతో వ్యవహరించాలని పవన్ సూచించారు.
ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే మాత్రం తాను రంగంలోకి దిగుతానని జనసేనాని స్పష్టం చేశారు. మలికిపురం ఘటనపై ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో సమీక్షిస్తున్నానని వివరించారు.