Home English సక్సెస్ స్టోరీ: బయోమెడికల్ వేస్టుకు విరుగుడు కనిపెట్టిన బెంగళూరు స్టార్టప్

సక్సెస్ స్టోరీ: బయోమెడికల్ వేస్టుకు విరుగుడు కనిపెట్టిన బెంగళూరు స్టార్టప్

216
0
SHARE
(యనమల నాగిరెడ్డి)

బెంగుళూరు స్టార్టప్ ‘ఇన్నొవేషన్స్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ ’ రసాయన కాలుష్యానికి గురైన నీళ్లను శుద్ధి చేసేందుకు ఒక యూనివర్శల్ డీ టాక్సిఫయిర్ ను కొనుగొనే పనిలో ఉంది.  Innovations for Next Generation ను ప్రారంభించింది ఒక యువ శాస్త్రవేత్త.పేరు పద్మనాభ బివి.  ఇందులో మొదటి విజయం సాధించారు. మాలెక్యులార్ బయాలజీ ల్యాబొరేటరీలలో  డిఎన్ ఎ ను పరిశీలించేందుకు ఇధిడియం బ్రోమైడ్  (EtBr)ను వాడుతూ ఉంటారు. అయితే, సులభమే  అయినా  దీనిని శుద్ధిచేసి వదలడం అరుదు. అందువల్ల ఇది నదుల్లోకి పారి నీటిని ప్రమాదకరంగా కలుషితం చేస్తూ ఉంటుంది. చౌకగా ఈ నీళ్లను శుద్ధి చేసే  డీటాక్సిఫయర్ (EtBr detoxifier)ను ఆయన కనిపెట్టారు. అది సూపర్ హిట్టయింది. ఇపుడు బయో మెడిక ల్ ల్యాబ్స్ నుంచి పత్రుల నుంచే వెలువడే రసాయనాలున్న నీటిని శుద్ధి చేసేందుకు యూనివర్శల్ డిటాక్సిఫయర్ తయారుచేస్తున్నారు. దానిమీద ట్రెండింగ్ తెలుగు న్యూస్ ప్రత్యేక  కథనం.

మానవజీవితాన్ని సుఖ, సంతోషాలతో మరింత సౌకర్యవంతం చేసేందుకై వేలాది మంది శాస్త్రవేత్తలు నిద్రాహారాలు మాని నిరంతరం కృషి చేస్తూ నూతన అంశాలను ఆవిష్కరిస్తున్నారు. అయితే మనుషుల, సమాజాల నిర్లక్ష్య, స్వార్థపూరిత విధానాల వల్ల అనేక వైజ్ఞానిక ఆవిష్కరణలు, అత్యధునాతన సదుపాయాలూ మానవాళి జీవితాన్ని మరింత దుర్భరం చేస్తూ నానాటికీ విధ్వంసం వైపు నడిపిస్తున్నాయి 
ప్రజల తాగునీరు, వ్యవసాయం అవసరాల కోసం శాస్త్రవేత్తలు కనుగొన్న బోరు బావుల తవ్వకం యంత్రాలు, నిత్య జీవితంలో విడదీయలేని భాగంగా మారిన ప్లాస్టిక్ లు సమాజాన్ని ప్రస్తుతం ఎంతగా ఇబ్బంది పెడుతున్నాయో అందరికీ తెలుసు.
ఆరోగ్య పరిరక్షణ కోసం చేసిన, చేస్తున్న అనేక ప్రయోగాలు, కనుగొంటున్నఅంశాలు ఎవరికీ తెలియకుండానే మనుషులతో పాటు, పర్యావరణాన్ని, ప్రకృతిని ఎంతగా ధ్వంసం చేస్తున్నాయో అంచనా వేయలేని  పరిస్థితి నేడు నెలకొన్నది. ఈ నేపథ్యంలో ప్రకృతిని పరిరక్షిస్తూ, కాలుష్య భూతం కోరల నుంచి మానవాళి మనుగడను కాపాడటానికి నిరంతరం కృషి చేస్తూ విజయపథంలో వడి వడిగా అడుగులేస్తున్న ఓ శాస్త్రవేత్త స్ఫూర్తివంతమైన విజయగాథ ఇది . 
కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా భద్రావతిలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన బి వి పద్మనాభ జీవితం వడ్డించిన విస్తరేం కాదు. చాలా కష్టపడే చదువు సాగించాడు. తన చదువు పూర్తి అయిన వెంటనే సమాజానికి తన వంతు సేవ చేయాలన్న తపనతో పరిశోధనా రంగాన్ని ఎంచుకున్నారు. బిఎస్సి ఫారెస్ట్రీ, ప్లాంట్ ఫిజియాలజీ లో ఎమ్మెస్సీ 2001లో పూర్తి చేసి 2002లో పరిశోధనా రంగంలో కృషి సాగించారు.  
అప్పటి నుండి అనేక మిట్ట పల్లాలు చూసిన పద్మనాభ ఇటీవలఇన్నోవేషన్స్ ఫర్ నెక్స్ట్ జెనరేషన్పేరుతొ ఒక సంస్థను ప్రారంభించి, ప్రకృతి పరిరక్షణకు, మానవ ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడే అంశాలపై పరిశోధనలు ప్రారంభించారు. 
ఇది కూడా చదవండి
రాయలసీమలో ప్రాజక్టులన్నీ పెండింగే: కృష్ణా జిల్లా రైతు నేత ఏర్నేని నాగేంద్రనాథ్

 

ప్రస్తుతం  కార్పొరేట్ వైద్యశాల నుండి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న చిన్న, చిన్న పరీక్షా కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వరకు రోగనిర్ధారణ పరీక్షల కోసం రోగుల నుండి సేకరిస్తున్న రక్తము, మూత్రం నమూనాలను, వైద్యపరీక్షలు, చికిత్స, ఆపరేషన్లు, ఆయా సమయాలలో వినియోగించే ‘యూజ్ అండ్ త్రో’ పరికరాలు, ఇతర రోగకారక వ్యర్థాల నిర్మూలన (వాటి లోని రోగకారకాలను నిర్వీర్యం చేయడం, పరిసరాలకు ప్రమాదం లేని  విధంగా విసర్జించడం)కు అనేక నియమ నిబంధనలు ఉన్నప్పటికీ ఆచరణలో ఎక్కువ సంస్థలు ఆ ప్రమాణాలను పాటించడం లేదు.
ఆయావ్యర్థాలను ఊరి బయట పారవేయడం, పరీక్షల అనంతరం మిగిలిన బయో మెడికల్ వ్యర్థాలను మురుగు కాల్వల్లో వేయడం లేదా వారికి అనుకూలమైన విధానాలలో పారవేయడం జరుగుతున్నదని పద్మనాభ వివరించారు.
‘నాసొకోమియల్ ఇన్ఫెక్షన్ (nosocomial infection) అంటే…
ఇక ఆసుపత్రులలోని పరిస్థితుల అంటే అక్కడ వున్న బ్యాక్టీరియా  వల్ల రోగులకు కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. దీనినే  “నాసొకోమియల్ ఇన్ఫెక్షన్అంటారని ఆయన వివరించారు.
ఈ ఇన్ఫెక్షన్ వల్ల రోగులకు చికిత్స పొందిన వ్యాధులు తగ్గినా, ఆయా వైద్యశాలలలో/ పరీక్షా కేంద్రాల్లో ఉన్న పరిస్థితుల వల్ల కొత్త,కొత్త వ్యాధులు వస్తున్నాయని పద్మనాభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 
ఈ ఇన్ఫెక్షన్ కారకాలలో ప్రధానమైన కలుషిత ద్రవరూప బయో మెడికల్ వ్యర్థాల (ఇన్ఫెక్టెడ్ లిక్విడ్ బయో మెడికల్ వేస్ట్)ను సమర్థవంతంగా నిర్ములించడానికి గత రెండు సంవత్సరాలుగా కృషి చేసిఆటోమేటెడ్ లిక్విడ్ బయో మెడికల్ వేస్ట్ శానిటైజర్అనే యంత్రాన్ని ఆయన తయారుచేశారు. ఈ యంత్రం ద్వారా పైన పేర్కొన్న బయోమెడికల్ వేస్ట్ ను అన్ని రకాలుగా శుభ్రం చేసి (రోగకారకాలను నిర్వీర్యం చేసి) మానవాళికి హాని లేకుండా పూర్తిగా నిర్మూలించ వచ్చునని ఆయన ఈ ప్రతినిధికి తెలిపారు. 
 బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ చివరి పరీక్షకు ఎంపిక 
నాస్కోమియల్ ఇన్ఫెక్షన్ ఒక కారణంగా ఉన్న ఇన్ఫెక్టెడ్ లిక్విడ్ బయో మెడికల్ వేస్ట్ ను సమర్థవంతంగా నిర్మూలించడానికి పద్మనాభ తయారు చేసిన యంత్రం నమూనా, భారత ప్రభుత్వం, బిరాక్ (బయోటెక్ ఇండస్ట్రీ రీసెర్చ్అసిస్టెన్స్ కౌన్సిల్) బిల్ అండ్ మిలెండా గేట్ ఫౌండేషన్ లు సంయుక్తంగా ప్రకృతి, మానవ జీవితాల పరిరక్షణకు అవసరమైన పరిశోధనలను గుర్తించి ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన విభాగంలో  ప్రాథమిక ఆమోదముద్ర పొందింది. ఆగస్టు 28న ఢిల్లీలో జరిగే తుది ఎంపిక పరీక్షలకు తన పరిశోధన ఎంపికైందని ఆయన తెలిపారు. ఈ యంత్రం పూర్తి స్థాయిలో సిద్ధమైతే ఇన్ఫెక్టెడ్ లిక్విడ్ బయో మెడికల్ వేస్ట్ ద్వారా వచ్చే నాస్కోమియల్ ఇన్ఫెక్షన్ ను పూర్తిగా నిర్మూలించ వచ్చునని ఆయన వివరించారు.    
ఇపుడున్న నమూనాను మరింత అభివృద్ధి చేయడానికి, అధునాతన సాంకేతిక పరికరాలు అమర్చి వైద్యశాలలు, పరీక్షా కేంద్రాలు సులభంగా వినియోగించే విధంగా మెరుగులు దిద్ద వలసి ఉందని ఆయన తెలిపారు. ఈ యంత్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి సుమారు రెండు సంవత్సరాలు పడుతుందనీ, రూ. 2 కోట్లకు పైగా మూలధనం అవసరం కాగలదని అన్నారు.   
కాలుష్య నివారణ-ప్రకృతి పరిరక్షణే పరమావధి!
శాస్త్రవేత్తగాను, వ్యక్తిగాను పద్మనాభ దృష్టి మొత్తం మానవాళికి పెనుముప్పుగా మారిన కాలుష్య నివారణ, ప్రకృతి వనరుల పరిరక్షణ పైనే కేంద్రీకృతమైంది. మానవాళి ఆరోగ్య పరిరక్షణ కోసం కూడా ఆయన కృషి చేస్తున్నారు.
ప్రస్తుతం అనేక కారణాల వల్ల గాలి, నీరు, భూమి నానాటికీ కలుషితం అవుతున్నాయి. ఆయన అన్ని విభాగాలలో  కాలుష్యాన్నినివారించడానికి అనేకరకాల పరిశోధనలు చేశారు. అలాగే వీటిని కొనసాగిస్తున్నారు కూడా.
 బయో పరిశోధనశాలలలోఇథిడియం బ్రోమైడ్(Ethidium bromide)అనే విష పూరితమైన రసాయనాన్ని వాడుతున్నారు. మానవాళి జన్యుక్రమాన్నికూడా మార్చగల అత్యంత శక్తివంతమైన ఈ ఇరీడియం బ్రోమైడ్ ను పరిశోధనశాలల నుండి నిర్లక్ష్యంగా మురుగు కాల్వలలో పారవేస్తున్నారు. ఈ రసాయనాన్ని వేరు చేయడానికి  “ఇథిడియం బ్రోమైడ్ డిటాక్సిఫయర్ను పద్మనాభ తయారు చేశారు. ఇపుడాయన పరిశ్రమల నుండి, పరిశోధనశాలల నుండి వెలువడుతున్న వ్యర్థాలను ప్రమాదరహితమైన రీతిలో నిర్వీర్యం చేయగల విధానాలపై ఆయన పరిశోధనలు సాగిస్తున్నారు. 
ప్రపంచానికే పెను సవాలుగా మారిన ప్లాస్టిక్ స్థానంలో బయోప్లాస్టిక్ ను తయారు చేయడానికి పద్మనాభ కృషి చేసి విజయం సాధించారు.
ఇందుకు సంబంధించి పేటెంట్ కూడా నమోదు చేశారు. నీటిని శుద్ధి చేయడం కోసం కనుగొన్న మరో మూడు అంశాలపై పేటెంట్లు పొందేందుకు కృషి చేస్తున్నారు. 
వాననీటి సేకరణ కోసం ప్రస్తుతం ఉన్నవిధానాలకు అదనంగా మరింత ఎక్కువగా వాననీటిని ఒడిసి పట్టడానికి పరిశోధనలు చేస్తున్నామని ప్రస్తుతం వంద చదరపు అడుగుల విస్తీర్ణంలో పడే నీటిని సేకరించి నిల్వ చేయడానికి చేసిన పరిశోధన విజయవంతమైందని ఆయన వివరించారు. మరికొంత పరిశీలన తర్వాత ఈఅంశాన్నిప్రజలకు అందుబాటులోఉంచగలమని ఆయన వివరించారు.
ఇప్పటి వరకు ఎస్ ఎఫ్ సి హెచ్ సొల్యూషన్స్ ఫర్ కమ్యూనిటీ హెల్త్), బిగ్ (బయోటెక్నాలజీ ఇగ్నీషన్ గ్రాంట్) కార్యక్రమాల క్రింద తనకు అనేక రకాలుగా సాయం చేసి, ప్రోత్సహించినబిరాక్, ఐకెపి నాలెడ్జిపార్క్సంస్థలకు, శాస్త్రవేత్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.