6 గంటల పాటు సాగిన జగన్ తొలి క్యాబినెట్ మీటింగ్

అమరావతిలో సుమారు ఆరు గంటల పాటు  సీఎం జగన్   అధ్యక్షతన జరిగిన  సుదీర్ఘ క్యాబినెట్ సమాావేశం కొద్ది సేపటి కిందట ముగిసింది.

కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే…

★ సామాజిక పెన్షన్లు రూ.2250కి పెంపు.

★ ఆశా వర్కర్ల జీతాలు 3000 నుంచి 10,000కు పెంపు

★ ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌ చెల్లింపునకు ఆమోదం.

★ సీపీఎస్ రద్దుకు కేబినెట్ ఆమోదం. ఇందుకోసం కమిటీ ఏర్పాటు. న్యాయ, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సీపీఎస్ రద్దు ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయం.

★ జనవరి 26 నుంచి ‘‘అమ్మ ఒడి’’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం.

★ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కేబినెట్ సుముఖత.

★ వైఎస్సార్‌ రైతు భరోసా అమలుపై కేబినెట్‌లో చర్చించారు. అక్టోబర్ 15 నుంచి అమలు చేయాలని నిర్ణయం.

★ గిరిజన సంక్షేమశాఖలోని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు. రూ. 400 నుంచి 4000 వరకు వేతనాల పెంచుతూ నిర్ణయం.

★ టీడీపీ హయాంలో ఉన్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలన్నీ రద్దు. పారదర్శకంగా కొత్త ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ఏర్పాటు.

★ మున్సిపల్, పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రూ.18వేలకు పెంపు.

★ కొత్త ఇసుక విధానం.

★ స్కాం లను వెలికితీస్తే అధికారులతో పాటు మంత్రులను సైతం సన్మానించాలని నిర్ణయించారు.

★ అన్ని నామినెటెడ్ పదవుల రద్దుకు త్వరలో ఆర్డినెన్స్.

★ ప్రతి ఏటా ఆరు లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం.

★ అంగన్ వాడీ, హోంగార్డుల జీతాలు పెంపు.