రోడ్ షో లోనే క్యాబినెట్ ను ప్రకటిస్తున్నజగన్, మూడో మంత్రి ఆళ్ల

అన్ని సర్వేలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు మెజారిటీ వస్తుందని, జగన్ ప్రభుత్వం ఏర్పాటుచేస్తాడని చెబుతూ ఉండటంతో ప్రచారంలోనే పార్టీ అధ్యక్షుడు క్యాబినెట్ ఏర్పాటుచేస్తున్నారు.

ఈ రోజు ఆయన మూడో మంత్రి పేరు ప్రకటించారు. గతంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేరు ప్రకటించారు. ఇపుడాయన మంగళగిరి వైపిసి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పేరు ను ప్రకటించారు.

మంగళగిరిలో ఈ రోజు రోడ్ షో నిర్వహిస్తూ, ‘ఆర్కే లోకల్ హీరో, నా సోదరుడు. గత అయిదేళ్లుగా అలుపెరుగకుండా ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఆయన నా క్యాబినెట్ లో ఉంటాడు. ఆయనకు ఓటేసి గెలిపించండి, మీ ఆస్తులకు, మీకు అండగా ఉంటాడు,’ అని జగన్ ప్రకటించారు.

గత వారం రోజుల్లో ఆయన ఇద్దరికి మంత్రి పదవులు ప్రకటించారు. మొదట ఒంగోలులో క్యాంపెయిన్ చేస్తూ అక్కడి వైసిపిఅభ్యర్థి బాలినేనికి మంత్రి పదవి ప్రకటించారు. అదే విధంగా కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న మాజీ ఐఎఎస్ అధికారి చంద్రమౌళిని కూడా క్యాబినెట్ లోకి తీసుకుంటానన్నారు. ఇపుడు ఆర్ కె కూడా మంత్రి పదవి ప్రకటించారు.

రాజధాని లో భాగమయిన మంగళగిరి చంద్రబాబు హయాంలో అవినీతి రాజధాని అయిందని అన్నారు.చంద్రబాబు అవినీతి మొత్తం మంగళగిరి కేందంగా సాగుతూ వచ్చిందని చెబుతూ ఎపుడూ ప్రజలను అంటిపెట్టకుని ఉండే ఆళ్లకు ఓటేస్తారా, ఒక్కసారి కూడా మంగళగిరిలో కాలుపెట్టని నారాలోకేష్ కు ఓటేస్తారా అని ప్రశ్నించారు.

వైసిపిలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఒక విశిష్టమయిన ఎమ్మెల్యే. చంద్రబాబు మీద ఆయన విసుగు విరామం లేకుండా న్యాయపోరాటం చేస్తున్నారు. కొన్ని కేసేుల్లో సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. సాధారణ రైతు జీవితం గడుపుతూ తన నిజాయితీతో, అంకితభావంతో  అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నారు. అయిదు రుపాయల భోజనం హైదరాబాద్ లో ఎలా అమలుచేస్తున్నారో స్వయంగా రోడ్డు మీద నిలబడుకుని రుచి చూసి వైఎస్ ఆర్ పేరు మీద ఇలాంటి  రాజన్న క్యాంటీన్ మంగళగిరిలో సొంత వ్యవయంతో ప్రారంభించారు.

అందుకే, మంగళగిరిలో సాధారణ పరిస్థితులలో ఆళ్లను గెలవడం కష్టం. ఈ విషయం నారా లోకేష్ గుర్తించినట్లున్నారు. తొలిసారి గా ఆయన భార్య బ్రాహ్మణిని కూడా ప్రచారాని తీసుకువచ్చారు. బ్రాహ్మణి కూడా ఇల్లిళ్లూ తిరిగి ప్రచారం చేస్తున్నారు.

జగన్ కూడా రామకృష్ణారెడ్డిని తన ప్రచార రథం మీది నుంచే ప్రశంసలతో ముంచెత్తారు.

చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ల పాలన ఎంత గొప్పగా ఉందో చూశారుగా. రెండు రోజుల్లో రాబోతున్న ఎన్నికల్లో మీరంతా మీ గుండెల మీద చేతులు వేసి ఆలోచించి వోటేయండి. నా పక్కనే ఆర్కే(ఆళ్లరామకృష్ణారెడ్డి) నిలబడిఉన్నాడు. ఈయన మీ లోకల్‌ హీరో. తన పొలంలో తానే నాట్లు వేసుకుంటాడు. తానే కాడిపట్టి దున్నుతాడు. గట్టు మీదనే భోజనం చేస్తాడు. రాజన్న క్యాంటీన్‌ ద్వారా భోజనం పెడ్తున్నాడు. అందుబాటు ధరల్లో కూరగాయాలు కూడా అమ్మిస్తున్నాడు. రైతుల తరఫున కోర్టుకు కూడా వెళ్తాడు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా చంద్రబాబుకు అమ్ముడుపోలేదు. అని జగన్ ప్రశంసించారు.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/poet-varavararao-wife-asks-cm-kcr-to-prove-his-honesty-in-his-attack-on-modi/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *