Home English భారతీయులు బంగారు కొనడం మానేశారు…మార్కెట్ కుదేల్: కారణాలివే…

భారతీయులు బంగారు కొనడం మానేశారు…మార్కెట్ కుదేల్: కారణాలివే…

552
0
SHARE
భారత దేశంలో బంగారం ధర విపరీతంగా పరుగుపెడుతూ ఉంది.
దీనితో భారతీయులు ప్రాణపదంగా భావించే బంగారం కొనడం మానేశారు. మామూలుగా భారతీయులు ప్రతిచిన్న సందర్బాన్ని బంగారు కొనే సుముహూర్తంగా మార్చుకుంటారు. ఇలాంటి సైకాలజీ రెండే రెండు దేశాల్లో ఉంది. అందులో ఒకటి చైనా, రెండోది భారత్.  దానికి తోడు వ్యాపారస్థులు కూడా దంతేరస్ అనో తగ్గింపు అనో, లేబర్ చార్జెస్ రద్దు అనో భారతీయ మహిళలన్ని బంగారు కొనేందుకు కవ్విస్తూఉంటారు.
అయితే.ఇదంతా మటాష్ అయింది. ఇపుడు భారతదేశంలో ప్రజలు తప్పని సరి అయిన పెళ్లిళ్లకు మాత్రమే బంగారు కొంటున్నారు.దీనితో మార్కెట్ కుదేలయింది.
ఇది కూడా చదవండి 
భారతీయ రుపాయ ధర భారీగా పడిపోయింది
దీనికి ప్రధాన కారణాలకు ఇపుడు బక్కపలచగా మారిన రుపాయి కూడా తోడయింది. రుపాయ బలహీన పడేకొద్ది బంగారు ప్రియమవుతూ ఉంది. దీనితో ఇండియాలో బంగారు మార్కెట్ వెలవెల బోతున్నది.
చైనా తర్వాత భారత దేశమే అత్యధికంగా బంగారు కొనుగోలు చేసిందే.అయితే, ఇపుడు ధరలు పెరగడంతో వ్యాపారం కుంచించుకుపోయింది. మూడేళ్లలో మొదటి సారి బంగారు అమ్మకాలు భారీగా పడిపోయాయని బంగారు వ్యాపారస్థులు గగ్గోలు పెడుతున్నారు. బంగారు వ్యాపారం భవిష్యత్తు ఆందోళనకరంగా ఉంది.
జనవరి-జూన్ మధ్య బంగారు డిమాండ్ పెరిగింది కేవలం 9 శాతమే. రెండేళల్ల మాంద్యం తర్వాత బంగారు వినియోగం పెరుగుతుందని వ్యాపారస్తులు ఆశించారు. ఆ ఆశలు అడుగంటి పోయాయి.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ఇంపోర్టు డ్యూటీ భారీగా పెంచడం, ధరలుపెరగడం,దేశంలో ఆర్థిక ప్రగతి మందగించడం, అనక ప్రాంతాల్లో వరదలరావడంతో బంగారు వ్యాపారం పడిపోయింది.
నిజానికి ఫెస్టివల్ సీజన్ రాబోతున్నది..ఇపుడు వ్యాపారం కళకళ లాడుతూ ఉండాలి.అలా జరగడం లేదు.
అన్నీ తమ మీద ఒకే సారి దాడి చేశాయని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమొస్టిక్ కౌన్సిల్ ఛెయిర్మన్ ఎన్ అనంత పద్మనాభన్ ఎకనమిక్ టైమ్స్ కు చెప్పారు.
ఈ ఏడాది మొత్తంగా కూడా డిమాండ్ 2016 నాటి లాగా ఉండేటట్లు ఉందని ఆయన చెప్పారు. 2016 లో మొత్తం డిమాండ్ 666 టన్నులు మించలేదు.
ప్రజలకు కేవలం పెళ్లిళ్లకు మాత్రమే కొంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది షాకింగ్. సాధారణంగా మనవాళ్లు ప్రతిసందర్భానికి ఏంతో కొంత బంగారు కొనడం ఆనవాయితీ. అలాంటిది ఇపుడు కేవలం తప్పనిసరిఅయిన పెళ్లిళ్లకే బంగారు కొనుగోలు పరిమితం చేసుకున్నారు.
ట్రేడ్ డెఫిసిట్ ను తగ్గించుకునేందుకు మోదీ ప్రభుత్వం జూలైగోల్డ్ దిగుమతి సుంకాన్ని పెంచింది. దీనితో గతవారంలో ఒక్క సారి గోల్డ్ పది గ్రాముల ధర రు.38,666 స్థాయికి తోసేసింది.
బంగారు ధరలు పెరగుతున్నపుడే భారత దేశ ఆర్థిక వ్యవస్థ కూడా తిరోగమనంలో పడిపోయింది. ఆటో సేల్స్ నుంచి దేశం నుంచి సాగే ఎగుమతుల దాకా అన్నీ పడిపోయాయి. దీనికితోడు రుతుపవనాలు కూడా ఆశాజనకంగా లేవు.
బంగారు సేల్స్ పెంచేందుకు ఏదైనా చేయండని వ్యాపారస్థులంతా కోరుతున్నారు. ఏదైనా చేయాలంటే ధరలు ఒక చోట స్థిరపడాలి. ఏవైనా బహుమతులుప్రకటించినా ప్రజలు అంత తొందరగా స్పందించలేని పరిస్థితి వచ్చిందని పద్మనాభన్ అంటున్నారు.
ధరలు భారీగాపెరిగాయి కాబట్టి కొంత ప్రాఫిట్ – టేకింగ్ ( ధరలు బాగున్నపుడు నాలుగు డబ్బులు లబ్దిపొందేందుకు సెక్యూరిటీస్ ని అమ్మేయడం) జరిగినా ధరలు భారీగా తగ్గే అవకాశం లేదని కొందరు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఢిల్లీ మార్కెట్లో గురువారం 99.9 క్యారట్ల స్వచ్ఛమయిన బంగారు 10 గ్రాముల ధర రూ.50 పెరిగి రూ.38,820కి చేరుకుంది. 99.5 క్యారట్ల స్వచ్ఛ బంగారు ధర రు.38,650 పలికింది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1140 పెరిగి రూ.45,040కు చేరుకుంది.