FLASH భారతీయ రుపాయ ఇంకా పతనం

[ajax_load_more]

భారతీయ రుపాయ విలువ ఇంకా పతనమయింది. శుక్రవారం ఉదయం ఎనిమిది నెలలకిందటి స్థాయికి పడిపోయింది.
GMT 0352 సమయానికి రూపాయ డాలర్ మారకం ధర 72.04 వద్ద ట్రేడ్ అవుతూ ఉంది. అంటే ఒక డాలర్ ధర రు.72.04. రుపాయతో పాటు ఏషియా దేశాల కరెన్సీలన్నీ డాలర్లతో పోటీ పడలేకపోతున్నాయి.
నిన్న ముగిసినరేటు మీద ఈ రోజు 23 పాయింట్లు పడిపోయింది. గురువారం నాడు డాలర్ మారకం ధర రు.71.81 గా ముగిసింది. విదేశీ నిధులు బయటకు పోతు ఉండటం, భారతీయ అభివృద్ధి రేటు మందగించనుందనే భయం రుపాయపతనం మీద బాగా పనిచేసిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఫారిన్ ఇన్వెస్టర్లు గురువారం నాడు రు.902.99 కోట్ల విలువయిన ఈక్విటీలను వెనక్కి తీసుకున్నారని ఎక్చేంజ్ డేటా చెబుతూ ఉంది. దేశీయ ప్రగతి, అంతర్జాతయ ఆర్థిక ప్రగతి రెండు బలహీనంగా ఉండటం రుపాయని పతనం చేస్తున్నది.