బంగారు ప్యూరిటీ గురించి ఈ రహస్యాలు తెలుసా మీకు?

బంగారం మీద మోజులేనిదెవరికి?  దీనికి స్త్రీ పురుష వ్యత్యాసం లేదు. మామూలుగా మహిళలే ఆభరణాలు ధరిస్తారు.పూర్వం రాజులు కూడా భారీగా రాణుల్లాగానే ఆభరణాలు ధరించే వాళ్లు. ఇపుడు పురుషులు కూడా రకరకాల రూపాల్లో బంగారును ధరిస్తున్నారు.
 అందుకే నాలుగు డబ్బులు పోగవుతూనే చాలా మంది చేసే పని బంగారు నగలను కొనాలనడం.మరికొందరు ఇతర రూపాలలో బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తారు.  చాలా మంది బంగారాన్ని రెగ్యలర్ గా అంటే  అక్షయ తృతీయ అనో మరొకటనో ఏదో ఒక సందర్భం చేసుకుని  కొంటుంటారు.
Also Read: జైపాల్ రెడ్డి అంతిమ యాత్ర,పాడె మోస్తూ కంటతడిపెట్టిన కర్నాటక స్పీకర్ 
అయితే, విశేషమంటే, బంగారు కొనేవాళ్లలో చాలా మందికి బంగారం గురించి తెలియదు. బంగారులో కల్తీ ఉందా లేదా, బంగారు మీద కనిపించే హాల్ మార్క్ ముద్ర అర్థం ఏమిటి?, బంగారు నగల మీద ఉండే ఇతర నెంబర్లు, గుర్తులు ఏమి చెబుతాయి, బంగారు ధరలెలా పెరుగుతాయి, భవిష్యత్తులో బంగారు మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి… ఇలాంటి విషయాలేవీ తెసుకోకుండా చాలా మంది బంగారు కొంటుంటారు,అమ్మేస్తుంటారు.
బంగారు మెరుపు వెనక చాలా రహస్యాలున్నాయి. ఇలాంటి వాళ్ల కోసం కొన్ని బంగారు సత్యాలను ఇక నుంచి రెగ్యులర్ అందిస్తాం.
ఇది కూడా చదవండి: Dear కామ్రేడ్ మూవీ రివ్యూ
భారతదేశంలో బంగారు వినియోగం విపరీతంగా పెరుగుతూ ఉంది. 1982లో ఏటా 65 టన్ను లున్న వినియోగం ఇపుడు 800టన్నులకు పెరిగింది. ఇందులో 80 శాతం అభరణాల తయారీకే వెళ్లుంది. అభరణాల తయారీలో వాడే బంగారం 22 క్యారట్ల ప్యూరిటీ ఉండే రకం.  మిగతా బంగారంలో మరొక 15 శాతం ఇన్వెస్టర్ల కు వెళుతుంది. మిగతా అయిదు శాతం ఇండస్ట్రియ ల్ వాడకానికి వెళ్తుంది.
FICCI  జరిపిన ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలోని గోల్డ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ చాలా పెద్దది. ఇందులో దాదాపు 15 వేల మంది పనిచేస్తున్నారు. దీనికి సంబంధించిన 80 యూనిట్ల రెవిన్యూ 5 మిలియన్ల అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంది.
ఇండియాలో 4,50,000 బంగారు పనిచేసే కళాకారులున్నారు.  దాదాపు లక్షమంది చిన్నా పెద్ద అభరణాలమ్మే వ్యాపారులున్నారు.
అందుకే ప్యూరిటీ అనే దానికి బంగారు కొనుగోళ్లలో చాలా ప్రాముఖ్యం ఉంటుంది. ఈ మాయాబజార్ లో మోస పోకుండా మనం పెట్టే డబ్బుకు సమానమయిన ప్యూరిటీ బంగారు రావాలి.   బంగారు ప్యూరిటీ (స్వచ్ఛత) అంటే ఏమిటో ఇపుడు తెలుసుకుందాం. బంగారు ఎంత పెద్ద వ్యాపారమో కల్తీ కూడా అంతే పెద్దవ్యాపారమనే విషయం గుర్తుంచుకోవాలి.
ఏమరపాటుంటే బంగారు వ్యాపారంలో కల్తీ కనుగొనడం చాలా కష్టం. బంగారు వ్యాపారంలో ఎక్కువ భాగం నమ్మకం మీద  జరగుతూ ఉంటుంది. అందుకే కొనుగోలు దారులు సులభంగా మోసపోతూ ఉంటారు. కొనుగోలు దారులు మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఒక పథకం ప్రవేశపెట్టింది.అదే  హాల్  మార్కింగ్ పథకం.
ఈ పథకంలో వ్యాపారులు తమ బంగారం మేలిమి బంగారమని ప్రభుత్వం నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. ఈ సర్టిఫికేట్ ఉంటే వ్యాపారులు మోసం చేయలేరు. చేసినా కేసుపెట్టవచ్చు.
ఈ సర్టిఫికేట్ నే హాల్ మార్కింగ్ అంటారు. ఈ హాల్ మార్క్ (Hallmark)ని బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండర్డ్  (BIS)అనే ప్రభుత్వ సంస్థ  ఇస్తుంది.
బంగారం మీద Hallmark (కింద లోగో ఫోటో చూడండి) ముద్ర వేసేందుకు బిఐఎస్ లైసెన్స్ పొందిన వాళ్లుంటారు. వాళ్లని అసేయర్స్ (Assyaers)  అంటారు. ఈ Assaying and Hallmarking Centre లకు బిఐఎస్ IS 15820:2009 నియమాల ప్రకారం లైసెన్స్ ఇస్తుంది.
హాల్ మార్క్ అంటే…
బిఐఎస్  నిర్వచనం ప్రకారం ‘హాల్ మార్కింగ్’ అంటేబంగారు అభరణాలలో ఎంతమోతాదు బంగారు ఉందో కచ్చితంగా నిర్ధారించి అధికారికంగా ధృవీకరించడం.
“Hallmarking is the accurate determination and official recording of the proportionate content of precious metal in precious metal articles.”
అంటే బంగారు మీద ఉండే హాల్ మార్క్ గుర్తు ప్రభుత్వం అధికారికంగా బంగారు ప్యూరిటీ గురించి ఇచ్చిన సర్టిఫికేట్ అని అర్థం చేసుకోవాలి. బంగారానికి ఇలా ప్యూరిటీ హాల్ మార్క్ ఇవ్వడం చాలా దేశాల్లో ఉంది. ఇది  Vienna Convention 1972 అంతర్జాతీయ వప్పందం ప్రకారం జరుగుతుంది.ఈ ఒప్పందం మీద సంతకాలు చేసిన దేశాలన్నీ హాల్ మార్కింగ్ చేస్తాయి.
భారతదేశంలో రెండు లోహాలకు హాల్ మార్కింగ్ ఇస్తారు.అవి బంగారు, వెండి.
హాల్ మార్క్ ప్రయోజనం
బంగారు మీద హాల్ మార్కింగ్ ఉండటం వల్ల కొనుగోలుదారుడు మోసపోకుండా రక్షణ ఉంటుంది. ఇండియాలో బంగారు వెండి వినియోగం చాలా ఎక్కువ. ఈ వ్యాపారం కొన్నివేల కోట్ల  రుపాయల విలువయింది. అందువల్ల అక్రమాలు జరిగేందుకు అవకాశం ఉంది. దొంగబంగారం, దొంగ నగలు, దొంగ వ్యాపారులు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు.
అందువల్ల కొంటున్న బంగారు నమ్మకమయిందని, నాణ్యమయిందని వినియోగదారులకు హామీ ఇవ్వడమే హాల్ మార్కింగ్ అంటే.
తాను చెల్లించిన మొత్తానికి తగ్గట్టుగా మార్కెట్ ధర బట్టి వినియోగదారునికి మంచి బంగారు అందేలా హాల్ మార్క్ గ్యారంటీ ఇస్తుంది(Value for Money) . ఒక్క మాటలో చెబితే హాల్ మార్క్ అంటే  ప్రభుత్వం బంగారు కు హామీ ఇవ్వడం (Third party assurance) లాంటిది.
హాల్ మార్కింగ్  స్కీమ్ తప్పనిసరియా
కాదు.  ఆంది స్వచ్ఛందం. చాలామంది జ్యుయలర్స్ హాల్ మార్కింగ్ చేయించుకోరు. వాళ్ల ఇన్ హౌస్ హాల్ మార్కింగ్ చేసుకుంటారు. దీనికి BIS గ్యారంటీ ఉండదు. అందువల్లో మీరు బంగారు  కొనేముందు బిఐఎస్ హాల్ మార్క్ ఉందా లేదా చూసుకోవాలి.
ఇది కూడా చదవండి: శ్రీవారికి అజ్జాత భక్తుడు రు. 2.40 కోట్ల కానుక
ఈ స్కీమ్ ను బిఐఎస్ తన బ్రాంచ్ కార్యాలయాల ద్వారా అమలుచేస్తుంది. ఈ పథకం కింద బంగారానికి IS 1417, వెండికి IS 2112 మార్కింగ్ ఇస్తారు. బిఐఎస్ నుంచి లైసెన్స్ పొందిన అసేయింగ్ అండ్ హాల్ మార్కింగ్ సెంటర్లు ఈ హాల్ మార్కింగ్ ముద్ర వేస్తాయి. హా ల్ మార్క్ చేయించుకునే జ్యూయలర్స్ కు,  అసేయింగ్ సెంటర్ల కు సపరేట్ లోగో లుంటాయి.వీటిని బట్టి వ్యాపారులను గుర్తించవచ్చు.
హాల్ మార్కింగ్ చేయించుకోవడమెలా?
ఆయా ప్రాంతాలలో ఉండే బిఐఎస్ కార్యాలయంలో ముందుగా జ్యుయలర్స్ తగిన ఫీజు చెల్లించి ప్రిస్క్రయిబ్డ్ అప్లికేషన్ లో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. లైనెన్స్ ఉన్న జ్యుయలర్స్ మాత్రమే అసేయింగ్ అండ్  హాల్ మార్కింగ్ సెంటర్ లో  హాల్ మార్కింగ్ ముద్రణ చేయిస్తారు.
లైసెన్స్ పొందిన జ్యులయర్స్ జాబితా, లైసెన్స్ పొందిన అసేయింగ్ అండ్ హాల్ మార్కింగ్ సెంటర్ల జాబితా బిఐఎస్ వైబ్ సైట్ లో దొరుకుతాయి.
హాల్ మార్క్ లో ఏముంటాయి?
పైన పేర్కొన్న వివరాలలో  నాలుగు అంశాలున్నాయి. 1. ప్యూరిటి తెలుసుకోవలసిన బంగారు 1. బిఐఎస్ హాల్ మార్క్ 3. బంగారు అమ్మిన జ్యుయలర్ ఎవరు? 4.హాల్ మార్కింగ్ చేసిన అసేయింగ్ అండ్ హాల్ మార్కింగ్ సెంటర్ ఎక్కడుంది.2017లో హాల్ మార్కింగ్ నియమాలను సవరించిన తర్వాత అయిదో అంశం కూడా చేరింది. 5. అది హఆల్ మార్కింగ్ చేసిన సంవత్సరం.
బంగారు ప్యూరిటీ అంటే అర్థం ఏమిటి
ప్యూరిటీ గురించి చాలామంది  తెలియదు. హాల్ మార్కల్ లో తప్పనిసరిగా గమనించాల్సిన ముఖ్యమయిన విషయం ఇది. హాల్ మార్కింగ్ బంగారు ప్యూరిటీ గురించి రెండు అంశాలుంటాయి (కింద ఫోటో చూడండి). ఒకటి క్యారట్ . దీనిని KT లేదా K అని చూపిస్తారు. రెండో ది సుక్ష్మ పరిమాణం (fineness). దీనిని నెంబర్లలో చూపిస్తారు. ఉదాహరణకు మీ బంగారు 24 క్యారట్ల బంగారు అనుకోండి. అపుడు 24KT 1.0 అని హాల్ మార్కింగ్ లో చూపిస్తారు. అయితే, బంగారును అభరణంగా మార్చాలంటే ఇతర లోహాలను కొంత కలపాల్సి వుంటుంది. అపుడు నగంలో బంగారు శాతం తగ్గిపోతుంది. నగలో బంగారు, ఇతర లోహం ఎంత శాతంలో ఉన్నాయనే దానిని హాల్ మార్క్ చూపిస్తుంది. ఉదాహరణకు మీరు కొన్న నగ 22 క్యారెట్ల బంగారమయితే 22K916 అని ముద్రిస్తారు.అదే 18 క్యారట్ల బంగారం అయితే 18K750 అని ముద్రిస్తారు. అదే 14 కార్యట్ల బంగారమయితే 14K585 అనే నెంబర్ ముద్రిస్తారు. బంగారు కొనే వాళ్లు ఈ నెంబర్లను గుర్తుంచుకోవాలి.   భారతదేశంలో మూడు రకాల బంగారానికి మాత్రమే హాల్ మార్కింగ్ చేస్తారు. అవి 22 క్యారెట్లు, 18క్యారట్లు, 14 క్యారట్లు.
హాల్ మార్కింగ్ ఎలా చేస్తారు
హాల్ మార్కింగ్ అనేది అలాపోయి ఇలా ముద్రించుకుని రావడం కాదు. దీనికిముందు బంగారాన్ని పరీక్షిస్తారు.  దీనికి కనీసం ఆరుగంటల సమయం పడుతుంది. హాల్ మార్కింగ్ చేయడానికి ఒక్క నగకు రు. 35 చెల్లించాలి. కన్ సైన్ మెంట్ కయితే రు. 200 చార్జ్ చేస్తారు. జిఎస్ టి వగైరా అదనం.అప్పటికీ బంగారు ప్యూరిటీ గురించి మీరు ఫిర్యాదు చేయాలనుకుంటే ఇదీ అడ్రసు complaints@bis.org.in / icare@bis.org.in or by telefax at 011-23235069.
హాల్ మార్క్ లో ఉండే మార్కింగ్స్

 

బిఐఎస్ హాల్ మార్క్ లోగో
 (ఫీచర్ ఫోటో BIS వెబ్ సైట్ నుంచి)

https://trendingtelugunews.com/anonymous-devottee-offers-rs-2-40-crore-to-ttd-trusgt/